సమ్మర్లో హాట్ హీట్ పుట్టిస్తున్న బంగారం వెండి.. ఇవాళ 9వేలు పెంపు.. ఆల్ టైం రికార్డ్..

తులం బంగారం ధర లక్షకు పరుగులు తీస్తుండగా, వెండి ధర మరింత పెరిగి 1 లక్ష 15 వేలకి చేరువలో ఉంది. ఇంకా బంగారం వెండి ధరలు ఈ వేసవిలో హాట్ హిట్ పుట్టిస్తున్నాయి. అంతేకాకూండ సామాన్యులు కొనేందుకు కూడా జంకేల ఆందోళన కలిగిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు పదులలో పెరిగిన ధరలు ప్రస్తుతం వందల్లో పెరుగుతూ చెమటలు తేప్పిస్తున్నాయి. బంగారం ధరలు నిరంతరం పెరగడానికి ఒక విధంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూడా కారణం. ఎందుకంటే రేపు ఏప్రిల్ 2న పరస్పర పన్నును ప్రకటించబోతున్నారు. దీని అర్థం ఒక దేశం అమెరికా నుండి ఎంత పన్ను వసూలు చేస్తుందో, అమెరికా కూడా అంతే పన్ను వసూలు చేస్తుంది. ఇలాంటి పన్నును ప్రకటిస్తే, అది అంతర్జాతీయంగా గందరగోళానికి కారణమవుతుంది. అందుకే పెట్టుబడిదారులు బంగారంలో సురక్షితమైన పెట్టుబడిగా పెట్టుబడి పెడతారు.

gold silver update today gold and silver prices surged above rs900 in telangana and andhrapradesh check latest rates here

నేడు 1 గ్రాము, 10 గ్రాముల బంగారం ధరలు :
1 గ్రాము 22 క్యారెట్ల ధర రూ.8,510, 24 క్యారెట్ల ధర రూ. 9,284, 18 క్యారెట్ల ధర రూ. 6,963.
10 గ్రాములు 22 క్యారెట్ల ధర రూ. 85,100, నిన్నటి ధర రూ.84,250 అంటే రూ.850 పెరిగింది,
10 గ్రాములు 24 క్యారెట్ల ధర రూ. 92,480, నిన్నటి ధర చూస్తే రూ.91,910 దింతో రూ.930 పెరగగా,
10 గ్రాములు 18 క్యారెట్ల ధర రూ.69,630, నిన్నటి ధర రూ.68,940 అంటే రూ.690 పెంపు నమోదు చేసింది.

దేశంలోని ప్రముఖ నగరాలలో ఇవాళ్టి ధరలు చూస్తే:
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల ధర రూ.85,250, 24 క్యారెట్లకు రూ.92,990, 18 క్యారెట్లకు రూ.69,750,
ఆర్ధిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.85,100, 24 క్యారెట్లకు రూ.92,840, 18 క్యారెట్లకు రూ.69,630,
ఇక చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.85,100, 24 క్యారెట్లకు రూ.92,840, 18 క్యారెట్లకు రూ.70,200,
కోల్కోత్తలో 22 క్యారెట్ల ధర రూ.85,100, 24 క్యారెట్లకు రూ.92,840, 18 క్యారెట్లకు రూ.70,200,

తెలంగాణ రాష్ట్రంలోని నగరాల్లో ప్రస్తుత బంగారం ధరలు:
వరంగల్లో 22 క్యారెట్ల ధర రూ.85,100, 24 క్యారెట్లకు రూ.92,840, 18 క్యారెట్లకు రూ.69,630,
కరీంనగర్లో 22 క్యారెట్ల ధర రూ.85,100, 24 క్యారెట్లకు రూ.92,840, 18 క్యారెట్లకు రూ.69,630,
ఖమ్మంలో 22 క్యారెట్ల ధర రూ.85,100, 24 క్యారెట్లకు రూ.92,840, 18 క్యారెట్లకు రూ.69,630,
హైదరాబాద్లో 22 క్యారెట్ల ధర రూ.85,100, 24 క్యారెట్లకు రూ.92,840, 18 క్యారెట్లకు రూ.69,630,

ఆంధ్రప్రదేశ్ ప్రముఖ నగరాల్లో నేటి బంగారం ధరలు:
విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ.85,100, 24 క్యారెట్లకు రూ.92,840, 18 క్యారెట్లకు రూ.69,630,
విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.85,100, 24 క్యారెట్లకు రూ.92,840, 18 క్యారెట్లకు రూ.69,630,
అమరావతిలో 22 క్యారెట్ల ధర రూ.85,100, 24 క్యారెట్లకు రూ.92,840, 18 క్యారెట్లకు రూ.69,630,
గుంటూరులో 22 క్యారెట్ల ధర రూ.85,100, 24 క్యారెట్లకు రూ.92,840, 18 క్యారెట్లకు రూ.69,630,
నెల్లూరులో 22 క్యారెట్ల ధర రూ.85,100, 24 క్యారెట్లకు రూ.92,840, 18 క్యారెట్లకు రూ.69,630,
కాకినాడలో 22 క్యారెట్ల ధర రూ.85,100, 24 క్యారెట్లకు రూ.92,840, 18 క్యారెట్లకు రూ.69,630,
తిరుపతిలో 22 క్యారెట్ల ధర రూ.85,100, 24 క్యారెట్లకు రూ.92,840, 18 క్యారెట్లకు రూ.69,630,
కడపలో 22 క్యారెట్ల ధర రూ.85,100, 24 క్యారెట్లకు రూ.92,840, 18 క్యారెట్లకు రూ.69,630,
అనంతపురంలో 22 క్యారెట్ల ధర రూ.85,100, 24 క్యారెట్లకు రూ.92,840, 18 క్యారెట్లకు రూ.69,630,

మరోవైపు వెండి ధరలు భారీగా పెరిగి నేడు ఒక్కరోజే వెయ్యి పెరిగింది. ఇవాళ ఒక్క గ్రాము వెండి ధర ధర రూ.105, పది గ్రాములకు రూ.1050, కేజీకి రూ.1,05,000. ఢిల్లీ, ముంబై, కోల్కతాలో కేజీ వెండి ధర రూ.1,05,000, చెన్నై, హైదరాబాద్, ