Gold Price: బంగారం ధర పెరగడమే తప్ప తగ్గడం ఉండదా.. గోల్డ్‌మన్ సాక్స్ సంచలన నివేదిక..!

గత సంవత్సరన్నర కాలంగా బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఈ పసిడి ధర ఇంకా పెరిగే అవకాశం ఉందని గోల్డ్‌మన్ సాక్స్ రీసెర్చ్ పేర్కొంది. 2026 ద్వితీయార్థంలో బంగారం మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. గోల్డ్‌మన్ సాక్స్ రీసెర్చ్‌లో సీనియర్ కమోడిటీస్ అనలిస్ట్ అయిన లీనా థామస్, గ్లోబల్ కమోడిటీస్ రీసెర్చ్ కో-హెడ్ అయిన డాన్ స్ట్రూవెన్ ఇందుకు సంబంధించి విశ్లేషణ చేశారు.

సెంట్రల్ బ్యాంకుల నుంచి బంగారానికి ఉన్న డిమాండ్ ఈ లోహం ర్యాలీకి మద్దతు ఇచ్చే ఒక కీలకమైన నిర్మాణాత్మక అంశంగా వారు వివరించారు. ఇటీవలి సర్వే ఆధారాలకు అనుగుణంగా భౌగోళిక-రాజకీయ, ఆర్థిక నష్టాల నుంచి రక్షణ పొందడానికి సెంట్రల్ బ్యాంకులు తమ నిల్వలను వైవిధ్యపరుస్తున్నాయని థామస్, స్ట్రూవెన్ పేర్కొన్నారు. అధిక స్థాయిలో సెంట్రల్ బ్యాంకుల బంగారు సమీకరణను తాము బహుళ-సంవత్సరాల ధోరణిగా చూస్తూనే ఉన్నామని వివరించారు.

Gold

విదేశీ కరెన్సీలలో ఉంచిన నిల్వలతో పోలిస్తే బంగారం స్తంభించిపోయే అవకాశం తక్కువగా ఉంటుందని భావించి, సెంట్రల్ బ్యాంకులు బంగారాన్ని ఉపయోగించి తమ హోల్డింగ్‌లను వైవిధ్యపరుస్తున్నాయని తెలిపారు. 2022 నుంచి సెంట్రల్ బ్యాంకులు బంగారాన్ని అధిక స్థాయిలో కొనుగోలు చేస్తున్నాయని.. ఆ సమయంలో ఉక్రెయిన్‌పై దాడికి ప్రతిస్పందనగా G7 దేశాలు ఐరోపాలోని రష్యన్ సెంట్రల్ బ్యాంక్ ఆస్తులను స్తంభింపజేశాయని గుర్తు చేశారు.

2022కు ముందు నెలకు సగటున 17 టన్నుల బంగారాన్ని కేంద్ర బ్యాంకులు కేంద్ర బ్యాంకులు కొనుగోలు చేసేవని.. 2026లో నెలకు సగటున 50 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయని వివరించారు. కేంద్ర బ్యాంకుల గత నెలలోని 66 టన్నుల బంగారం కొనుగోలు చేయగా.. ఇప్పుడు మరింత పెరిగిందని వివరించింది. చైనా కేంద్ర బ్యాంకు భారీగా పసిడిని కొనుగోలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. బంగారం ధరల పెరుగుదలకు వడ్డీ రేట్ల అంచనాలు మరో ముఖ్యమైన కారణంగా నిలుస్తున్నాయి. 2026లో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపుపై మార్కెట్లు తమ అంచనాలను తగ్గించుకోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.

2026 చివరి నాటికి బంగారం ధర ఒక ట్రాయ్ ఔన్సుకు $4,900కు చేరుకుంటుందన్న గోల్డ్‌మన్ సాక్స్ రీసెర్చ్ అంచనాలో గోల్డ్ డెరివేటివ్‌ల ద్వారా హెడ్జ్‌ల కోసం పెరిగిన డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకోలేదు. దీనివల్ల బంగారం ధర అంచనాను మించిపోయే అవకాశం ఉండొచ్చని చెబుతున్నారు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+