IPO News: మార్కెట్లోకి వచ్చేస్తున్న హోటల్ ఐపీవో.. గోల్డ్‌మన్ శాక్స్ మద్ధతుతో..
IPO News: ఈ నెల 14న మార్కెట్లోకి ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సంస్థ గోల్డ్‌మన్ శాక్స్ మద్దతుగల సంహీ హోటల్స్ ఐపీవోకు వస్తోంది. సెప్టెంబర్ 14న పబ్లిక్ సబ్‌స్క్రిప్షన్ కోసం తెరవబడుతోంది.
యాంకర్ ఇన్వెస్టర్ల బిడ్డింగ్ కోసం ఐపీవో సెప్టెంబర్ 13న తెరవబడుతోంది. రిటైల్ ఇన్వెస్టర్ల కోసం మూడు రోజుల పాటు అందుబాటులో ఉండనున్న ఐపీవో సెప్టెంబర్ 18న ముగుస్తుంది. గురుగ్రామ్ కేంద్రంగా పనిచేస్తున్న కంపెనీ ప్రైస్ బ్యాండ్ ఇంకా ప్రకటించలేదు. అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం కంపెనీ ఐపీవో నుంచి రూ.1,200 కోట్ల సమీకరించాలని నిర్ణయించింది. దీనికి ముందు కంపెనీ రూ.1,000 కోట్లు సమీకరణను లక్ష్యంగా పెట్టుకుంది.

సంహీ హోటల్స్ రూ.1,200 కోట్ల ఐపీవోలో తాజా ఈక్విటీ షేర్ల ఇష్యూతో పాటు ప్రస్తుత ఇన్వెస్టర్లకు చెందిన 1.35 కోట్ల ఈక్విటీ షేర్ల ఆఫర్ ఫర్ సేల్(OFS) కూడా ఉంటుందని వెల్లడైంది. OFSలో బ్లూ చంద్ర ప్రైవేట్ లిమిటెడ్ 84.28 లక్షల ఈక్విటీ షేర్లు, గోల్డ్‌మన్ శాక్స్ ఇన్వెస్ట్‌మెంట్స్ హోల్డింగ్స్ (ఆసియా) లిమిటెడ్ 49.31 లక్షల ఈక్విటీ షేర్లు, GTI క్యాపిటల్ ఆల్ఫా ప్రైవేట్ లిమిటెడ్ 1.4 లక్షల ఈక్విటీ షేర్లను విక్రయించనున్నాయి.

2019లో ఐపీవోకు అనుమతులు పొందినప్పటికీ కంపెనీ దానిని ముందుకు తీసుకెళ్లలేదు. తాజా ఐపీవో ద్వారా వచ్చే ఆదాయంలో రూ.750 కోట్లను రుణాల చెల్లింపులకు, కార్పొరేట్ ప్రయోజనాల కోసం వినియోగించాలని కంపెనీ నిర్ణయించింది. ఫిబ్రవరి 28, 2023 నాటికి బెంగళూరు, హైదరాబాద్, నేషనల్ క్యాపిటల్ రీజియన్ (NCR), పూణె, చెన్నై, అహ్మదాబాద్‌లతో సహా దేశంలోని 12 ప్రధాన పట్టణ వినియోగదారుల కేంద్రాల్లో 25 ఆపరేటింగ్ హోటళ్లలో 3,839-కీ గదుల పోర్ట్‌ఫోలియోను సంహీ కలిగి ఉంది. అలాగే మారియట్, హయాట్, IHG వంటి గ్లోబల్ హోటల్ ఆపరేటర్‌లతో దీర్ఘకాలిక నిర్వహణ ఒప్పందాల క్రింద పనిచేస్తుంది.


Click it and Unblock the Notifications