బంగారం ధరలు భవిష్యత్తులో పెరుగుతాయా..తగ్గుతాయా.. నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకోండి
2025లో పండుగ సీజన్‌లో బంగారం ధరలు కొత్త రికార్డులను తాకాయి. 10 గ్రాముల బంగారం ధర రూ.1,32,000 దాటడం మార్కెట్ లో ఆశ్చర్యం కలిగించింది. దీపావళికి ముందు వినియోగదారుల డిమాండ్ పెరగడం, ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్య ఉద్రిక్తతలు కొనసాగడం, పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తులపై దృష్టి కేంద్రీకరించడం వంటి అంశాలు ఈ పెరుగుదల వెనుక ప్రధాన కారణాలుగా విశ్లేషకులు చెబుతున్నారు.
భారతీయ సంస్కృతిలో బంగారం ఎప్పటికీ ప్రత్యేక ప్రాముఖ్యత కలిగిన ఆస్తి. ఇది కేవలం ఆభరణంగా కాకుండా, ఆర్థిక అనిశ్చితి సమయంలో విలువ నిల్వగా కూడా పరిగణించబడుతుంది. అయితే, దీపావళి తర్వాత అమెరికా డాలర్ బలపడడంతో బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల కనిపించింది.
ప్రస్తుతం పెట్టుబడిదారుల దృష్టి అమెరికా, భారతదేశం మధ్య పునరుద్ధరించబడిన వాణిజ్య చర్చలపై, అలాగే యుఎస్-చైనా చర్చలపై ఉంది. VT మార్కెట్స్ గ్లోబల్ స్ట్రాటజీ లీడ్ రాస్ మాక్స్‌వెల్ మాట్లాడుతూ.. ఈ చర్చల ఫలితాలు భౌగోళిక రాజకీయ అనిశ్చితి, కేంద్ర బ్యాంకు విధానాలు, కరెన్సీ మార్పులు.. ఇవన్నీ బంగారం దిశను ప్రభావితం చేస్తాయని అన్నారు.

ట్రంప్, జిన్‌పింగ్ మధ్య సమావేశం విజయవంతమైన యుఎస్-చైనా వాణిజ్య ఒప్పందానికి మార్గం సుగమం చేసింది. అదే సమయంలో, భారతదేశం-యుకె ఒప్పందం కూడా సంవత్సరం చివర్లో కుదిరే అవకాశం ఉంది. ఈ పరిణామాలు ప్రపంచ మార్కెట్లలో ఆశావాదాన్ని పెంచుతాయి, పెట్టుబడిదారులు ఈక్విటీల వైపు మొగ్గు చూపుతారు. ఇది బంగారంలో స్వల్పకాలిక సరిదిద్దుబాటుకు దారితీస్తుందని మాస్టర్ ట్రస్ట్ గ్రూప్ డైరెక్టర్ పునీత్ సింఘానియా తెలిపారు.
రాస్ మాక్స్‌వెల్ మాటల్లో.. వాణిజ్య చర్చలు పొడిగించబడితే లేదా అసంపూర్ణంగా ఉంటే, పెట్టుబడిదారులు అనిశ్చితి మధ్య భద్రత కోసం బంగారం వైపు మళ్లుతారు. FED జాగ్రత్త వైఖరిని కొనసాగిస్తే, ఆర్థిక డేటా బలహీనపడితే, వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉంది. అప్పుడు బంగారంలో పెట్టుబడి పెట్టడం మరింత ఆకర్షణీయంగా మారుతుంది. అయితే, అమెరికా చైనా, భారతదేశంతో విశ్వసనీయ ఒప్పందాలు కుదుర్చుకుంటే రిస్క్ విముఖత తగ్గి, USD బలోపేతం అవుతుంది. దీని ఫలితంగా బంగారం ఆకర్షణ తగ్గే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.
మాక్స్‌వెల్ అభిప్రాయప్రకారం.. బంగారం ధర $1,410 స్థాయిని దాటుతుందా లేదా అనేది వాణిజ్య దౌత్యం ఎలా మలుపు తిరుగుతుందో, FED ఎలా స్పందిస్తుందోపై ఆధారపడి ఉంటుంది. చర్చలు విఫలమైతే లేదా ప్రపంచ అనిశ్చితి పెరిగితే, Gold మళ్లీ ఎగసిపడుతుంది. కానీ వాణిజ్యం స్థిరపడితే, ధరలు ఆ స్థాయి కంటే తక్కువగానే నిలుస్తాయి. దీర్ఘకాలిక దృష్టిలో బంగారం ఆకర్షణ మాత్రం తగ్గదని పునీత్ సింఘానియా విశ్వసిస్తున్నారు.
ఆయన మాటల్లో కేంద్ర బ్యాంకులు తమ డాలర్ ఆధారాన్ని తగ్గించేందుకు బంగారాన్ని నిల్వగా పెంచుతున్నాయి. ఇది ప్రపంచ ఆస్తి కేటాయింపు విధానంలో నిర్మాణాత్మక మార్పును సూచిస్తుంది. దీని వలన బంగారం విలువ నిల్వగా మరింత స్థిరపడుతుంది. దీర్ఘకాలంలో ధరల పెరుగుదల కొనసాగుతుంది. క్లుప్తంగా చెప్పాలంటే తాత్కాలికంగా బంగారం ధరల్లో ఊగిసలాటలు కొనసాగవచ్చు. కానీ ఆర్థిక అనిశ్చితి, కేంద్ర బ్యాంకుల కొనుగోలు, పెట్టుబడిదారుల భద్రతా ఆసక్తి బంగారం భవిష్యత్ దిశను ఇంకా ప్రకాశవంతంగా ఉంచుతాయని నిపుణులు విశ్వసిస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి


Click it and Unblock the Notifications