For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Goldman Sach's: ఆ దేశ పతనాన్ని ఎవరూ అడ్డుకోలేరు.. గోల్డ్‌మన్ సాక్స్ సంచలన ప్రకటన..!

|

Goldman Sach's: మాంద్యంపై వస్తున్న వరుస అంచనాలు ఒక్కటే చెబుతున్నాయి. అదేంటంటే.. ఈ ఏడాది చివరి నుంచి దాని తీవ్రత పెరుగుతుందని. దీనికి ఆందోళనకర స్థాయిలో ఉన్న ద్రవ్యోల్బణం ఆజ్యం పోస్తోంది. ఈ క్రమంలో ప్రముఖ రీసెర్చ్ సంస్థ గోల్డ్‌మన్ సాక్స్ సంచలన వ్యాఖ్యలు చేసింది.

 మాంద్యం సమయంలో..

మాంద్యం సమయంలో..

ప్రపంచం మాంద్యంలోకి దూకుతున్నందున్న తరుణంలో.. యూరప్, బ్రిటన్ మాత్రం చాలా పెద్ద ప్రమాదంలోకి జారుకుంటున్నాయి. ఇప్పటికే అక్కడ పెరుగుతున్న ధరలు, చమురు, గ్యాస్ ధరలకు తోడు బలపడుతున్న డాలర్ ఆర్థిక భారాన్ని పెంచుతోంది. ఒకప్పుడు ప్రపంచంపై పెత్తనం చేసిన సూర్యుడు అస్తమించని ఈ సామ్రాజ్యానికి చీకట్లు అలుముకుంటున్నాయి.

తిరోగమనం ఇలా..

తిరోగమనం ఇలా..

ముఖ్యమైన కారణాలను పరిగణలోకి తీసుకున్న బ్రిటన్ ఆర్థిక వృద్ధి స్థాయిని మైనస్ స్థాయికి తీసుకువచ్చింది. కొత్త ప్రధానిగా లిజ్ ట్రస్ నియమితులైన తర్వాత ఆర్థికంగా ప్రతికూలమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. 2023లో UK ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంటుందో గోల్డ్‌మన్ సాచ్స్ మునుపటి అంచనాలను మార్చింది.

ప్రధాన కారణం..

ప్రధాన కారణం..

బ్రిటీష్ ప్రధాన మంత్రిగా లిజ్ ట్రస్ నియామకం తర్వాత కార్పొరేట్ పన్నుపై విధించిన ఫ్రీజ్ ఆర్డర్‌ను తొలగించిన తర్వాత క్వాసీ క్వార్టెంగ్‌ను ఛాన్సలర్ పదవి నుంచి తొలగించారు. ఈ కారణాల దృష్ట్యా ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ గోల్డ్‌మన్ సాచ్స్ బ్రిటన్ మాంద్యంలోకి వెళ్లినట్లు తెలిపింది.

 గోల్డ్‌మన్ సాక్స్

గోల్డ్‌మన్ సాక్స్

గోల్డ్‌మన్ సాచ్స్ 2023లో UK ఆర్థిక వృద్ధిని -1 శాతం నుంచి 0.4 శాతంగా అంచనా వేసింది. 2023 చివరి నాటికి ద్రవ్యోల్బణం 3.1 శాతం నుంచి 3.3 శాతం మధ్య ఉండవచ్చని అంచనా వేసింది.

కార్పొరేట్ టాక్స్..

కార్పొరేట్ టాక్స్..

కార్పొరేట్ టాక్స్ 19 శాతం నుంచి యథాతథంగా ఉంటుందని బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ గతంలో అంచనా వేశారు. అయితే వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి కార్పొరేట్ పన్నును 25 శాతానికి పెంచుతున్నట్లు శుక్రవారం ప్రకటించారు. ఇది UK కంపెనీల వృద్ధిపై బాగా ప్రభావం చూపుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

English summary

Goldman Sach's: ఆ దేశ పతనాన్ని ఎవరూ అడ్డుకోలేరు.. గోల్డ్‌మన్ సాక్స్ సంచలన ప్రకటన..! | goldman sachs predicts europe faces recession soon with increased corporate tax

goldman sachs predicts europe faces recession soon with increased corporate tax
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X