తెలుగు రాష్ట్రాల్లో కుప్పకూలిన బంగారం ధర.. రూ. 46 వేలకు పైగా తగ్గిన 100 గ్రాముల పసిడి ధర

అంతర్జాతీయ బంగారం ధరలు బుధవారం కూడా భారీ పతనాన్ని నమోదు చేశాయి. గత ఐదు సంవత్సరాలలో ఒక రోజు అత్యంత భారీ అమ్మకాల తర్వాత పతనం అయ్యాయి. బంగారం ధరలు 10 గ్రాముల రూ. 132,294 నుండి రూ.128,000 కు పడిపోయాయి. దాదాపు రూ.4 వేలు లేదా 3 శాతం కంటే ఎక్కువ తగ్గాయి. స్పాట్ బంగారం డాలర్‌ ప్రకారం 4,109.19/oz డాలర్ వద్ద ట్రేడ్ అయింది, ఇది సోమవారం టచ్ చేసిన రికార్డు ఆల్ టైమ్ హై 4,381.21 డాలర్ల నుండి 6 శాతం కంటే ఎక్కువగానే తగ్గింది.

ఈ రోజు సాయంత్రానికి బంగారం ధర 24 క్యారెట్లు గ్రాముకు 469 రూపాయలు తగ్గింది. రూ. 12, 589 వద్ద ట్రేట్ అవుతోంది. ఇక 22 క్యారట్ల బంగారం ధర రూ. 430 తగ్గి రూ. 11,540 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే 18 క్యారెట్ల బంగారం ధర రూ. 352 తగ్గి రూ.9,442 వద్ద ట్రేడ్ అవుతోంది. తెలుగు రాష్ట్రాలలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 4,690 తగ్గి రూ. 1, 25, 890 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారట్ల బంగారం ధర 10 గ్రాములు రూ. 4,300 తగ్గి రూ. 1,15,400 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే 18 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 3,520 తగ్గి 94,420 పలుకుతోంది.

gold price today gold crash gold rate fall gold price in india gold price correction gold investment buy gold or wait bullion market gold rate news gold price forecast gold price drop 4000 mcx gold gold price trend gold market analysis gold buying opportunity global gold rates gold price prediction 2025 india gold market usd impact on gold investment tips 4000

మార్కెట్ విశ్లేషకులు ఈ పతనం వెనుక.. లాభాల స్వీకరణ, అమెరికా-చైనా వాణిజ్య సంబంధాల పునరుద్ధరణ సంకేతాలు, భారత్-అమెరికా మధ్య సానుకూల వాణిజ్య చర్చలు, US డాలర్ మారక రేటులపై పెరుగుతున్న అంచనాలను పేర్కొన్నారు. మింట్ నివేదిక ప్రకారం.. భారత దిగుమతులపై అమెరికా విధించిన సుంకాలను 50 శాతం నుండి 15 లేదా 16 శాతానికి తగ్గించే వాణిజ్య ఒప్పందానికి ఇరుప్రాంతాలు దగ్గరగా ఉన్నాయి.

VT మార్కెట్స్ గ్లోబల్ స్ట్రాటజీ లీడ్ రాస్ మాక్స్‌వెల్ ప్రకారం.. బలహీన USD, తక్కువ ఫెడరల్ రిజర్వ్ రేట్ల అంచనాలు, కేంద్ర బ్యాంకుల బలమైన కొనుగోళ్లు, భౌగోళిక రాజకీయ నష్టాల కారణంగా బంగారం ర్యాలీ రికార్డు స్థాయి తర్వాత లాభాల బుకింగ్‌కు గురవుతుందని చెబుతున్నారు.ధర $4,000-$4,400/oz వద్ద వచ్చినా, బంగారం పెరుగుదలకి తగిన కారణాలు ఇంకా దృఢంగా ఉన్నాయి, కాబట్టి ఇది short-term పతనం మాత్రమే, long-term బుల్లిష్ అవగాహన తగ్గట్లేదని ఆయన తెలిపారు.

INVAsset PMS బిజినెస్ హెడ్ హర్షల్ దాసాని బంగారం పెరుగుదల కోణాన్ని హైలైట్ చేస్తూ.. మనం మూడవ సూపర్ సైకిల్‌లో ఉన్నామన్నారు. గత రెండు సూపర్ సైకిల్‌లు 1970లలో, 2000-2010 మధ్య జరగాయని తెలిపారు. మూడవ సైకిల్ 2020-2025 మధ్య కొనసాగుతుందని చెప్పారు. బంగారం మార్కెట్‌లో ఉన్న పేపర్ క్లెయిమ్స్, COMEX, LBMA, షాంఘై బులియన్ లిస్ట్‌లు తారసపడటం వల్ల, ప్రతి చిన్న దిద్దుబాటు కూడా కొనుగోళ్లకు దారితీస్తుంది.ఈ పతనం కొనుగోలు అవకాశమని దాసాని భావిస్తున్నారు.

చరిత్రలో విలువైన లోహాలుబంగారం, వెండి మూడు సూపర్‌సైకిల్‌లలో మాత్రమే గణనీయమైన ధర పెరుగుదలను పొందాయి. మొదటిది 1970లలో ప్రారంభమైంది. నాటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ బంగారం నుండి డాలర్‌ను విడగొట్టడంతో బ్రెట్టన్ వుడ్స్ వ్యవస్థను ముగించడంతో.. దశాబ్ద కాలంగా బంగారం ధర సుమారుగా 20 రెట్లు పెరిగింది. రెండవ సూపర్‌సైకిల్ 2000-2010 మధ్య చోటు చేసుకుంది.

ఈ సమయంలో పరిమాణాత్మక సడలింపు (Quantitative Easing), యూరోపియన్ రుణ సంక్షోభం ఫియట్ కరెన్సీలపై నమ్మకాన్ని దెబ్బతీసింది, దాంతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. ఇప్పుడు 2020-2025 మధ్య మనం మూడవ సూపర్‌సైకిల్‌లో ఉన్నాము. COVID-19 తర్వాత కేంద్ర బ్యాంకుల పెద్ద కొనుగోళ్లు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, భౌగోళిక రాజకీయ అస్థిరతల కారణంగా ఈ సైకిల్ బంగారం మరియు వెండి ధరలను మరోసారి ఎక్కువగా పెంచుతుంది.

మాక్స్‌వెల్ ప్రకారం.. ఫెడరల్ రిజర్వ్ రాబోయే వ్యాఖ్యలు లోతైన రేటు కోతలు సూచిస్తే, లేదా భౌగోళిక రాజకీయ పరిస్థితులు తీవ్రమవుతే బంగారం తిరిగి పెరిగే అవకాశం ఉంది. అయితే బలమైన USD లేదా నిజమైన దిగుబడులు పెరగడం వల్ల 5 లేక 10 శాతం స్వల్పకాలిక పతనం సంభవించవచ్చని తెలిపారు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+