ప్రస్తుత రోజుల్లో బంగారం (Gold) ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సామాన్యులు తులం బంగారం కొనాలంటేనే ఒకటికి పది సార్లు ఆలోచిస్తున్నారు. అయితే మన దేశంలో బంగారం ధరతో సమానంగా.. కొన్నిసార్లు అంతకంటే ఎక్కువ ధర పలికే ఆహార పదార్థాలు కూడా ఉన్నాయని మీకు తెలుసా? కేవలం వాటి రుచి కోసమే కాకుండా, వాటి వెనుక ఉన్న కష్టం, లభ్యత, అద్భుతమైన ఔషధ గుణాలే వాటిని ఇంత ఖరీదైనవిగా మార్చాయి. మరి ఆ వింత పదార్థాల విశేషాలేంటో చూద్దామా!.

రెడ్ గోల్డ్: కాశ్మీరీ కుంకుమ పువ్వు
మొదటిది కాశ్మీరీ కుంకుమ పువ్వు. ఇది అందరికీ తెలిసిందే అయినా దీని ధర వింటే మాత్రం ఆశ్చర్యపోతారు. కాశ్మీరీ కుంకుమ పువ్వుని ప్రపంచవ్యాప్తంగా 'రెడ్ గోల్డ్' అని పిలుస్తారు. బంగారం లాగే దీనికి కూడా విపరీతమైన డిమాండ్ ఉంటుంది. దీని ధర కిలోకు సుమారు రూ. 2.5 లక్షల నుండి రూ. 3 లక్షల వరకు పలుకుతుంది.
ఎందుకంత ఖరీదు?
ఒక కిలో కుంకుమ పువ్వును సేకరించడం అంటే మామూలు విషయం కాదు. దాదాపు 1,50,000 'క్రోకస్' పువ్వుల నుంచి రేకులను సేకరిస్తే గానీ ఒక కిలో కుంకుమ పువ్వు రాదు. పైగా ప్రతి పువ్వు నుండి కేవలం మూడు సన్నని రేకులను మాత్రమే చేత్తో చాలా సున్నితంగా వేరు చేయాలి. ఈ కష్టతరమైన ప్రక్రియే దీనిని బంగారంతో సమానమైన విలువను తెచ్చిపెట్టింది. చర్మ సౌందర్యానికే కాకుండా, ఆయుర్వేదంలో కూడా దీనికి విశిష్టమైన స్థానం ఉంది.
మౌంటెన్ గోల్డ్: గుచ్చి పుట్టగొడుగులు
ఇక రెండోది హిమాలయాల అడవుల్లో సహజంగా లభించే 'గుచ్చి పుట్టగొడుగులు' (Guchhi Mushrooms). వీటిని 'మౌంటెన్ గోల్డ్' అని పిలుస్తారు. ఇవి తోటల్లో పండించేవి కావు. హిమాలయాల్లో మంచు కరిగినప్పుడు అడవుల్లో సహజంగా మొలుస్తాయి. వీటిని వెతికి పట్టుకోవడం ఒక సాహస యాత్ర లాంటిది.
విదేశాల్లో భారీ డిమాండ్
మార్కెట్లో కిలో గుచ్చి పుట్టగొడుగుల ధర రూ. 30,000 నుండి రూ. 40,000 వరకు ఉంటుంది. ఇవి అత్యంత అరుదుగా దొరకడం అలాగే వీటిలో ఉండే పోషక విలువల వల్ల అంతర్జాతీయ మార్కెట్లో వీటికి భారీ డిమాండ్ ఉంది. వీటిని ఎక్కువగా ఫైవ్ స్టార్ హోటళ్లలో విదేశీ వంటకాల కోసం ఉపయోగిస్తారు. వీటి అరుదైన రుచి చూసేందుకు సెలబ్రిటీలు సైతం క్యూ కడుతుంటారు.
పెట్టుబడిగా ఆహార పదార్థాలు?
బంగారం మీద పెట్టుబడి పెట్టడం మనకు తెలుసు. కానీ, ఈ 'రెడ్ గోల్డ్', 'మౌంటెన్ గోల్డ్' కూడా ఆర్థికంగా అంతే విలువైనవి. గ్లోబల్ మార్కెట్‌లో వీటి ఎగుమతులు భారీ ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి. ప్రత్యేకించి కాశ్మీర్ ప్రాంత ఆర్థిక వ్యవస్థలో కుంకుమ పువ్వు సాగు కీలక పాత్ర పోషిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా కొంతమంది ఇండోర్ ఫార్మింగ్ ద్వారా కుంకుమ పువ్వు పండిస్తున్నారు.
మొత్తానికి మనం ఎప్పుడూ బంగారం ధరల గురించే వింటుంటాం. కానీ, బంగారం లాగా విలువైన వస్తువులు ఈ భూమిపై చాలానే ఉన్నాయి. ఇంతకీ ఈ ఖరీదైన ఫుడ్స్ ను మీరు ఎప్పుడైనా రుచి చూశారా?
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications