Gold Rising: రూ.70 వేలకు చేరుకోనున్న గోల్డ్.. ఆ కారణాలతో ప్రారంభమైన పరుగు..!

Gold Price Today: ఈరోజు దేశీయ మార్కెట్లలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. ఈ క్రమంలో వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇటీవల క్రూడ్ ధరలు పెరగటంతో ఒక్కసారిగా డాలర్ పుంజుకుంది. అలా డాలర్ బలపడటంతో బంగారం స్వల్పంగా తగ్గింది. అయితే మళ్లీ బంగారం ధరలు పెరుగుదలను ప్రారంభించాయి.

పెరుగుతున్న ఆర్థిక ఒడిదుడుకుల మధ్య బంగారం ధరలు రికార్డు స్థాయిలో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం దేశంలో 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం గ్రాము ధర రూ.6033గా ఉంది. అంటే 10 గ్రాముల ధర రూ.60 వేల మార్కును దాటింది. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లలో ఔన్సు బంగారం ధర 2000 డాలర్లను దాటింది. అయితే ఏడాది చివరి నాటికి 10 గ్రాముల గోల్డ్ ధర రూ.70 వేలకు చేరుకోవచ్చని అంచనాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల పోర్ట్ ఫోలియోలో 5-10 శాతాన్ని బంగారం కోసం వెచ్చించాలని నిపుణులు సూచిస్తున్నారు.

Gold started rising shocking buyers and to reach 70000 by year end, know rates in telugu states

అంతర్జాయంగా ఆర్థిక సంక్షోభంతో పాటు బ్యాంకులు కుప్పకూలటంతో ఇన్వెస్టర్లు తమ డబ్బును ప్రధానంగా బంగారం వైపు మళ్లిస్తున్నారు. దీంతో అమెరికా ఆర్థికం సంక్షోభంలోకి జారుకుంటుందా లేదా అనే అంశాలతో సంబంధం లేకుండా బంగారానికి డిమాండ్ కొనసాగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇదే క్రమంలో ఫెడ్ పాలసీ రేట్లను తగ్గించే అవకాశం ఉందని వారు అంటున్నారు. గతంలోని పరిణామాలను గమనిస్తే వడ్డీ రేట్ల పెంపు ఉన్నప్పుడు బంగారం ధరలు సవరణను చూశాయి. అలాగే రేట్ల పెంపు నిలిపివేత లేదా తగ్గించటం వంటి నిర్ణయాలను సెంట్రల్ బ్యాంకులు ప్రకటిస్తున్నప్పుడు గోల్డ్ ధరలు పెరుగుతూ వచ్చాయి. ఈ ఏడాది కూడా అదే ధోరణి కొనసాగుతుందని నిపుణులు చెబుతున్నారు.

ప్రధాన నగరాల్లో 10 గ్రాములకు 22 క్యారెట్ల బంగారం ధరలను పరిశీలించినట్లయితే చెన్నైలో రూ. 56,010, దిల్లీలో రూ. 55,460, ముంబైలో రూ. 55,310, బెంగళూరులో రూ.55,360, హైదరాబాదులో రూ.55,310, విజయవాడలో రూ.55,310, విశాఖపట్నంలో రూ.55,310గా ఉన్నాయి.

ఇదే క్రమంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరలు చెన్నైలో రూ.61,100, ముంబైలో రూ.60,340, బెంగళూరులో రూ.60,390, హైదరాబాదులో రూ.60,340, విజయవాడలో రూ.60,340, విశాఖలో రూ.60,340 వద్ద కొసాగుతున్నాయి. ఈ క్రమంలో నిన్న కిలో వెండి ధర రూ.74,600గా ఉండగా.. నేడు స్వల్పంగా తగ్గి కిలో రూ.77,090కు చేరుకుంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+