Gold vs Dollar: అంతర్జాతీయంగా ఆర్థిక పరిస్థితులు శరవేగంగా మారిపోతున్నాయి. అగ్ర దేశాలు తీసుకుంటున్న నిర్ణయాలు ఈ మార్పులను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికా అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయాలు ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురి చేస్తున్నారు. టారిఫ్ మీద ట్రంప్ ప్రకటించిన యుద్ధం ఇతర దేశాలతో పాటు అమెరికా మీద కూడా తీవ్రమైన ప్రభావాన్నే చూపిస్తోంది.
టారిఫ్ దూకుడుతో అమెరికాలో ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం కాగా డాలర్ విలువ కుప్పకూలింది. ఇదే సమయంలో బంగారం ధరలు విపరీతంగా పెరిగాయి. ట్రంప్ నిర్ణయాల ప్రభావం బంగారు మార్కెట్లలో, కరెన్సీ ట్రేడింగ్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. అమెరికా డాలర్ నాలుగు నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది. ఇక బంగారం ధర అయితే చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా రూ. 5 వేల మార్కుని దాటి పెట్టుబడిదారులకు లాభాల పంట పండించింది.

ఒకప్పుడు గృహ పెట్టుబడిదారులకు మాత్రమే సురక్షిత ఆస్తిగా భావించిన బంగారం, ఇప్పుడు ప్రపంచంలోని అతిపెద్ద పెట్టుబడిదారులైన కేంద్ర బ్యాంకులకు ప్రధాన ఆస్తిగా మారింది.మన దేశమే దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు. జనవరి 16తో ముగిసిన వారంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విదేశీ మారక నిల్వలు 14 బిలియన్ డాలర్లకు పైగా పెరిగాయి. ఇది గత పది నెలల్లో అతిపెద్ద వారపు పెరుగుదల. అయితే ఈ వృద్ధిలో దాదాపు మూడవ వంతు బంగారం నిల్వల విలువ పెరగడం వల్లే వచ్చింది.
ప్రస్తుతం RBI వద్ద సుమారు 880 టన్నుల బంగారం ఉంది. గత ఏడాదిలో విదేశీ కరెన్సీ ఆస్తులు కేవలం 5 శాతం మాత్రమే పెరిగితే, బంగారం ఒక్కటే RBI మొత్తం హోల్డింగ్స్ విలువను దాదాపు 70 శాతం వరకు పెంచింది. ఫలితంగా భారతదేశ విదేశీ మారక నిల్వల్లో బంగారం వాటా 12 శాతం నుంచి 17 శాతానికి చేరింది.
ఇదే సమయంలో ప్రపంచ స్థాయిలో డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గించే ప్రయత్నాలు కూడా ఊపందుకుంటున్నాయి. బ్రిక్స్ దేశాల మధ్య సరిహద్దు వాణిజ్యం, పర్యాటక చెల్లింపులను సులభతరం చేయడానికి అధికారిక డిజిటల్ కరెన్సీలను అనుసంధానించాలని RBI ప్రతిపాదించింది. 2026లో భారత్ ఆతిథ్యం ఇవ్వనున్న బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో ఈ అంశాన్ని చర్చకు తీసుకురావాలని సూచించింది. ఈ ప్రణాళిక ఇంకా అధికారిక ఆమోదం పొందకపోయినా.. బ్రిక్స్ దేశాలు అన్నీ ఏకమై డాలర్‌ను పక్కనపెట్టి ప్రత్యామ్నాయ వ్యవస్థలపై ఆలోచించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.
