బంగారం కొనుగోలుపై నిపుణులు కీలక సూచన.. ఈ రేటు వద్దకు వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ కావొద్దు..
ప్రపంచ మార్కెట్లు సర్దుకుంటున్న ఉన్న సమయంలో.. బంగారం ధరలు మళ్లీ రికార్డు స్థాయిలో నిలిచాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములకు రూ. 1,22,000 చుట్టూ ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయంగా, కామెక్స్ మార్కెట్‌లో ఔన్సుకు 4,000 డాలర్ల కంటే ఎక్కువ వద్ద బంగారం స్థిరంగా ఉంది. ఈ స్థిరత్వం బంగారం పెట్టుబడిదారులకు ఒక ముఖ్యమైన సంకేతం అందిస్తోంది. సురక్షిత ఆస్తుల డిమాండ్ ఇంకా బలంగానే కొనసాగుతోంది.
గత నెలలలో జరిగిన ఈ Gold బలమైన ర్యాలీకి పలు కారణాలు ఉన్నాయి. డాలర్ ఇండెక్స్ 100 మార్క్ వద్దకు పడిపోవడంతో, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం మరింత చౌకగా మారింది. ఇది విదేశీ పెట్టుబడిదారులను బంగారం వైపు మళ్లించింది.ఇక మధ్యప్రాచ్యం, యూరప్ మరియు ఆసియా ప్రాంతాల్లో ఉన్న ఉద్రిక్తతలు బంగారాన్ని మళ్లీ 'సేఫ్ హేవన్' ఆస్తిగా మార్చాయి. చైనా, టర్కీ, రష్యా వంటి దేశాలు భారీగా బంగారం కొనుగోలు చేస్తుండటం కూడా గ్లోబల్ డిమాండ్‌ను పెంచుతోంది. రూపాయి ప్రస్తుతం 84 వద్ద ట్రేడవుతోంది, ఇది బంగారం దిగుమతి ఖర్చును పెంచి దేశీయ ధరలను మరింత ఎత్తుకు తీసుకెళ్లింది.

LKP Securities లో VP రీసెర్చ్ అనలిస్ట్ జతీన్ త్రివేది మాట్లాడుతూ.. US డాలర్ బలహీనత, రూపాయి పడిపోవడం కారణంగా Gold రూ.1,21,000 చుట్టూ స్థిరంగా ఉంది. కానీ మార్కెట్‌లో తాత్కాలిక అస్థిరత ఉండే అవకాశం ఉంది. రాబోయే వారాల్లో US, భారతదేశ CPI డేటా, ఫెడరల్ రిజర్వ్ ప్రసంగాలు కీలకం అవుతాయని అన్నారు. ఆక్ష్న బంగారం రేంజ్‌ను రూ. 1,18,500 నుంచి రూ. 1,24,000 మధ్యగా అంచనా వేశారు. అంటే ఈ స్థాయి వద్ద బంగారం కొనుగోళ్లు చేయవచ్చని తెలిపారు. దానిని దాటితే కొనుగోలు చేయడం అంత ఉత్తమం కాదని చెబుతున్నారు.
సాధారణంగా వడ్డీ రేట్లు తగ్గే సంకేతాలు వస్తే బంగారం మరింత బలపడే అవకాశం ఉంది. డిసెంబర్ నుంచి పెళ్లి సీజన్ మొదలవుతుంది. చారిత్రాత్మకంగా ఇది బంగారం అమ్మకాలపై పాజిటివ్ ప్రభావం చూపిస్తుంది. రేట్ల పెంపు ఆగితే లేదా తగ్గితే బంగారం ధరలపై ప్రత్యక్ష ప్రభావం ఉంటుంది. ఇక ఇప్పుడే కొనాలా? లేక వేచి చూడాలా? అనే దానిపై నిపుణులు ఏం చెబుతున్నారంటే.. చిన్న తగ్గుదల కోసం వేచి చూడడం మంచిది. ₹1,18,500 వద్ద సపోర్ట్ లెవల్‌ను గమనించాలి.బంగారం ద్రవ్యోల్బణం, ప్రపంచ అనిశ్చితిపై హెడ్జ్‌గా పనిచేస్తుంది. దీర్ఘకాలం కోసం కొంత భాగం ఇన్వెస్ట్ చేయడం సురక్షితం.
ఏదేమైనా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనిశ్చితిలో ఉండగా, బంగారం తన గోల్డెన్ గ్లోని కొనసాగిస్తోంది. రాబోయే నెలల్లో స్వల్ప అస్థిరత తప్పదు కానీ దీర్ఘకాలికంగా బంగారం పాజిటివ్ ట్రెండ్‌లోనే కొనసాగుతుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి


Click it and Unblock the Notifications