ఈమధ్య పసిడి లక్ష రూపాయల మార్కును తాకిన సంగతి విదితమే. రోజు రోజుకు దాని ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పసిడి ప్రియులకు శుభవార్తను అందించింది గోల్డ్ మాన్ సాచ్స్. బంగారం ధరల ఇక పెరిగే అవకావం లేదంటూ చెప్పుకొచ్చింది. బంగారంపై..అమెరికా అదనపు సుంకాల ముప్పు లేదని అంచనా వేసింది. పసిడి ప్రియులు ఊపిరి పీల్చుకోవచ్చని తెలిపింది.
భారతదేశంతో పాటు అనేక దేశాల నుండి దిగుమతి అవుతున్న బంగారంపై అమెరికా ఇప్పటికే 10 శాతం పరస్పర సుంకం రేటును విధించిన సంగతి విదితమే. ఈ నిర్ణయం అమలులోకి వచ్చిన తర్వాత నుంచి మార్కెట్లో బంగారంపై ఇంకా ఎక్కువ సుంకాలు విధించబడవచ్చనే ఆందోళనలు ఒక్కసారిగా పెరిగాయి. ఈ వార్తల నేపథ్యంలో ప్రముఖ గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ గోల్డ్‌మన్ సాచ్స్ తాజా నివేదిక విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం.. ఏప్రిల్ నుండి ఇప్పటివరకు బంగారంపై అదనపు సుంకాల ముప్పుకు ఎలాంటి సంకేతాలు కనిపించడం లేదు.

గోల్డ్‌మన్ సాచ్స్ ప్రకారం.. సమీప భవిష్యత్తులో అమెరికా.. బంగారంపై కొత్త సుంకాలు విధించే అవకాశం చాలా తక్కువగా ఉన్నాయని తెలిపింది. ప్రస్తుతం ఉన్న 10 శాతం పరస్పర సుంకం బంగారం డిమాండ్ లేదా సరఫరాపై గణనీయమైన ప్రభావం చూపదని తెలిపింది. ఇది పెట్టుబడిదారులకు ఒక సానుకూల సంకేతంగా ఉండనుంది. ఎందుకంటే అదనపు సుంకాల భయం తగ్గిపోవడం వల్ల బంగారం ధరలు తగ్గుతాయని అంచనా వేసింది.
గోల్డ్‌మన్ సాచ్స్ ప్రకారం.. బంగారం ధరల అంచనా..
2025 చివరి నాటికి: లండన్ స్పాట్ Gold ధర ఔన్సుకు 3,700 డాలర్లకు చేరే అవకాశం ఉంది.
2026 మధ్య నాటికి: ధరలు ఔన్సుకు 4,000 డాలర్లకు చేరవచ్చు.
ప్రస్తుత డాలర్-రూపాయి మారకం రేటు రూ. 83/USDగా ఉంది. ఒక ఔన్స్ Gold బరువు 31.1 గ్రాములు అని పరిగణిస్తే.. 2025 చివరినాటికి కిలో బంగారం దాదాపు రూ. 9.88 లక్షలు. అంటే 10 గ్రాములు 98,800కు చేరే అవకాశం ఉంది.ఇక 2026 మధ్య నాటికి కిలో బంగారం దాదాపు రూ. 10.67 లక్షలు. అంటే 10 గ్రాములకు రూ. 1,06,700 కు చేరే అవకాశం ఉందని అంచనా వేసింది. కాగా బంగారం వాస్తవ ధరలు డాలర్-రూపాయి మారకం రేటుపై ఆధారపడి ఉంటాయని గమనించాలి.
బంగారం ధరలు పెరగడానికి ప్రధాన కారణాలు
ప్రపంచ అనిశ్చితి: భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, బలహీనమైన ఆర్థిక వృద్ధి బంగారం డిమాండ్‌ను పెంచుతాయి.
కేంద్ర బ్యాంకు కొనుగోళ్లు: ప్రపంచంలోని అనేక ప్రధాన కేంద్ర బ్యాంకులు తమ బంగారు నిల్వలను పెంచుకుంటూ పోతున్నాయి, ఇది మార్కెట్లో సరఫరా ఒత్తిడిని పెంచుతోంది.
డాలర్ సూచిక హెచ్చుతగ్గులు: డాలర్ బలహీనపడినప్పుడు, బంగారం ధరలు సాధారణంగా పెరుగుతాయి. ఎందుకంటే పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడి సాధనంగా బంగారాన్ని కోరుకుంటారు. అలాగే డాలర్ పెరిగితే బంగారం మీద నుంచి దాని మీదకు పెట్టుబడులను మళ్లిస్తారు.
గోల్డ్‌మన్ సాచ్స్ అంచనాల ప్రకారం.. రాబోయే 12-18 నెలల్లో బంగారం ధరలు స్వల్ప మార్పులు వచ్చే అవకాశం ఉంది. దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు ఇది బలమైన సానుకూల సంకేతంగా చెప్పుకోవచ్చు. స్వల్పకాలంలో ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు కానీ సుంకాల కొత్త ముప్పు లేకపోవడం బంగారం మార్కెట్‌కు స్థిరత్వాన్ని అందిస్తుందని తెలిపింది. ఏది ఏమైనా గోల్డ్‌మన్ సాచ్స్ నివేదిక బంగారం మార్కెట్‌కి కొత్త ఆశలను కల్పిస్తోంది. అయితే టారిఫ్ ముప్పు లేకపోయినా.. ధరల పెరుగుదల కొనసాగుతుందని చెప్పడం సామాన్యులను కొంచెం నిరాశపరిచే అంశంగా చెప్పుకోవచ్చు.
డిస్క్లైమర్: ఈ వ్యాసం కేవలం సమాచారం కోసం మాత్రమే అందించబడింది. ఇది విలువైన లోహాలు, వస్తువులు, స్టాకులు లేదా ఇతర ఆర్థిక పెట్టుబడులను కొనుగోలు చేయమని లేదా అమ్మమని చెప్పడం కాదు. ఈ వ్యాసంలోని సమాచారం ఆధారంగా ఎవరైనా నష్టాలు లేదా సమస్యలను ఎదుర్కొంటే, గ్రేనియమ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థలు, భాగస్వాములు లేదా రచయితలు ఎలాంటి బాధ్యత వహించరు. కాబట్టి మీరు ఏవైనా లావాదేవీలు జరిపే ముందు నిపుణులను సంప్రదించి నిర్ణయం తీసుకోండి.
More From GoodReturns

Iran war: త్వరలోనే యుద్ధం ముగింపు? ట్రంప్ వ్యాఖ్యలతో చమురు ధరల్లో భారీ మార్పు!

Iran war: కేవలం గ్యాస్ ఒక్కటే కాదు.. ఈ 5 రంగాలపై భారీ ఎఫెక్ట్ ఉండే అవకాశం?

ఇరాన్ తర్వాత ఈక్వెడార్ మీద గురిపెట్టిన అమెరికా... నార్కో-టెర్రరిస్ట్ గ్రూపులను ఏరిపారేస్తున్న ట్రంప్ సైన్యం..

Russian oil: ట్రంప్ క్లెయిమ్ VS రియాలిటీ.. రష్యా ఆయిల్ కొనుగోలుపై క్లారిటీ ఇచ్చిన న్యూఢిల్లీ!

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..



Click it and Unblock the Notifications