ప్రపంచవ్యాప్తంగా బంగారం కొనుగోళ్లలో భారత్ మాత్రమే ముందు వరుసలో లేదు. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం, పోలాండ్, కజకిస్తాన్, బ్రెజిల్ వంటి దేశాల కేంద్ర బ్యాంకులు ఇటీవల భారీగా బంగారం కొనుగోలు చేశాయి. అయితే ఇక్కడ ముఖ్యమైనది పరిమాణం కాదు.. Gold నిల్వల్లో వాటా పెరగడం. ఇది డీ-డాలరైజేషన్ దిశగా ప్రపంచం కదులుతున్నదనే సంకేతంగా ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు.
ఈ మార్పులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలు కూడా కారణమని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వాణిజ్య సుంకాలు, ఆంక్షలు, విధాన అనిశ్చితి వల్ల డాలర్‌పై అంతర్జాతీయ విశ్వాసం క్రమంగా తగ్గుతోంది. మోర్గాన్ స్టాన్లీ ఆర్థికవేత్తల ప్రకారం.. ఈ అంశాలన్నీ కలిసి ఇతర దేశాలను డాలర్‌కు ప్రత్యామ్నాయాలను అన్వేషించేందుకు ప్రోత్సహిస్తున్నాయి. ఫలితంగా 2025లో డాలర్ విలువ సుమారు 9 శాతం తగ్గింది. ఇది దశాబ్దంలో అతిపెద్ద పతనం అని చెబుతున్నారు.
ఈ ప్రభావం కేవలం కరెన్సీలకే పరిమితం కాలేదు. ఇంధన ఒప్పందాల్లో నాన్-డాలర్ కరెన్సీల వినియోగం పెరుగుతోంది. సార్వభౌమ రుణ మార్కెట్లలో కూడా మార్పులు కనిపిస్తున్నాయి. RBI, చైనా వంటి దేశాలు తమ US ట్రెజరీ హోల్డింగ్స్‌ను తగ్గిస్తున్నాయి. యూరోపియన్ పెన్షన్ ఫండ్లు కూడా అమెరికా ప్రభుత్వ బాండ్లపై సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి.
అయితే, ఈ మార్పుల మధ్య కూడా డాలర్ ఆధిపత్యం పూర్తిగా కూలిపోలేదు. ప్రపంచ విదేశీ మారక మార్కెట్లలో ఇప్పటికీ డాలర్ 89 శాతం టర్నోవర్‌ను కలిగి ఉంది. IMF డేటా ప్రకారం, ప్రపంచ విదేశీ మారక నిల్వల్లో డాలర్ వాటా తగ్గుతున్నప్పటికీ.. ఇప్పటికీ అతిపెద్ద రిజర్వ్ కరెన్సీగానే కొనసాగుతోంది.
క్లుప్తంగా చెప్పాలంటే..ప్రపంచం పూర్తిగా డాలర్‌ను వదిలివేయడానికి ఇంకా సిద్ధంగా లేకపోవచ్చు. కానీ ట్రంప్ విధానాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అప్పుల భారంతో కూడిన అనిశ్చితి పెట్టుబడిదారులను బంగారం వంటి సురక్షితమైన ఆస్తుల వైపు నడిపిస్తోంది. బంగారం ధరల పెరుగుదల, డీ-డాలరైజేషన్ ప్రక్రియ నెమ్మదిగా కానీ స్థిరంగా ముందుకు సాగుతోందని ఈ విషయం స్పష్టంగా చూపిస్తోంది.
More From GoodReturns

బంగారం, వెండి ధరలు: ఇరాన్ వార్ కారణంగా భారత్‌లో భారీగా పెరిగిన ధరలు - కారణాలు, ప్రభావాలు

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

బంగారం ధర పెరిగింది .. కొనుగోలు వెంటనే బంద్ చేయండి.. మార్చి 10, మంగళవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

యుద్ధాన్ని వదిలి బంగారంపై కన్నేసిన చైనా.. టన్నుల కొద్ది పసిడి రహస్యంగా కొనుగోలు.. ధరల పెరుగదలపై ఆందోళన..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఢమాల్..ఈ రోజు ఎంత తగ్గిందో తెలిస్తే పండగ చేసుకుంటారు .. మార్చి 4,బుధవారం ధరలు ఇవే..

10 గ్రాములు బంగారం ధర రూ. 3 లక్షలకు చేరబోతోంది.. సంచలన అంచనాను విడుదల చేసిన క్రిస్ వుడ్..

బంగారం, వెండి కొనకపోయినా మీ జేబులు ఖాళీ అవ్వాల్సిందే.. ధరలు పెరిగితే తడిసి మోపేడే మీకు..



Click it and Unblock the Notifications