Gold Treasure Found: ప్రపంచవ్యాప్తంగా అనేక దశాబ్ధాలుగా ప్రజలు వెండి, బంగారం వంటి వివిధ లోహాలను విరివిగా ఉపయోగించేవారు. ఇంట్లో ఉపయోగించే వస్తువుల నుంచి ఆభరణాల వరకు అనేక అవసరాల కోసం వినియోగించారు. అయితే ఆ రోజుల్లో ఇప్పటి మాదిరిగా బ్యాంకింగ్ వ్యవస్థి విస్తారంగా లేకపోవటంతో చాలా మంది తమ డబ్బులు వివిధ చోట్ల దాచిపెట్టేవారు. తమ తర్వాతి వారసులకు అవి అందాలని ఆశించేవారు.
ఈ క్రమంలో వందల సంవత్సరాలుగా ఇంటి కింద దాచబడిన ట్రెజర్ దొరకితే ఎవ్వరైనా అశ్చర్యానికి గురికాకమానరు. అయితే ఇదే పరిస్థితి ఐలాండ్‌లో ఒక దంపతులకు ఎదురైంది. 10 ఏళ్ల కిందట పాత ఇంటిని కొనుగోలు చేసిన సదరు దంపతులు తమ వంటగదిని పునరుద్ధరించాలని ఫిక్స్ అయ్యారు. ఇందుకోసం చేసిన తవ్వకాల పనిలో జీవితంలో అద్భుతమైన రోజులను తీసుకొచ్చింది. కేవలం ఆరు అంగుళాల కిందట వారొక మట్టి పాత్రను గుర్తించారు. అందులో 1700 నాటికి చెందిన బంగారు నాణాలు వారికి కనిపించాయి. అయితే నిపుణులతో దొరికిన సంపద విలువను లెక్కించగా 2.88 లక్షల డాలర్లుగా దాని విలువ ఉందని కనుగొనబడింది. భారతీయ కరెన్సీ ప్రకారం దీని విలువ దాదాపు రెండున్నర కోట్ల రూపాయల కంటే అధికంగా గుర్తించబడింది.

ఈ గుప్త నిధి వెనుక ఉన్న కారణాన్ని పరిశీలిస్తే.. జోసెఫ్, సారాలు 1700లలో మంచి వ్యాపారం చేసేవారు. అయితే అప్పట్లో స్థాపించిన బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండుపై నమ్మకం లేకపోవటం, అప్పట్లో పేపర్ కరెన్సీని వినియోగంలోకి తీసుకొస్తున్న సమయంలో తమ సంపదలో కొంత భాగాన్ని దాచుకోవాలని నిర్ణయించారు. అనుకున్నదే తడవుగా తమ వంటగదిలో నేల కింద సంపదను దాచి ఉంచారు. అయితే వీరి మరణం తర్వాత వారసులు కూడా నిధిని గుర్తించకపోవటంతో 280 ఏళ్ల పాటు దీనిని ఎవ్వరూ పట్టించుకోలేదని వెల్లడైంది.
అయితే ప్రస్తుతం ఈ నిధిని బయటకు తీసిన దంపతులు దీనిని వేలం పాటలో మంచి ధరకు విక్రయించారు. ఇది వారికి మంది రాబడిని కూడా తెచ్చిపెట్టింది. దీనికి తోడు గత చరిత్రకు సంబంధించిన జ్ఞాపకాలతో పాటు కొన్ని ముఖ్యమైన అంశాలను నేటి కాలం ప్రజల ముందుకు గుప్తనిధి తీసుకొచ్చింది. ముఖ్యంగా చరిత్రకు సంబంధించిన వస్తువులు కొనుగోలు చేసే వ్యక్తులకు విలువైన నాణాలు అందాయి. కనుగొనబడిన నిధిలో బంగారు నాణేలు, కళాఖండాలు ఉన్నాయి. ఈ ఆవిష్కరణ ఊహించని ప్రదేశాల్లో త్రవ్వబడటానికి వేచి ఉన్న అద్భుతమైన కథల రిమైండర్‌గా పనిచేస్తుంది. ఆధునిక జీవితంతో చరిత్ర ఎలా కలుస్తుందో ఇది హైలైట్ చేస్తుంది. ఇది కేవలం భౌతిక సంపదను మాత్రమే కాకుండా గతానికి సంబంధించిన లోతైన ప్రశంసలను కూడా తెస్తుంది.
Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications