అంతర్జాతీయ బంగారు మార్కెట్‌లో ప్రస్తుతం చైనా తీసుకుంటున్న నిర్ణయాలు తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. బంగారం ధరలు ఇప్పటికే రికార్డు స్థాయిలో ఉన్నప్పటికీ, చైనా మాత్రం ఎలాంటి వెనుకడుగు వేయకుండా నిరంతరంగా బంగారాన్ని కొనుగోలు చేస్తూనే ఉంది. ఇది సాధారణ పెట్టుబడి నిర్ణయం కాదు..దీని వెనుక ఎంతో ప్లాన్ దాగి ఉంది. అమెరికన్ డాలర్ ఆధిపత్యాన్ని తగ్గించే దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగా చైనా తీసుకుంటున్న కీలక అడుగుగా నిపుణులు విశ్లేషిస్తున్నారు.
చైనా కేంద్ర బ్యాంకు అయిన పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా వరుసగా 14 నెలలుగా Gold కొనుగోళ్లను కొనసాగిస్తోంది. కేవలం గత నెలలోనే దాదాపు 30 వేల ట్రాయ్ ఔన్సుల బంగారాన్ని తన నిల్వల్లో చేర్చుకుంది. నవంబర్ 2024లో ప్రారంభమైన ఈ కొనుగోలు చక్రంలో ఇప్పటివరకు సుమారు 1.35 మిలియన్ ఔన్సులు.. అంటే దాదాపు 42 టన్నుల బంగారాన్ని చైనా సేకరించింది. ఈ గణాంకాలు చూస్తే.. చైనా వ్యూహం అమెరికాను టార్గెట్ చేయడమేనని తెలుస్తోంది.

సాధారణంగా బంగారం ధరలు గరిష్ట స్థాయికి చేరినప్పుడు కొనుగోళ్లు తగ్గుతాయి. కానీ చైనా వ్యవహారం భిన్నంగా ఉంది. దానికి ప్రధాన కారణం డాలర్‌పై ఆధారపడకూడదనే ఆలోచన అని చెప్పవచ్చు. బంగారం చైనాకు ఒక ఆస్తి మాత్రమే కాదు, డాలర్ రిస్క్‌కు వ్యతిరేకంగా ఉపయోగించే రక్షణ ఆయుధం. ప్రపంచ రాజకీయ, ఆర్థిక అనిశ్చితులు పెరిగినప్పుడల్లా లేదా అమెరికన్ డాలర్‌పై నమ్మకం బలహీనపడినప్పుడు, బంగారం ఒక సురక్షిత ప్రత్యామ్నాయంగా మారుతుంది. అందుకే చైనా తన విదేశీ మారక నిల్వల్లో బంగారం వాటాను క్రమంగా పెంచుకుంటోంది.
చైనా మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల కేంద్ర బ్యాంకులు కూడా ఇదే దిశగా కదులుతున్నాయి. ప్రపంచ బంగారు మండలి చేసిన పరిశోధనల ప్రకారం.. 2025 చివరి నాటికి కేంద్ర బ్యాంకుల బంగారం కొనుగోళ్లు మరింత వేగం పుంజుకుంటాయి. దీని వల్ల బంగారం ధరలు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కేంద్ర బ్యాంకులు పెద్ద మొత్తంలో బంగారం కొనుగోలు చేస్తే, ధరలు ఒక్కసారిగా పడిపోకుండా నిలబెట్టే శక్తి వాటికి ఉంటుంది.
ఇక్కడ మరో ఆసక్తికర అంశం ఏమిటంటే.. చైనా వాస్తవంగా కొనుగోలు చేస్తున్న బంగారం పరిమాణం అధికారికంగా ప్రకటిస్తున్న గణాంకాల కంటే ఎక్కువగా ఉండవచ్చని గోల్డ్‌మన్ సాచ్స్ వంటి అంతర్జాతీయ సంస్థలు అంచనా వేస్తున్నాయి. అంటే కనిపిస్తున్నదానికంటే చైనా బంగారంపై మరింత బుల్లిష్‌గా ఉందని చెప్పవచ్చు. ఇది దీర్ఘకాలంలో బంగారం ధరలను ఇంకా పైకి నెట్టే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఇక దీని భారతదేశంపై ఎలా ఉంటుందన్న ప్రశ్నకు వస్తే.. చైనా నిరంతర కొనుగోళ్లు ప్రపంచ మార్కెట్లో బంగారం ధరలను బలంగా ఉంచుతాయి. దాంతో భారతదేశంలో కూడా బంగారం ధరలు తగ్గే అవకాశం ఉండదు. రాబోయే నెలల్లో దేశీయ మార్కెట్లో ధరలు మరింత పెరిగినా ఆశ్చర్యపోనవసరం లేదు. కొన్ని అంచనాల ప్రకారం రూ.2 లక్షల స్థాయికి కూడా చేరవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. అందువల్ల భారతీయ పెట్టుబడిదారులు బంగారాన్ని కొనుగోలు చేసే ముందు ఈ అంతర్జాతీయ పరిణామాలను జాగ్రత్తగా గమనించడం అవసరమని నిపుణులు చెబుతున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి
More From GoodReturns

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. ఏప్రిల్ 1, బుధవారం ధరలు ఇవే..

బంగారం ధర ఈ వారం ఎంత పెరిగిందో తెలుసా.. రూపాయి పైనే పెట్టుబడిదారుల ఆశలు.. ఎందుకంటే..

బంగారం ధర పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. ఏప్రిల్ నెలలో ఈ రేటును దాటడం ఖాయం అంటున్న నిపుణులు..

బంగారం, వెండి పెట్టుబడిదారులకు బిగ్ అలర్ట్.. సెబీ కొత్త నియమాలు తెలుసుకుని కొనుగోలుకు వెళ్లండి..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Today Gold Silver Rate Live: కుప్పకూలిన బంగారం, వెండి ధరలు..కొంపలు ముంచుతున్న ట్రంప్ నిర్ణయాలు

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాలంటే రూపాయి బలపడాల్సిందే.. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..

ఇరాన్ యుద్దం దెబ్బ.. బంగారం కొనడం మానేసి అమ్మేసుకుంటున్న కేంద్ర బ్యాంకులు.. కారణం ఏంటంటే..



Click it and Unblock the Notifications