చాలా మంది సురక్షితమైన పెట్టుబడి పథకాల్లో పెట్టుబడి పెట్టాలని చూస్తారు. అలాంటి వారి కోసం పోస్ట్ ఆఫీస్ పథకాలు సరిగ్గా సరిపోతాయి. దేశం అంతటా తమ సొంత ఆకర్షణను కలిగి ఉన్నాయి. మార్కెట్ హెచ్చుతగ్గులకు భయపడి మార్కెట్-లింక్డ్ ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్‌లలో పెట్టుబడి పెట్టకూడదనుకునే చాలా మంది పెట్టుబడిదారులు పోస్ట్ ఆఫీస్ స్కీమ్‌లను స్థిరమైన ఆదాయ వనరుగా ఉన్నాయి.
ఇందులో పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ ఒక్కటి. పోస్ట్ ఆఫీస్ ద్వారా నిర్వహించబడే ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ గా ఉంది. ఇందులో 1, 2, 3, 5 సంవత్సరాల స్థిర వ్యవధుల్లో పెట్టుబడి పెట్టవచ్చు. కనీసం రూ. 1000 పెట్టుబడితో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.ఇందులో పెట్టుబడికి గరిష్ట పరిమితి లేదు. 10 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లల తరపున సంరక్షకుడు కూడా ఖాతాను తెరవవచ్చు.

ఈ పథకంలో 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు పెట్టుబడి పెట్టవచ్చు. ఫిబ్రవరి 5, 2024 నాటికి, వడ్డీ రేట్లు 6.9 శాతం, 7.0 శాతం, 7.1 శాతం 7.5 శాతంగా ఉంది. ఈ వడ్డీ రేటు మార్చి 31 వరకు అమలులో ఉంటుంది.ప్రతి మూడు నెలలకోసారి వడ్డీ సవరిస్తారు. వడ్డీ త్రైమాసిక ప్రాతిపదికన లెక్కిస్తారు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద 5 సంవత్సరాల పథకంపై పన్ను ప్రయోజనాలు కూడా అందుబాటులో ఉన్నాయి.
మీరు ఒక సంవత్సరానికి రూ. 10 లక్షలు పెట్టుబడి పెట్టి, దానిపై 6.9 శాతం వడ్డీని పొందినట్లయితే, పథకం పూర్తయిన తర్వాత మీకు రూ. 70806 వడ్డీ లభిస్తుంది. ఒక సంవత్సరం తర్వాత మీ రాబడి రూ. 1070806 అవుతుంది. రెండేళ్లపాటు రూ.10 లక్షలు ఇన్వెస్ట్ చేసి దానిపై 7.0 శాతం వడ్డీని పొందితే రూ.148882 వడ్డీగా, రూ.1148882 రాబడిగా లభిస్తుంది. మీ పెట్టుబడి మొత్తం మూడేళ్లకు రూ. 10 లక్షలు, వడ్డీ రేటు 7.1 శాతం అయితే, మీకు వడ్డీగా రూ. 235075 మొత్తం రాబడిగా రూ. 12,35,075 లభిస్తుంది.
More From GoodReturns

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications