అమెరికా నుండి కీలక అప్‌డేట్..ఇంకా భారీగా తగ్గనున్న బంగారం ధరలు.. పసిడి ప్రియులకు పండగే పండగ..
అమెరికా ఉద్యోగ గణాంకాల ప్రభావంతో బంగారం ధరలు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. ఈ రోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గినప్పటికీ వారాంతానికి మాత్రం స్వల్ప లాభాల దిశగా ప్రయాణం సాగిస్తోంది. USలో బలమైన ఉద్యోగ గణాంకాలు, ఫెడరల్ రిజర్వ్ వచ్చే వారం వడ్డీ రేట్లను యథావిధిగా కొనసాగించే అవకాశాలను బలోపేతం చేశాయి. దీంతో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. అగ్రరాజ్యం అమెరికాలో వరుసగా 6 వారాల పాటు పౌరుల నుంచి నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తులు తగ్గినట్లు వచ్చిన నివేదిక బంగారం మార్కెట్ సెంటిమెంట్‌పై ప్రభావం చూపింది. ఇది 2022 తర్వాత ఇటువంటి స్థిరమైన కోత కనిపించిన అరుదైన సందర్భంగా చెప్పుకోవచ్చు.
దీంతో డాలర్ విలువ పెరిగి బంగారం విలువ తగ్గింది. డాలర్ విలువ పెరగడం వల్ల పెట్టుబడిదారులు వడ్డీ రాబడి లేని బంగారం మీద తమ దృష్టిని వదిలేశారు. పెట్టుబడిదారులు ప్రస్తుతం ఫెడరల్ రిజర్వ్ మీద పడ్డారు. ఈ సంవత్సరం కేవలం ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే వడ్డీ తగ్గింపులు చేయవచ్చునని వారు అంచనా వేస్తున్నారు. అక్టోబర్‌లో మొదటి కోత వచ్చే అవకాశం ఉందని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు.

సెంట్రల్ బ్యాంక్ పునరుద్ధరణ ప్రాజెక్టు ఖర్చులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ మధ్య మధ్యస్థ ఘర్షణ కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ట్రంప్ వడ్డీ రేట్లను తగ్గించాలనే తన అభిప్రాయాన్ని తిరిగి వెల్లడించినప్పటికీ, ఫెడరల్ రిజర్వ్ పునరుద్ధరణ సమస్యలు పావెల్‌ను తొలగించడానికి సరిపడవు అన్న అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.దీంతో ఈ ఘర్షణ బంగారం ధరలపై ప్రభావం చూపుతోంది.
ఈ ఏడాదిని దృష్టిలోకి తీసుకుంటే.. Gold ధరలు ఇప్పటివరకు 25 శాతం కంటే ఎక్కువ పెరిగాయి. ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఏర్పడిన అనిశ్చితి వంటి అంశాలు Gold పెరుగుదలకు కారణం అయ్యాయి. పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షితమైన డిమాండ్ గా భావించారు. క్లుప్తంగా చూసుకున్నట్లయితే బంగారం మార్కెట్ ఈ మధ్య కాలంలో అమెరికా ఆర్థిక గణాంకాలతో పాటుగా ఫెడరల్ రిజర్వ్ ధోరణిపై ఆధారపడి ఉంటూ సెంటిమెంట్‌తో కూడిన ట్రేడింగ్‌ను కొనసాగిస్తోంది. పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తిగా బంగారాన్ని ఎంచుకుంటున్నప్పటికీ..ముందు ముందు వడ్డీ రేట్ల నిర్ణయాలు దీని దిశను ప్రభావితం చేయవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వ్యాసం కేవలం సమాచారం కోసం మాత్రమే అందించబడింది. ఇది విలువైన లోహాలు, వస్తువులు, స్టాకులు లేదా ఇతర ఆర్థిక పెట్టుబడులను కొనుగోలు చేయమని లేదా అమ్మమని చెప్పడం కాదు. ఈ వ్యాసంలోని సమాచారం ఆధారంగా ఎవరైనా నష్టాలు లేదా సమస్యలను ఎదుర్కొంటే, గ్రేనియమ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థలు, భాగస్వాములు లేదా రచయితలు ఎలాంటి బాధ్యత వహించరు. కాబట్టి మీరు ఏవైనా లావాదేవీలు జరిపే ముందు నిపుణులు సంప్రదించి నిర్ణయం తీసుకోండి.


Click it and Unblock the Notifications