Goldman Sachs: ప్రముఖ దేశీయ ఫిన్‌టెక్ సంస్థ పేటీఎంకు దెబ్బమీద దెబ్బ పడుతూనే ఉంది. పేమెంట్స్ బ్యాంక్‌పై రిజర్వ్ బ్యాంక్ ఆంక్షలతో మొదలైన ఇబ్బందులు కంపెనీకి ఊపిరి ఆడకుండా చేస్తున్నాయి. అవి ఇతర విభాగాలకు కూడా పాకి ఏకంగా పూర్తి సంస్థను నష్టాల్లోకి నెడుతున్నాయి. కంపెనీ గురించి శుభవార్త విన్న రోజుల వ్యవధిలోనే ఇన్వెస్టర్లను బ్యాడ్ న్యూస్ పలకరిస్తోంది.
పేటీఎం మాతృసంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్‌కు చెందిన 44.20 లక్షల షేర్లను గోల్డ్‌మన్ సాక్స్ సింగపూర్ బ్లాక్ డీల్ ద్వారా 183.44 కోట్లకు విక్రయించింది. ఒక్కోషేరు 415.04 చొప్పున సేల్ చేసినట్లు సమాచారం. విక్రయానికి ముందు సదరు ప్రైవేట్ ఈక్విటీ సంస్థకు పేటీఎంలో 1.32 శాతం వాటా అంటే 84 లక్షలకు పైగా షేర్లు ఉన్నాయి. కాగా ఇప్పుడు అవి సగానికిపైగా పడిపోయాయి.

తన సినిమా టికెటింగ్ వ్యాపారాన్ని జొమాటోకు విక్రయించాలని పేటీఎం చూస్తున్నట్లు నివేదికలు వెలువడటంతో పేటీఎం షేర్లు లాభపడ్డాయి. ఫుడ్ డెలివరీ యాప్ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించింది. 'మేము టికెటింగ్ వ్యాపారం గురించి పేటీఎంతో చర్చలు జరుపుతున్నాము. చట్టానికి అనుగుణంగా బోర్డు ఆమోదం తర్వాత తదుపరి చర్యలు ఉంటాయి. మా నాలుగు కీలక వ్యాపారాలను సమలేఖనం చేసుకుంటూ వాటిని బలోపేతం చేసే విధంగా త్వరలో నిర్ణయం తీసుకుంటాం' అని జొమాటో స్పష్టం చేసింది.
2020లో ఉబెర్ ఈట్స్‌ను జొమాటో కొనుగోలు చేసి తదనంతర ఏడాది క్విక్ కామర్స్ ప్లాట్‌ఫారమ్ బ్లింకిట్‌ను స్వాధీనం చేసుకుంది. వీటి తర్వాత ఫుడ్ డెలివరీ సంస్థ అతిపెద్ద కొనుగోలు ఇదే కానుంది. కాగా ఈ సమయంలో జొమాటోతో జరిపిన చర్చలన్నీ ప్రాథమికమైనవేనని ఫిన్‌టెక్ దిగ్గజం వివరణ ఇచ్చింది. పేటీఎం షేర్ల రెండు రోజులు విజయయాత్రకు నిన్న బ్రేక్ పడి నష్టాల్లోకి ముగిసింది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications