Ameerpet Metro: హైదరాబాద్ నగరంలో గోల్డ్ ఏటీఎంల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. కొనుగోలుదారుల నుంచి వస్తున్న ఆసక్తితో గోల్డ్ సిక్కా లిమిటెడ్ మరిన్ని ఏర్పాటుతో ముందుకు సాగుతోంది.
తాజాగా గోల్డ్‌సిక్కా లిమిటెడ్ అమీర్‌పేట మెట్రో స్టేషన్‌లో వినూత్నమైన గోల్డ్ ఏటీఎం రెండో వెర్షన్‌ను ప్రారంభించింది. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే జంక్షన్ మెట్రో స్టేషన్ కావటంతో ఈ గోల్డ్ ఏటీఎం పసిడి ప్రియులను ఆకర్షిస్తోంది.

వినియోగదారులు తాజాగా మెట్రో స్టేషన్లో ఏర్పాటు చేసిన గోల్డ్ ఏటీఎం ద్వారా 0.5 నుంచి 20 గ్రాముల వరకు బంగారు నాణేలను కొనుగోలు చేసేందుకు వెసులుబాటు ఉంది. అలాగే ఇందులో 10 నుంచి 100 గ్రాముల వరకు వెండి నాణేలను సైతం షాపింగ్ చేయెుచ్చని కంపెనీ అధికారి వెల్లడించారు. ATM LBMA నుంచి లైవ్ రేట్లను కూడా క్యాప్చర్ చేస్తుంది. కస్టమర్‌లు అత్యంత తాజా ధరలకు యాక్సెస్‌ను కలిగి ఉండేలా చూస్తుందని చెప్పారు.
కంపెనీ డెబిట్, క్రెడిట్ కార్డ్‌లతో పాటు UPIని ఉపయోగించి గోల్డ్ సిల్వర్ కాయిన్స్ కొనుగోలు చేసేందుకు సౌకర్యాన్ని కస్టమర్‌లకు పరిచయం చేసింది. గోల్డ్‌సిక్కా లిమిటెడ్ సీఈవో Sy Taruj, బంగారు ATM నూతన వెర్షన్ ప్రారంభ వెర్షన్ కంటే కొత్త ఫీచర్లతో అభివృద్ధి చేయబడిందని పేర్కొన్నారు. గతంలో ఏటీఎం నుంచి కేవలం గోల్డ్ కాయిన్స్ మాత్రమే పొందేందుకు వీలు ఉన్న విషయం మనకు తెలిసిందే. దీంతో హైదరాబాద్ నగరంలో రెండో గోల్డ్ ఏటీఎం ఏర్పాటు జరగటంపై అటు కంపెనీ, ఇటు పసిడి ప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!



Click it and Unblock the Notifications