బంగారం ధరలు కుప్పకూలినా ఇన్వెస్టర్లకు డబ్బులే డబ్బులు.. ఐదేళ్ల రిటర్న్స్ చెబుతున్న అసలు లెక్క ఇదిగో..

Gold vs Nifty: 2026 జనవరిలో 10 గ్రాములకు రూ. 1,80,000 ఆల్-టైమ్ గరిష్ట స్థాయిని తాకిన బంగారం ధర.. ఆ తర్వాత దాదాపు 30 శాతం మేర తీవ్ర దిద్దుబాటుకు లోనైనప్పటికీ, దీర్ఘకాలిక రాబడుల విషయంలో భారతీయ ఈక్విటీలను భారీ తేడాతో వెనక్కి నెట్టింది. తాజా మార్కెట్ గణాంకాల ప్రకారం.. గడిచిన ఐదేళ్ల కాలంలో నిఫ్టీ 50 సూచీ కేవలం 50 శాతం లాభాన్ని మాత్రమే నమోదు చేయగా.. 24 క్యారెట్ల బంగారం ఏకంగా 190 శాతం రాబడిని అందించి పెట్టుబడిదారుల సంపదను రెట్టింపు కంటే ఎక్కువగా పెంచింది.

ధరల ప్రస్థానాన్ని పరిశీలిస్తే.. 2021 నవంబర్ 30న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర సుమారు రూ. 43,000 వద్ద ఉండగా, 2026 నవంబర్ 28 నాటికి రూ. 1,25,000 స్థాయికి చేరుకుంది. అంటే ఐదేళ్ల క్రితం బంగారంపై పెట్టిన రూ. 1 లక్ష పెట్టుబడి.. పన్నులు, లావాదేవీల ఖర్చులు మినహాయించిన తర్వాత కూడా సుమారు రూ. 2.50 లక్షలకు పెరిగింది. అదే సమయంలో నిఫ్టీ 50 లో పెట్టిన రూ. 1 లక్ష పెట్టుబడి (డివిడెండ్లను మినహాయించి) 50 శాతం వృద్ధితో సుమారు రూ. 1.50 లక్షలకు మాత్రమే చేరుకుంది. ఈ లెక్కన ఐదేళ్ల కాలవ్యవధిలో బంగారం ఈక్విటీల కంటే రూ. 1 లక్ష అదనపు లాభాన్ని ఆర్జించిపెట్టింది.

Gold vs Nifty returns gold 5 year returns Nifty 50 5 year performance gold price crash 30 percent gold investment returns India gold market correction gold vs stock market long term investment returns gold price performance Nifty investment comparison 50 30

2026లో గరిష్ట స్థాయిల నుండి 30 శాతం పతనం కావడం వల్ల బంగారం పెట్టుబడి ఆకర్షణపై తాత్కాలికంగా సందేహాలు తలెత్తినప్పటికీ, అంతర్జాతీయ సంస్థాగత పెట్టుబడిదారులు, కేంద్ర బ్యాంకులు మాత్రం కొనుగోళ్లను ఏమాత్రం తగ్గించలేదు. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) 2026 మూడవ త్రైమాసిక నివేదిక ప్రకారం.. ప్రపంచ కేంద్ర బ్యాంకులు ఈ త్రైమాసికంలో ఏకంగా 321 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేశాయి.

Also Read

ఇది గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 42 శాతం అధికం కావడమే కాకుండా 2024 చివరి త్రైమాసికం తర్వాత నమోదైన అత్యంత బలమైన కొనుగోలుగా నిలిచింది. అలాగే బంగారం ఆధారిత ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్స్ లోకి 211 టన్నుల పెట్టుబడులు రావడంతో.. ప్రపంచవ్యాప్తంగా ఈటీఎఫ్ బంగారం నిల్వలు రికార్డు స్థాయిలో 4,256 టన్నులకు చేరాయి.

అయితే అంతర్జాతీయ స్థాయిలో సంస్థాగత డిమాండ్ బలంగా ఉన్నప్పటికీ.. భారత దేశీయ మార్కెట్‌లో మాత్రం భిన్నమైన ధోరణి కనిపిస్తోంది. అధిక ధరలు, దిగుమతి సుంకాల పెరుగుదల భారతీయ వినియోగదారులపై భారం మోపడంతో, జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో దేశీయ మొత్తం బంగారం డిమాండ్ గతేడాదితో పోలిస్తే 29 శాతం క్షీణించి 162.5 టన్నులకు పరిమితమైంది. ఇందులో ఆభరణాల డిమాండ్ 20 శాతం తగ్గగా.. బార్లు, నాణేల కొనుగోళ్లు ఏకంగా 40 శాతం పడిపోయాయి.

ఆసక్తికరమైన విషయమేమిటంటే.. భౌతిక బంగారం కొనుగోళ్లు తగ్గినప్పటికీ భారతీయ గోల్డ్ ఈటీఎఫ్ డిమాండ్ మాత్రం గత త్రైమాసికంలోని 3.6 టన్నుల నుండి 5.3 టన్నులకు పెరిగింది. దీనిని బట్టి భారతీయ మదుపర్లు కూడా భౌతిక బంగారం కంటే డిజిటల్, ఆర్థిక ఉత్పత్తుల రూపంలో బంగారంలో పెట్టుబడి పెట్టేందుకే మొగ్గు చూపుతున్నారని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+