ప్రపంచ బంగారం మార్కెట్ ప్రస్తుతం ఒక అసాధారణ దశలోకి ప్రవేశించింది. సాధారణంగా నెలలు లేదా సంవత్సరాలు పట్టే ధరల పెరుగుదల, ఈసారి కేవలం నాలుగు ట్రేడింగ్ రోజుల్లోనే దాదాపు 10 శాతం ఎగసింది. ఫలితంగా బంగారం ఔన్సు ధర సుమారు 5,600 డాలర్ల స్థాయికి చేరింది. ఈ అకస్మాత్తు ర్యాలీ అంతర్జాతీయ మార్కెట్లను ఆశ్చర్యానికి గురి చేయడంతో పాటు, ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారుల దృష్టిని బంగారం వైపు మళ్లించింది.
ఈ వేగవంతమైన పెరుగుదల తాత్కాలికమేనా? లేక దీర్ఘకాలిక ట్రెండ్‌కు సంకేతమా? అన్న ప్రశ్నకు ప్రముఖ అంతర్జాతీయ బ్యాంక్ JPMorgan ఇచ్చిన సమాధానం మార్కెట్లలో మరింత చర్చకు దారితీసింది. JPMorgan అంచనాల ప్రకారం.. రాబోయే సంవత్సరాల్లో Gold ధరలు 8 వేల డాలర్ల నుంచి 8,500 డాలర్ల వరకు చేరే అవకాశం ఉందని పేర్కొంది. ఇది కేవలం అంచనా కాదు.. మార్కెట్ నిర్మాణంలో జరుగుతున్న మార్పులపై ఆధారపడి చేసిన విశ్లేషణగా బ్యాంక్ వివరిస్తోంది.

JPMorgan గ్లోబల్ మార్కెట్ వ్యూహకారుడు నికొలయోస్ పానిగిర్ట్సోగ్లో మాటల్లో చెప్పాలంటే.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వ్యక్తిగత పెట్టుబడిదారులు తమ పెట్టుబడుల కూర్పును పునఃపరిశీలిస్తున్నారు. ఇప్పటివరకు పోర్ట్‌ఫోలియోలలో ప్రధానంగా ఉన్న బాండ్లపై నమ్మకం తగ్గుతుండటంతో.. వాటిలోని కొంత మొత్తాన్ని బంగారంలోకి మళ్లించే ఆలోచన పెరుగుతోంది. ప్రస్తుతం పెట్టుబడుల్లో బంగారం వాటా సగటున 3 శాతం మాత్రమే ఉంది. అదే 4.5 నుంచి 4.6 శాతానికి పెరిగితే.. బంగారం ధరలు మరింత వేగంగా ఎగసే అవకాశముందని JPMorgan విశ్లేషిస్తోంది.
బంగారం పట్ల ఈ ఆసక్తి పెరగడానికి ప్రధాన కారణం ప్రపంచ ఆర్థిక అనిశ్చితి. అమెరికా, యూరప్ సహా అనేక దేశాల్లో వృద్ధి మందగమనంలో ఉండటం, రుణ భారం పెరగడం, వడ్డీ రేట్ల భవిష్యత్‌పై స్పష్టత లేకపోవడం పెట్టుబడిదారులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బంగారం ఎప్పటినుంచో సేఫ్ హేవెన్ పెట్టుబడిగా గుర్తింపు పొందింది.ఇక ద్రవ్యోల్బణం భయాలు కూడా బంగారం ధరలకు మద్దతు ఇస్తున్నాయి. కరెన్సీ విలువ క్షీణించినప్పుడు, డబ్బు కొనుగోలు శక్తి తగ్గినప్పుడు, బంగారం విలువను కాపాడే సాధనంగా పనిచేస్తుంది. అందుకే దీర్ఘకాలికంగా పెట్టుబడి పెట్టేవారు బంగారాన్ని ఒక రక్షణ కవచంలా చూస్తున్నారు.
అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, యుద్ధాలు, వాణిజ్య వివాదాలు, ఆర్థిక ఆంక్షలు.. మార్కెట్లలో అస్థిరతను పెంచుతున్నాయి. ఈ అనిశ్చిత వాతావరణం బంగారం వంటి విలువైన లోహాలపై డిమాండ్‌ను మరింత పెంచుతోంది. బంగారంతో పాటు వెండి, ప్లాటినం వంటి లోహాలకూ పెట్టుబడిదారుల ఆసక్తి గణనీయంగా పెరిగింది. స్టాక్ మార్కెట్లతో పోల్చితే బంగారం ప్రస్తుతం తక్కువ విలువగా ఉందని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గత దశాబ్దాలతో పోలిస్తే స్టాక్ సూచీలు బంగారం విలువకు అనుగుణంగా పెరగలేదని వారు సూచిస్తున్నారు. ఇది కూడా బంగారం వైపు పెట్టుబడిదారులను ఆకర్షించే అంశంగా మారింది.
అయితే, ఈ ర్యాలీ ఎప్పటికీ నేరుగా కొనసాగుతుందన్న హామీ లేదని JPMorgan హెచ్చరిస్తోంది. మధ్యలో లాభాల స్వీకరణ కారణంగా చిన్నపాటి పతనం రావచ్చు. అయినప్పటికీ, దీర్ఘకాలిక దృష్టితో చూస్తే బంగారం ఇంకా తన ప్రయాణాన్ని పూర్తి చేయలేదని.. ముందున్న సంవత్సరాల్లో మరింత ఎత్తుకు చేరే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.
More From GoodReturns

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. ఏప్రిల్ 1, బుధవారం ధరలు ఇవే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

Today Gold Silver Rate Live: కుప్పకూలిన బంగారం, వెండి ధరలు..కొంపలు ముంచుతున్న ట్రంప్ నిర్ణయాలు

బంగారం, వెండి ధరలు తగ్గాయని సంబరాలు వద్దు.. పసిడి పెరుగుదలపై షాకింగ్ న్యూస్ చెప్పిన బ్యాంకింగ్ దిగ్గజం..

Gold: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్! భారీ పతనం తర్వాత కోలుకుంటున్న పసిడి.. నిపుణుల అంచనా ఇదే.!

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: తగ్గిన వెండి ధర.. పెరిగిన బంగారం ధర.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Gold: ఐసీఐసీఐ బ్యాంక్‌లో భారీ గోల్డ్ లోన్ కుంభకోణం! నకిలీ బంగారంతో రూ. 23 కోట్లు మాయం!

ఇరాన్ యుద్దం దెబ్బ.. బంగారం కొనడం మానేసి అమ్మేసుకుంటున్న కేంద్ర బ్యాంకులు.. కారణం ఏంటంటే..

బంగారం, వెండి ధరలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి..వరుస సెలవులు కాపాడుతాయా..కొంపలు ముంచుతాయా..



Click it and Unblock the Notifications