మీరు బీఎస్‌ఎన్‌ఎల్ సిమ్ ఉపయోగిస్తున్నారా అయితే మీకో గుడ్ న్యూస్. ప్రభుత్వం యాజమాన్యంలోని బిఎస్ఎన్ఎల్ కస్టమర్లకు కొత్త లైఫ్ అందించడంలో బిజీగా ఉంది. బిఎస్ఎన్ఎల్ 5G సేవలను త్వరలోనే ప్రభుత్వం ప్రారంభించబోతోంది అని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. ఈ ప్రభుత్వ టెలికాం సంస్థ మంచి నెట్వర్క్ కవరేజ్ కోసం దేశంలో ఒక లక్ష టవర్లను కూడా ఏర్పాటు చేస్తుంది, అలాగే దీని వల్ల నెట్‌వర్క్ సమస్యను కూడా తొలగిస్తుంది.
ఆదాయంలో పెరుగుదల
టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారం, సింధియా మాట్లాడుతూ 'BSNL సొంత కాళ్ళపై నిలబడి ఉంది. గత 3-4 ఏళ్లలో కంపెనీ ఆదాయం 12% వృద్ధితో రూ.21 వేల కోట్లకు చేరుకుంది. ఇదే కాలంలో వ్యయం 2% తగ్గింది. BSNL EBITDA కూడా 2021 నుండి సానుకూలంగా మారింది. 2021లో నిర్వహణ లాభం రూ. 1100 కోట్లు, ఇది ఇప్పుడు రెట్టింపు కంటే ఎక్కువగా రూ.2300 కోట్లకు చేరుకుంది.

లక్ష టవర్లు
BSNL కూడా వేగంగా కాల్ కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది. వచ్చే ఏడాది మే లేదా జూన్ నాటికి లక్ష టవర్లను బిఎస్‌ఎన్‌ఎల్ ఏర్పాటు చేయాలని యోచిస్తోందని సింధియా చెప్పారు.
"ప్రభుత్వ యాజమాన్యంలోని C-DOT అండ్ టాటా యాజమాన్యంలోని తేజాస్ ద్వారా RAN (రేడియో యాక్సెస్ నెట్‌వర్క్)తో మా స్వంత 4G కోర్ సృష్టించాము" అని ఆయన చెప్పారు. TCS అనేది సిస్టమ్స్ ఇంటిగ్రేటర్. కాబట్టి, ఇది ఫుల్ ఇంటిగ్రేటెడ్ ఇండియా సొల్యూషన్. దాదాపు 62 వేల టవర్లు ఏర్పాటు చేశాం. ఇప్పుడు ప్రపంచంలోనే 4జీ హార్డ్‌వేర్, స్టాక్(stack) ఉన్న 5వ దేశంగా భారత్ నిలిచిందని చెప్పారు. వచ్చే ఏడాది మధ్య నాటికి లక్ష టవర్లను పూర్తి చేయడంతో పాటు బీఎస్‌ఎన్‌ఎల్ వాటిలో కొన్నింటిని 5జీ టెక్నాలజీకి మార్చడం ప్రారంభిస్తుందని సింధియా చెప్పారు.
ఇతర నెట్‌వర్క్‌లోకి
జియో, ఎయిర్‌టెల్, వోడా-ఐడియా వంటి ప్రైవేట్ కంపెనీల నుంచి బిఎస్‌ఎన్‌ఎల్‌కు మరీన వారు ఇప్పుడు మళ్ళీ ప్రైవేట్ కంపెనీల సేవలకి మారుతున్నారు. దీనికి ప్రధాన కారణం BSNL వీక్ నెట్‌వర్క్. చాలా మంది కస్టమర్లు కంపెనీకి మంచి నెట్‌వర్క్ లేకపోవడం వల్ల కాల్స్ సరిగ్గా మాట్లాడలేకపోతున్నారని ఫిర్యాదు చేశారు.
కంపెనీ ఇంకా 5G సేవలను ప్రారంభించలేదు. కాబట్టి సంస్థ 4G నెట్‌వర్క్ కూడా చాలా చోట్ల సరిగా లేదు, దీని కారణంగా కస్టమర్లు ఫాస్ట్ ఇంటర్నెట్ పొందలేకపోతున్నారు. అయితే, ప్రభుత్వం ఈ ప్లాన్‌తో కస్టమర్లను మళ్లీ BSNL బాటను అనుసరించే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications