Adani News: దేశంలో ప్రఖ్యాత బిజినెస్ టైకూన్ గౌతమ్ అదానీ కంపెనీల్లోకి పెట్టుబడి సంస్థల డబ్బు కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతోంది. ఒక్కసారిగా ఈ ఇన్వెస్ట్మెంట్ ప్రవాహానికి కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఆగస్టు 16న అదానీ పవర్ కంపెనీ షేర్లలో రెండు అతిపెద్ద బల్క్ డీల్స్ జరిగాయి. ఇందులో ఒకటి GQG పార్టనర్స్ ఎమర్జింగ్ మార్కెటింగ్ ఈక్విటీ ఫండ్ చేపట్టింది. ఈ క్రమంలో ఫండ్ 4.90 కోట్ల షేర్లను ఒక్కోటి రూ.279.15 చొప్పున కొనుగోలు చేసింది. దీనికి తోడు మరో ప్రఖ్యాత ఇన్వెస్ట్మెంట్ సంస్థ గోల్డ్‌మస్ సాచ్స్ సైతం అదానీ పవర్ షేర్లపై పందెం వేసింది. గోల్డ్‌మస్ సాచ్స్ GQG పార్టనర్స్ ఇంటర్నేషనల్ ఆపర్చునిటీ ఫండ్ 10.30 కోట్ల షేర్లను బల్క్ డీల్ ద్వారా కొనుగోలు చేసింది. రూ.2,876 కోట్ల విలువైన అదానీ పవర్ షేర్లను Goldman Sachs తాజాగా కొనుగోలు చేసింది.

ఇదే క్రమంలో నిన్న ఆఫ్రో ఏషియా ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్ 26.54 కోట్ల షేర్లను రూ.279.18 చొప్పున విక్రయించింది. ఇదే సమయంలో వరల్డ్ వైడ్ ఎమర్జింగ్ మార్కెట్ హోల్డింగ్ లిమిటెడ్ అదానీ పవర్ కు చెందిన 4.66 కోట్ల షేర్లను రూ.279.16 రేటుకు విక్రయించినట్లు బీఎస్ఈ అధికారిక డేటా వెల్లడించింది. అయితే అంతర్జాతీయ సంస్థల పెట్టుబడి నేపథ్యంలో స్టాక్ మధ్యాహ్నం 1.37 గంటల సమయంలో 1.47 శాతం లాభపడి రూ.283.4 వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తోంది.
అదానీ పవర్ లో 8.1 శాతం ఈక్విటీ వాటాలను సొంతం చేసుకుంది. బల్క్ డీల్ ద్వారా భారీగా షేర్లు చేతులు మారాయని వెల్లడైంది. ఈ డీల్ విలువ రూ.9,000 కోట్లుగా ఉన్నట్లు నిన్న మార్కెట్ ముగిసిన తర్వాత బయటకొచ్చింది. ఈ వార్తల నేపథ్యంలో అదానీ పవర్ స్టాక్ నేడు మార్కెట్లో 9.30 గంటల సమయంలో లాభపడి రూ.284.70 వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తోంది.
హిండెన్‌బర్గ్ రీసెర్చ్ రిపోర్టు విడుదల తర్వాత అదానీ గ్రూప్ మార్కెట్ విలువలో సగానికి పైగా నష్టపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మార్చి మాసంలో US-ఆధారిత GQG భాగస్వాములు అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్, అదానీ ట్రాన్స్‌మిషన్, అదానీ గ్రీన్ ఎనర్జీ కంపెనీల్లో మెుత్తంగా 1.87 బిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టింది. ఆ తర్వాత జూన్ నెలలో మరో 1 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేయగా.. తాజాగా మరోసారి పెట్టుబడులను పెంచుకున్నట్లు డీల్ వెల్లడించింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications