కస్టమర్లు లేక లబోదిబోమంటున్న బంగారం వ్యాపారులు..మరో షాక్ న్యూస్ ఏంటంటే..
బంగారం ధరలు రూ. లక్ష మార్కును తాకాయి. జీఎస్టీతో కలుపుకుంటే ప్రస్తుతం వినియోగదారులకు పసిడి 10 గ్రాముల బంగారం గురువారం నాటికి రూ.1,03,507 ధర వద్ద లభిస్తోంది. రెండు నెలల్లోనే ధర ఈ స్థాయిలో పెరిగిందని ఇండియా బులియన్ అండ్ జ్యూవెల్లర్స్ అసోసియేషన్ (IBJA) తెలిపింది. అయితే బంగారం ధరలు రోజు రొజుకు పెరుగుతున్న నేపథ్యంలో బంగారం వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. వ్యాపారులను పెరుగుతున్న బంగారం ధరలు భారీగానే దెబ్బతీస్తున్నాయి.
రానున్నది పండగ సీజన్ కావడంతో మార్కెట్ ఉంటుందా లేదా అనే భయం మధ్య వ్యాపారులు తమ వ్యాపారాలు సాగిస్తున్నారు. ప్రత్యేకించి రక్షా బంధన్, దసరా, దీపావళి వంటి పండుగలు సమీపిస్తుండటంతో బంగారం ధరలు తగ్గకపోతే కొనుగోలు దారులు లేక మార్కెట్ వెలవెలబోతుంది. ఈ నేపథ్యంలోనే బంగారం వ్యాపారుల తలలు పట్టుకుంటున్నారు. ధరలు తగ్గితే కొనుగోలు దారులు బంగారం కొనేందుకు వస్తారని అయితే ఇప్పట్లో ధరలు తగ్గే సూచనలు కనపడటం లేదని వ్యాపారులు వాపోతున్నారు.

టైమ్స్ కథనం ప్రకారం.. బంగారం ధరలు పెరగడానికి చైనాతో పాటు ఇతర దేశాల కేంద్ర బ్యాంకులు పసిడిని భారీగా కొనుగోలు చేయటమే కారణమని IBJA జాతీయ కార్యదర్శి సురేంద్ర మెహతా తెలిపారు. అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు, డాలర్ బలహీనత, రష్యాపై నాటో మళ్ళీ ఆంక్షలు విధించబోతున్న సంకేతాలతో పెట్టుబడిదారులంతా బంగారాన్ని మళ్లీ సురక్షితమైన డిమాండ్ గా చూస్తున్నారని తెలిపారు.
అయితే ఇదే సమయంలో వినియోదారుల 24 క్యారెట్లు వదిలేసి 18 క్యారెట్, 14 క్యారెట్ మరియు 9 క్యారెట్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ధరలు లక్ష మార్కును దాటిన వెంటనే తక్కువ క్యారెట్ గల ఆభరణాలను కొనుగోలు చేస్తున్నారని సెంకో గోల్డ్ మేనేజింగ్ డైరెక్టర్ సువంకర్ సేన్ చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే 24 క్యారెట్ల Gold వాల్యూమ్ పరంగా అమ్మకాలు సుమారు 15% తగ్గాయి. 18 క్యారెట్, 14 క్యారెట్ మరియు 9 క్యారెట్ గల అమ్మకాలు పెరిగాయని తెలిపారు.
రిలయన్స్ రిటైల్ CFO దినేష్ తలుజా ప్రకారం.. బంగారం ధరల పెరుగుదల వల్ల మొత్తం బిల్లింగ్ విలువ పెరిగినప్పటికీ లావాదేవీల సంఖ్య తగ్గిందని చెబుతున్నారు. ఇదే విషయాన్ని చాలా ఆభరణ వ్యాపారులు కూడా చెబుతున్నారు. లాభాలు పెరిగినా అమ్మకాలు మాత్రవ తగ్గాయన్నారు. ఇక మార్కెట్లో వెండి కూడా బంగారంతో పోటీపడి దూసుకుపోతోంది. కిలో వెండి ధర రూ.1,19,000కి ఎగబాకింది.ఇలాంటి పరిస్థితుల్లో కూడా Gold బార్‌లు, నాణేలు, సాదా గొలుసులకు డిమాండ్ ఏర్పడింది. వీటి తయారీ ఛార్జీలు తక్కువగా ఉండటం, భవిష్యత్తులో తిరిగి విక్రయించేందుకు వీలుగా ఉండటం వల్ల పెట్టుబడిదారులు వీటి వైపు మొగ్గు చూపుతున్నారు.
డిస్క్లైమర్: ఈ వ్యాసం కేవలం సమాచారం కోసం మాత్రమే అందించబడింది. ఇది విలువైన లోహాలు, వస్తువులు, స్టాకులు లేదా ఇతర ఆర్థిక పెట్టుబడులను కొనుగోలు చేయమని లేదా అమ్మమని చెప్పడం కాదు. ఈ వ్యాసంలోని సమాచారం ఆధారంగా ఎవరైనా నష్టాలు లేదా సమస్యలను ఎదుర్కొంటే, గ్రేనియమ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థలు, భాగస్వాములు లేదా రచయితలు ఎలాంటి బాధ్యత వహించరు. కాబట్టి మీరు ఏవైనా లావాదేవీలు జరిపే ముందు నిపుణులు సంప్రదించి నిర్ణయం తీసుకోండి.


Click it and Unblock the Notifications