Gold Price: బంగారం ధర భారీగా పెరిగే ఛాన్స్.. 2027 చివరి నాటికి 5,400 డాలర్లకు చేరుతుందని అంచనా..!

బంగారం ధరలు అస్థిరంగా కొనసాగుతున్నాయి. ఒక రోజు పెరిగితే మరో రోజు తగ్గుతున్నాయి. అయినప్పటికీ పసిడి ధరలు భారీగానే ఉన్నాయి. ప్రస్తుతం 24 క్యారెట్లు తులం బంగారం ధర రూ.1,55,840 వద్ద ట్రేడవుతోంది. అయితే ఈ బంగారం ధరలు ఇలానే ఉంటాయా.. లేక ఇంకా పెరుగుతాయా అనే సందేహాలు వస్తున్నాయి. తాజాగా అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లను పెంచినప్పటికీ బంగారంపై గోల్డ్‌మన్‌ శాక్స్‌ పాజిటివ్ గా నే ఉంది. దీర్ఘకాలంలో బంగారం ధరలు పెరిగే అవకాశం ఉందని ఆ సంస్థ అంచనా వేసిది. సమీప కాలంలో ధరల పెరుగుదల వేగం తగ్గొచ్చని అంచనా వేసింది. 2027 చివరినాటికి బంగారం ఔన్సు ధర 4,400 డాలర్లకు పెరుగుతుందన్న అంచనానను కాదని.. 5,400 డాలర్లకు చేరే అవకాశం ఉందని పేర్కొంది.

ఈ ఏడాది చివరికి పసిడి ధరలు కాస్త తగ్గే అవకాశం ఉందని గోల్డ్‌మన్‌ శాక్స్‌ అంచనా వేసింది. గతంలో 4,900 డాలర్లకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేయగా.. దాన్ని 4,650 డాలర్లకు తగ్గించింది. అమెరికా ద్రవ్య విధానం బంగారంపై కొంత ఒత్తిడి చూపుతుందని గోల్డ్‌మన్‌ శాక్స్ అంచనా వేసింది. సెప్టెంబర్‌ 16న ఫెడ్‌ కీలక వడ్డీ రేటును 25 బేసిస్‌ పాయింట్లు పెంచి 3.75-4 శాతానికి పెంచింది. 2023 తర్వాత అమెరికా కేంద్ర బ్యాంక్‌ రేట్లను పెంచడం ఇదే మొదటిసారి. ఇన్ఫ్లేషన్ ఇంకా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మరోసారి ఫెడ్ వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. అక్టోబర్‌లో మరో 25 బేసిస్‌ పాయింట్ల పెంపు జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Gold

అధిక వడ్డీ రేట్లు, పెరిగే బాండ్‌ ఈల్డ్స్‌, బలపడే డాలర్‌ వంటి అంశాలు తక్కువ కాలంలో బంగారంపై ఒత్తిడి పెంచే అవకాశం ఉందని గోల్డ్‌మన్‌ శాక్స్‌ అంచనా వేసింది. అధిక వడ్డీ రేట్ల ప్రభావాన్ని కేంద్ర బ్యాంకుల బలమైన బంగారం కొనుగోళ్లు కొంతవరకు భర్తీ చేసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రస్తుతం కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు నెలకు దాదాపు 91 టన్నుల స్థాయిలో ఉన్నాయని తెలిపింది. 2022కు ముందు ఉన్న సగటు నెలవారీ కొనుగోళ్లతో పోలిస్తే ఇది భారీగా పెరిగినట్లు చెప్పింది. ఈటీఎఫ్‌ల (ETF) డిమాండ్‌ కూడా కీలకమేనని సంస్థ విశ్లేషించింది. వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ ప్రకారం ఆగస్టులో ప్రపంచ గోల్డ్‌ ఈటీఎఫ్‌ల్లోకి 18 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు వచ్చినట్లు గుర్తు చేసింది. దీంతో గోల్డ్‌ ఈటీఎఫ్‌ల మొత్తం ఆస్తులు 16 శాతం పెరిగి 615 బిలియన్‌ డాలర్లకు పెరగడంతో పాటు వాటి వద్ద ఉన్న బంగారం 4,189 టన్నుల రికార్డు స్థాయికి చేరిందని తెలిపింది.

సెంట్రల్ బ్యాంకుల నుంచి కొనుగోలు డిమాండ్, ఈటీఎఫ్ భారీగా పసిడి కొనుగోలు చేయడం వల్ల బంగారానికి డిమాండ్ భారీగా పెరిగే అవకాశం ఉందని గోల్డ్‌మన్‌ శాక్స్‌ అంచనా వేసింది. సెప్టెంబర్‌ 2027 నుంచి మార్చి 2028 మధ్య ఫెడ్‌ మూడు సార్లు రేట్లు తగ్గించే అవకాశం ఉందని భావిస్తున్నట్లు తెలిపింది. అందుకే 2027 లక్ష్యాన్ని 5,400 డాలర్లకు పెంచినట్లు వివరించింది.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+