పసిడి ముట్టుకుంటే భగ్గుమంటోంది. ధరలు చుక్కలను తాకి కిందకు దిగిరానంటున్నాయి. ఇప్పటికే లక్ష రూపాయలకు చేరువలో ఉంది బంగారం ధర.. అయితే తాజాగా బంగారంపై ఓ నివేదిక వెలుగులోకి వచ్చింది. ఈ నివేదిక ప్రకారం.. ఈ ఏడాది బంగారం ధర భారీగా పెరగనుంది. ఏకంగా 10 గ్రాముల బంగారం ధర రూ. లక్షా 10 వేలకు చేరుకోనుందని నివేదిక తెలిపింది. ఈ రిపోర్టు చూసిన పసిడి ప్రియులు ఒక్కసారిగా షాక్ కు గురవుతున్నారు.
ఎకనామిక్స్ టైం కథనంలో ప్రచురించిన ఏంజెల్ వన్ నివేదిక ప్రకారం..ఈ ఏడాది చివరి నాటికి భారతదేశంలో బంగారం ధర 10 గ్రామలు రూ.లక్షా పది వేలకు చేరుకునే అవకాశం ఉందని తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న రాజకీయ, బౌగోళిక, ఆర్థిక పరిస్థితులు, అనిశ్చితితో కూడుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో బంగారం ధరలు పెరిగే అవకాశం ఉందని నివేదిక తెలిపింది. ఈ కథనం ప్రకారం గ్లోబల్ మార్కెట్లో పసిడి ఔన్సుకు రూ. 4 వేల డాలర్ల వరకు పెరిగే ఛాన్స్ ఉంది.

అయితే ఇదే నివేదిక మరో ఊరటనిచ్చే వార్తను కూడా తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితులు అనుకూలిస్తే బంగారం ధర రూ. 85 వేలకు దిగి వచ్చే అవకాశం కూడా ఉందని నివేదిక తెలిపింది. ఈ సమయంలో పెట్టుబడి దారులు బంగారం ధరలు తక్కువయ్యే ప్రతిసారి కొంత కొంత కొనుగోలు చేయాలి. అప్పుడు వారు దీర్ఘకాలంలో మంచి లాభాలు సాధించే అవకాశం ఉంటుందని నివేదిక సూచిస్తోంది. పెట్టుబడి దారులు తమ పెట్టుబడిలో కనీసం10 శాతం బంగారం మీద పెట్టుబడి పెడితే లాంగ్ రేసులో వారు లాభాలను ఆర్జించవచ్చుని నివేదిక తెలిపింది.
ఇక UBS ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్‌కి చెందిన Precious Metals Strategist Joni Teves కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తాను బంగారంపై బుల్లిష్‌గా ఉన్నానని ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితుల వల్ల ధరలు మరింత పెరిగే అవకాశముందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. పెట్టుబడి దారులు బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు ఇదే అనువైన సమయం అని భావిస్తున్నట్లుగా తెలిపారు.
అగ్రరాజ్యం అమెరికాలో పెరుగుతున్న ఆర్థిక లోటుతో పాటు ప్రపంచవ్యాప్తంగా బాండ్లపై పెరుగుతున్న వడ్డీ రేట్లు, డాలర్ బలహీనత, తీవ్రతరం అవుతున్న వాణిజ్య యుద్ధంపై కొనసాగుతున్న ఆందోళనలు - ఇవన్నీ బంగారం ధరలు పెరగడానికి బలమైన సాక్ష్యాలుగా ఉన్నాయని ఆయన చెబుతున్నారు. ఇక EUపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన హెచ్చరికలతో మార్కెట్లు ఇప్పటికీ కొంత అనిశ్చితిలో ఉన్నాయని చెప్పుకోవాల్సిందే.
గత ఏడాది కాలం నుంచి పెట్టుబడి దారులకు బంగారం బలమైన లాభాల్లో ఒకటిగా నిలిచింది. ఆర్థికంగా ఒడిదుడుకులు ఎదుర్కున్న ప్రతీసారి ఇన్వెస్టర్లను బంగారమే కాపాడింది. అందువల్లనే పెట్టుబడిదారులు బంగారంలో పెట్టుబడి పెట్టేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని నివేదిక ప్రముఖంగా ప్రస్తావించింది.
Disclaimer: This article is strictly for informational purposes only. It is not a solicitation to buy, sell in precious metal products, commodities, securities or other financial instruments. Greynium Information Technologies Pvt Ltd, its subsidiaries, associates and the author of this article do not accept culpability for losses and/or damages arising based on information in this article.


Click it and Unblock the Notifications