భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) ఆగస్టు 11, 2025న గడువు ముగిసే రెండు దశల సావరిన్ గోల్డ్ బాండ్ల (SGBలు)కు ముందస్తు రిడెంప్షన్ ధరను ప్రకటించింది. RBI కీలక ప్రకటనతో.. పెట్టుబడిదారులు తమ పెట్టుబడులపై విశేష లాభాలను అందుకునే అవకాశం కలగనుంది.
రిజర్వ్ బ్యాంక్ ఇండియా వెల్లడించిన వివరాల ప్రకారం.. 2019-20 సిరీస్ IX (ఫిబ్రవరి 2020లో జారీ), 2020-21 సిరీస్ V (ఆగస్టు 2020లో జారీ) SGB లను గ్రాముకు రూ. 10,070 చొప్పున ముందస్తుగా రిడీమ్ చేసుకోవచ్చని తెలిపింది. SGBలకు సాధారణంగా ఎనిమిదేళ్ల మెచ్యూరిటీ గడువు ఉంటుంది. అయితే ఆర్బీఐ ప్రకటన ప్రకారం.. పెట్టుబడిదారులు ఐదవ సంవత్సరం ముగిసిన తర్వాత ముందస్తుగా రిడెంప్షన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
ఫిబ్రవరి 2020లో విడుదలైన సిరీస్ IX ట్రాన్చ్‌లో పెట్టుబడి పెట్టినవారికి 20 శాతం కాంపౌండెడ్ వార్షిక వృద్ధి రేటు (CAGR) లభించింది. అలాగేఆగస్టు 2020లో విడుదలైన సిరీస్ V ట్రాన్చ్ పెట్టుబడిదారులకు ఐదేళ్లలో 13.5 శాతం CAGR అందించింది. ఈ లాభాలకు అదనంగా రెండు ట్రాన్చ్‌లు కూడా సంవత్సరానికి 2.5 శాతం వడ్డీని ఆరు నెలల కాలానికి చెల్లించడం వల్ల పెట్టుబడిదారులు అందుకునే మొత్తం మరింత పెరగనుంది.

ఫిబ్రవరి 2020లో సిరీస్ IX విడుదలైనప్పుడు బంగారం ధర గ్రాముకు రూ. 4,070గా ఉంది. అప్పటి COVID మహమ్మారి భయంతో ఇన్వెస్టర్లు సురక్షిత ఆస్తుల వైపు మళ్లిన కారణంగా బంగారం ధరలు పెరిగాయి. ఆగస్టు 2020లో సిరీస్ V విడుదలయ్యేసరికి గ్రాముకు రూ. 5,334 చేరుకున్నాయి. తర్వాతి ఐదేళ్లలో ద్రవ్యోల్బణ భయాలు, అంతర్జాతీయ రాజకీయ ఉద్రిక్తతలు, వడ్డీ రేటు కోతలు, కేంద్ర బ్యాంకుల నిరంతర బంగారం కొనుగోళ్లు బంగారం ధరలను రికార్డు స్థాయికి చేర్చాయి. ప్రస్తుతం గ్రాము ధర రూ. 10,070కి చేరింది.
నిపుణుల అంచనా ప్రకారం.. ప్రపంచ భౌగోళిక రాజకీయ పరిస్థితులు, US డాలర్ రిజర్వ్ స్థితికి ఎదురవుతున్న సవాళ్లు, అలాగే కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు, రాబోయే సంవత్సరాల్లో బంగారం ధరలను మరింత పెంచే అవకాశాలు ఉన్నాయని సమాచారం.
సావరిన్ గోల్డ్ బాండ్లు అంటే.. గ్రాముల బంగారంలో సూచించబడిన ప్రభుత్వ మద్దతు గల సెక్యూరిటీలు. ప్రత్యక్ష బంగారాన్ని నిల్వ చేయాల్సిన అవసరం లేకుండా..ధర పెరుగుదలతో పాటు అర్ధవార్షిక వడ్డీ ద్వారా రాబడి పొందే అవకాశాన్ని ఇవి కల్పిస్తాయి. రిడెంప్షన్ ధర.. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) ప్రకటించే 999 స్వచ్ఛత బంగారం ముగింపు ధరల మూడు రోజుల సగటుపై ఆధారపడి నిర్ణయించబడుతుంది.
వ్యక్తిగత పెట్టుబడిదారులు SGBలను మెచ్యూరిటీ వరకు లేదా అకాల రిడెంప్షన్ తేదీ వరకు ఉంచితే.. మూలధన లాభాల పన్ను నుంచి మినహాయింపు పొందుతారు. దీంతో SGBలు బంగారంలో పెట్టుబడికి అత్యంత ఆకర్షణీయమైన మార్గంగా మారాయి.క్లుప్తంగా చూస్తే.. ఈసారి ప్రకటించిన ముందస్తు రిడెంప్షన్ ధరలు పెట్టుబడిదారులకు లాభాలను అందించడమే కాకుండా.. SGBలను సురక్షిత, లాభదాయక పెట్టుబడి సాధనంగా మారనున్నాయి.
డిస్క్లైమర్: ఈ వ్యాసం కేవలం సమాచారం కోసం మాత్రమే అందించబడింది. ఇది విలువైన లోహాలు, వస్తువులు, స్టాకులు లేదా ఇతర ఆర్థిక పెట్టుబడులను కొనుగోలు చేయమని లేదా అమ్మమని చెప్పడం కాదు. ఈ వ్యాసంలోని సమాచారం ఆధారంగా ఎవరైనా నష్టాలు లేదా సమస్యలను ఎదుర్కొంటే, గ్రేనియమ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థలు, భాగస్వాములు లేదా రచయితలు ఎలాంటి బాధ్యత వహించరు. కాబట్టి మీరు ఏవైనా లావాదేవీలు జరిపే ముందు నిపుణులను సంప్రదించి నిర్ణయం తీసుకోండి.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..



Click it and Unblock the Notifications