gold: రికార్డు స్థాయిలో బంగారం స్మగ్లింగ్.. గతేడాది 47 శాతం పెరిగిన కేసులు.. ఎంత స్వాధీనం చేసుకున్నారంటే..

gold: మన దేశ ప్రజలకు బంగారంపై ఉన్న మక్కువ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీన్ని అలుసుగా తీసుకుని కొందరు వ్యాపారులు సుంకాలు చెల్లించడాన్ని ఎగ్గొట్టి, దొడ్డిదారిన ఇండియాలోకి స్వర్ణాన్ని దిగుమతి చేసుకుంటున్నారు. వివిధ దేశాల నుంచి జల, వాయు మార్గాల్లో స్మగ్లింగ్ కు పాల్పడుతున్నారు. దీనిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి కస్టమ్స్ విభాగం తీవ్రంగా శ్రమిస్తోంది. అయితే ఇప్పటివరకు ఈ విధానంలో పట్టుబడిన బంగారం విలువ చూస్తే దిమ్మ తిరగాల్సిందే..

దాదాపు 50 శాతం పెరిగిన స్మగ్లింగ్:

దాదాపు 50 శాతం పెరిగిన స్మగ్లింగ్:

దేశంలోకి అక్రమంగా వస్తున్న బంగారాన్ని సీజ్ చేయడంలో 2022 మంచి రికార్డు నమోదు చేసింది. అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే దాదాపు 47 శాతం ఎక్కువగా పట్టుబడినట్లు ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. ఇందులో సింహభాగం ఒక్క కేరళలోనే కావడం విశేషం. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(DRI) తో కలిసి పలు రకాలుగా అక్రమ రవాణాను అడ్డుకోవడానికి కస్టమ్స్ విభాగం ప్రయత్నిస్తున్నట్లు రాజ్యసభలో ఆర్థిక శాఖ ప్రకటించింది.

గత మూడేళ్లలో ఇలా..

గత మూడేళ్లలో ఇలా..

గతేడాది మొత్తంగా 3,502 కిలోల బంగారాన్ని వివిధ ప్రభుత్వ ఏజెన్సీలు సీజ్ చేసినట్లు ఆ శాఖ పేర్కొంది. 2021లో 2,300 కేజీలకు పైగా, దానికి ముందు ఏడాది 2,150 కేజీలుగా నమోదైనట్లు వెల్లడించింది. అయితే ప్రస్తుతం ఏడాది 2023లో మొదటి రెండు నెలల్లోనే దాదాపు 900 కిలోలకు పైగా అక్రమ బంగారం రవాణాను అధికారులు అడ్డుకున్నట్లు స్పష్టం చేసింది.

రాష్ట్రాల వారీగా నమోదైన కేసులు:

రాష్ట్రాల వారీగా నమోదైన కేసులు:

2022లో బంగారం అక్రమ రవాణా విషయమై దాదాపు 4 వేల సీజింగ్ కేసులు నమోదైనట్లు ప్రభుత్వం వెల్లడించింది. 2021లో నమోదైన 2,500తో పోలిస్తే గణనీయంగా పెరిగినట్లు తెలిపింది. 2022లో అత్యధికంగా కేరళలో 755 కేజీలు, అంతకుముందు ఏదాడి 586 కిలోలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. ఆ రాష్ట్రం తర్వాతి స్థానంలో 535 కేజీలతో మహారాష్ట్ర, 519తో తమిళనాడు ఉన్నట్లు స్పష్టం చేసింది. ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, చండీగర్, జమ్మూ & కాశ్మీర్, లడక్ లలో.. 2022కి గాను 556 కేజీలు స్వాధీనం చేసుకున్నట్లు వివరించింది.

మూడేళ్లలో కేవలం 3 ఛార్జ్ షీట్లు:

మూడేళ్లలో కేవలం 3 ఛార్జ్ షీట్లు:

గత 3 ఏళ్లలో కేవలం 3 బంగారం స్మగ్లింగ్ కేసులపై మాత్రమే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(NIA) విచారణ జరిపి, ఛార్జ్ షీట్ దాఖలు చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ప్రపంచంలో చైనా తర్వాత బంగారాన్ని విరివిగా వినియోగించే దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉన్నా, కేసుల విచారణ మాత్రం అత్యంత మెల్లగా సాగుతూ ఉండటం విచారకరం. అన్ని రకాల పనులను కలుపుకొని బంగారం దిగుమతిపై 18.45 శాతాన్ని ప్రభుత్వం వసూలు చేస్తోంది. DRI నివేదిక ప్రకారం 2021-22లో బంగారానికున్న భారీ డిమాండ్, అధిక దిగుమతి సుంకాలు.. పెద్ద ఎత్తున స్మగ్లింగ్ కు కారణమని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+