Gold News: పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. పసిడి ధరల పెరుగుదలపై షాకింగ్ రిపోర్ట్..
Gold Price 2025: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల తర్వాత పసిడి ధరలు భారీ ఒడిదొడుకులను చూస్తున్నాయి. ఇది పెట్టుబడిదారులకు సరైన సమయంగా నిపుణులు చెబుతున్నారు. రిటైల్ కొనుగోలుదారులు మాత్రం ప్రస్తుత ధరలతో ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఈ క్రమంలోనే 2025లో గోల్డ్ ధరలపై విదేశీ బ్రోకరేజ్ గోల్డ్‍మాన్ సాక్స్ తన నివేదికను ప్రకటించింది.
భారతదేశంలో పసిడికి ఎల్లప్పుడూ డిమాండ్ అధికంగానే ఉంటుందని తెలిసిందే. ఈ క్రమంలో డిసెంబర్ 2025 నాటికి గోల్డ్ ధర బులిష్ వ్యూలో ఔన్సుకు 3150 డాలర్ల మార్కును చేరుకుంటుందని గోల్డ్ మాన్ సాక్స్ అంచనా వేస్తోంది. ఇది ప్రస్తుత మార్కెట్ ధర కంటే 19 శాతం అధికం. చాలా మంది పెట్టుబడిదారులు పసిడిని ద్రవ్యోల్బణాన్ని అధిగమించటానికి సేఫ్ హెవెన్ గా వినియోగించటంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు సైతం పసిడి ధరలను నిరంతరం ప్రభావితం చేస్తున్నాయని బ్రోకరేజ్ పేర్కొంది.

అయితే గోల్డ్ మాన్ సాక్స్ అంచనాల ప్రకారం అధిక భాగం గోల్డ్ రేట్ల పెరుగుదలకు కారణం గ్లోబల్ సెంట్రల్ బ్యాంకుల నుంచి పెరిగే డిమాండ్ కారణంగా ఉంటుందని పేర్కొంది. దీనికి తోడు యూఎస్ ఆర్థిక స్థిరత్వం, వాణిజ్య ఉద్రిక్తతలు/యుద్ధాలపై ఆందోళనలు పసిడి ధరలను పెంచుతాయని వారు భావిస్తున్నారు. ఇదే క్రమంలో డిసెంబర్ 2025 నాటికి 3000 డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేస్తోంది. ద్రవ్యోల్బణంతో పాటు అమెరికా అప్పులపై ఆందోళనలు సెంట్రల్ బ్యాంకులను మరింతగా బంగారాన్ని కొనుగోలు చేసేందుకు పురిగొల్పుతుందని ప్రధానంగా భారీగా అమెరికా ట్రెజరీ రిజర్వులు కలిగి ఉన్న దేశీలు పసిడిని అధికంగా కొనుగోలు చేసే అవకాశం ఉందని గోల్డ్ మాన్ శాక్స్ పేర్కొంది.
ఇదే క్రమంలో యూబీఎస్ సైతం పసిడి ధరలు డిసెంబర్ 2025 నాటికి ఔన్సుకు 2,900 డాలర్లకు చేరుకుంటుందని పేర్కొంది. ఇదే క్రమంలో గరిష్ఠ స్థితిలో ఇది 3000 డాలర్లుగా ఉండొచ్చని అంచనాలను డిసెంబర్ 2025 కోసం పంచుకుంది. అయితే సమీప కాలంలో పసిడి ధరలు కన్సాలిడేట్ అవుతాయని అంచనా వేసింది. 2024 చివరి నాటికి ఔన్సు బంగారానికి పసిడి ధర టార్గెట్ ను 2700 డాలర్లుగా ఉంచింది. అయితే కొత్త అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉందని యూబీఎస్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ వెల్లడించింది.
క్రూడ్ ఆయిల్ ధరల పరిస్థితి..
గోల్డ్‌మ్యాన్ సాచ్స్ అంచనాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా గోరువెచ్చని డిమాండ్, అదనపు సరఫరా సామర్థ్యం వల్ల రానున్న ఏడాదిలో బ్యారెల్ చమురు ధర 70-85 డాలర్ల మధ్యలో కొనసాగుతుందని బ్రోకరేజ్ అంచనా వేసింది. భౌగోళిక రాజకీయాలు ప్రధాన దశకు చేరుకుని సరఫరాకు అంతరాయం కలిగించిన పరిస్థితుల్లో, హార్ముజ్ జలసంధి మూసివేయబడుతుంది. కొత్త US పరిపాలన ఇరాన్ సరఫరాకు మరింత ప్రమాదాలను పెంచుతుంది. 2025 డిసెంబర్ చివరి నాటికి ఈ క్రమంలో బ్రెంట్ ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్లకు పెరుగుతుందని గోల్డ్‌మన్ సాచ్స్ అంచనా వేసింది


Click it and Unblock the Notifications