సామాన్యులకు గుడ్ న్యూస్.. ఇప్పటివరకు ఉన్న నాలుగు జీఎస్టీ స్లాబ్‌లను కేవలం రెండు ప్రామాణిక రేట్లకు తగ్గించాలనే కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనకు మంత్రుల బృందం (GoM) అంగీకారం తెలిపింది. ప్రస్తుతం జీఎస్టీ రేట్లు 5%, 12%, 18%, 28% స్లాబ్‌లుగా ఉన్నాయి. వీటి స్థానంలో 12%, 28% రేట్లను రద్దు చేసి, కేవలం 5%, 18% స్లాబ్‌లను మాత్రమే కొనసాగించాలని ఈ బృందం నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని బీహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి ప్రకటించారు. ఆయన అధ్యక్షతన జరిగిన సమావేశంలో కేంద్ర ప్రతిపాదనకు GOM ఆమోదం లభించింది.
కేంద్ర ఆర్థిక శాఖ ప్రకారం, రేట్ల హేతుబద్ధీకరణ వల్ల పరోక్ష పన్ను వ్యవస్థ మరింత సులభతరం కానుందని తెలిపింది. గృహాలు, రైతులు, మధ్యతరగతి వర్గం, MSME లకు ఉపశమనం కలుగుతుందని కేంద్రం పేర్కొంది. అలాగే పారదర్శకత పెరగడమే కాకుండా, వృద్ధి ఆధారిత పాలనకు ఇది దోహదం చేస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా స్పష్టం చేశారు.

ప్రస్తుతం 12% స్లాబ్ కింద ఉన్న 99% వస్తువులు అన్నీ 5% స్లాబ్‌కు బదిలీ చేస్తారు. అలాగే 28% స్లాబ్ కింద ఉన్న 90% వస్తువులు 18% స్లాబ్‌లో పరిధిలోకి వస్తాయి.మిగిలిన 5-7 శాతం వస్తువులు, అంటే హానికర వస్తువులు (సిగరెట్లు, టొబాకో, లగ్జరీ వస్తువులు మొదలైనవి)పై ప్రత్యేకంగా 40% వరకు అధిక పన్ను విధించే అవకాశం ఉంది.
GoMలో ఆరుగురు సభ్యులు ఎవరంటే..
బీహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి (అధ్యక్షుడు)
ఉత్తరప్రదేశ్ ఆర్థిక మంత్రి సురేష్ కుమార్ ఖన్నా
రాజస్థాన్ ఆరోగ్య మంత్రి గజేంద్ర సింగ్
పశ్చిమ బెంగాల్ ఆర్థిక మంత్రి చంద్రిమా భట్టాచార్య
కర్ణాటక రెవెన్యూ మంత్రి కృష్ణ బైరే గౌడ
కేరళ ఆర్థిక మంత్రి కె.ఎన్. బాలగోపాల్
బుధవారం జరిగిన ప్రత్యేక సమావేశంలో మరో కీలక అంశంపై కూడా చర్చ జరిగింది. వ్యక్తుల ఆరోగ్య, జీవిత బీమా పాలసీలను GST నుండి మినహాయించాలని దాదాపు అన్ని రాష్ట్రాలు మద్దతు తెలిపాయి. అయితే, ఇది అమలులోకి వస్తే కేంద్రానికి సుమారు రూ. 9,700 కోట్ల వార్షిక ఆదాయ నష్టం వాటిల్లే అవకాశం ఉంది. అయినప్పటికీ పాలసీదారులకు ఉపశమనం కలగాలని రాష్ట్రాలన్నీ అంగీకారం తెలిపాయి.
ఈ మార్పులు అమలులోకి వస్తే.. వినియోగదారులకు ధరలు కొంత తగ్గే అవకాశం ఉంది, ముఖ్యంగా 12% కింద ఉన్న వస్తువులు ఇప్పుడు 5%కి వస్తే ధరలు తగ్గే అవకాశం ఉంది. వ్యాపారులకు పన్ను లెక్కలు సులభతరం అవుతాయి.అలాగే మధ్యతరగతి, రైతులు, చిన్న వ్యాపారాలకు నేరుగా ఉపశమనం దొరుకుతుంది. ప్రభుత్వ ఆదాయానికి కొంత ప్రభావం పడినా, దీర్ఘకాలంలో ఆర్థిక వృద్ధి వేగవంతమయ్యే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు.ఏదేమైనా కొత్త జీఎస్టీ వ్యవస్థ మరింత సులభతరం అవుతూ, ప్రజలకు, వ్యాపారులకు లాభదాయకంగా మారే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications