డాలర్ పడినప్పుడల్లా బంగారం ధర ఎందుకు పెరుగుతుంది? పూర్తి వివరాలు ఇవిగో..
గత మూడు సంవత్సరాలలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. 2023 కంటే 2024లో 20% కంటే ఎక్కువ పెరిగిన బంగారం ధర 2025లో ఇప్పటికీ 27 శాతానికి పైగా పెరిగింది. ఏప్రిల్ 22న బంగారం ఔట్లోక్ 3,500 డాలర్ల వద్ద ఆల్ టైం గరిష్ఠానికి చేరుకుంది. దాదాపు 30 నెలల్లో బంగారం ధర చాలా రెట్టింపయ్యింది.
ఈ పెరుగుదలకి కారణం ప్రపంచంలో నెలకొన్న ఆందోళన పరిస్థితులు అనే భావన చాలా మందిలో ఎక్కవుగా ఉంది.రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతలు, ట్రేడ్ వార్స్ వంటి కారణాల వల్ల బంగారంపై పెట్టుబడి కోసం పెట్టుబడిదారులు పరుగులు తీశారు. కానీ ఇప్పుడు ఇవన్నీ తక్కువ ప్రభావం చూపుతున్నాయి. ప్రస్తుతం బంగారం ధరలు రూ. 3,350 పరిధిలోనే స్థిరంగా కొనసాగుతున్నాయి. అయితే తాజాగా డాలర్ బలహీన పడటం వల్ల బంగారం మరోసారి వార్తల్లో నిలిచింది.

బంగారం ధరలపై అమెరికన్ డాలర్ (USD) ప్రభావం చాలా కీలకం. డాలర్ బలపడితే బంగారం ధర పడిపోతుంది. అలాగే డాలర్ బలహీనపడ్డప్పుడు బంగారం ధర పెరుగుతుంది. ఈ సంబంధాన్ని డాలర్ ఇండెక్స్ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. డాలర్ ఇండెక్స్ అంటే, USDను ఇతర ఆరు ప్రముఖ కరెన్సీలతో పోల్చి కొలిచే ప్రమాణం. 2025లో ఈ ఇండెక్స్ 12% పడిపోయి 96కి చేరింది. ఇది 1973 తర్వాత కనిష్ట స్థాయిగా చెప్పుకోవచ్చు
అమెరికాలో ట్రంప్ తిరిగి అధికారంలోకి రావడంతో వాణిజ్య యుద్ధాల భయాలు, భారీ పన్నుల విధానం, ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ స్వతంత్రతపై అనిశ్చితి.. ఇవన్నీ కలిసి డాలర్‌ను దెబ్బతీశాయి. అంతేకాదు, అమెరికా సర్కారు భారీ రుణాలను తీసుకోవడం, బడ్జెట్ లోటు పెరగడం డాలర్ మీద తీవ్రమైన ప్రభావం చూపించాయి.
డాలర్ బలహీనపడ్డప్పుడు, అంతర్జాతీయ పెట్టుబడిదారులు డాలర్-ఆధారిత ఆస్తులను విక్రయించి, విలువను కాపాడే ప్రత్యామ్నాయాల వైపు వెళ్లుతారు. ఆ ప్రత్యామ్నాయాల్లో బంగారం చాలా కీలకమైనది. బంగారం చరిత్రగా విలువను నిలబెట్టుకునే ఆస్తిగా పెట్టుబడిదారులు భావిస్తుంటారు. ముఖ్యంగా విదేశీ కొనుగోలు దారులకు బంగారం చౌకగా మారుతుంది. డాలర్ డల్ అయినప్పుడల్లా బంగారం కొనుగోలు పెరుగుతుంది. ఈ డిమాండ్ పెరుగుదలే బంగారం ధరను పైకి లాగుతుంది.
Disclaimer: This article is strictly for informational purposes only. It is not a solicitation to buy, sell in precious metal products, commodities, securities or other financial instruments. Greynium Information Technologies Pvt Ltd, its subsidiaries, associates and the author of this article do not accept culpability for losses and/or damages arising based on information in this article.


Click it and Unblock the Notifications