IT News: IT సెక్టార్ వృద్ధిపై గోల్డ్‌మన్ శాక్స్ పాజిటివ్.. ఉద్యోగార్థులకు ఇక పండగే..
IT News: ఇండయా అభివృద్ధిలో IT రంగం కీలక పాత్ర పోషిస్తోంది. భారత జాబ్ మార్కెట్లో ఈ రంగానిది చాలా పెద్ద వాటా. విదేశీ నిధుల ప్రవాహానికి ప్రముఖ కారణం ఈ సెక్టార్. ప్రస్తుతం అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితి వల్ల IT రంగం కొంతమేర ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. ఈ వ్యవహారంపై ప్రముఖ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకింగ్ సంస్థ గోల్డ్ మన్ శాక్స్ గుడ్ న్యూస్ చెప్పింది.
కృత్రిమ మేధస్సు(AI) వినియోగం వల్ల భారత IT సేవలకు డిమాండ్ పెరుగుతున్నట్లు గోల్డ్ మన్ శాక్స్ తెలిపింది. తద్వారా IT కంపెనీలు ఆదాయ వృద్ధిని నమోదుచేయనున్నట్లు అంచనా వేసింది. 2025 నుంచి రాబడి 9-10 శాతం పెరుగుతుందని భావిస్తోంది. ఈ మధ్య కాలంలో ఆయా కంపెనీల వృద్ధి కొంతమేర స్తబ్ధుగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది.

"గత 10 ఏళ్లలో భారతీయ IT సేవల కంపెనీలు తమ మార్కెట్ వాటాను రెట్టింపు చేశాయి" అని మనీష్ అదుకియా నేతృత్వంలోని గోల్డ్ మన్ శాక్స్ విశ్లేషకులు వెల్లడించారు. వైవిధ్యమైన, నైపుణ్యం కలిగిన, తక్కువ ధరలో లభించే శ్రామిక శక్తి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని.. భారతీయ IT సంస్థల వైపు వివిధ దేశాలు మొగ్గుచూపుతున్నట్లు చెప్పారు.
నిఫ్టీ IT ఇండెక్స్ కూడా ఈ ఏడాది సుమారు 8 శాతం పెరిగింది. గత సంవత్సరం 26 శాతం డౌన్ కాగా.. తిరిగి పుంజుకోవాలని ప్రయత్నిస్తోంది. ఈ రంగం నిర్వహణ లాభం వృద్ధి 2025-26 మధ్య 12-15 శాతం వరకు ఉంటుందని అంచనా. ఇన్ఫోసిస్, TCS, LTI Mindtree వంటి అగ్ర సంస్థలపై బలమైన ఆదాయ వృద్ధి అంచనాలు ఉన్నట్లు గోల్డ్ మన్ శాక్స్ నివేదించింది.


Click it and Unblock the Notifications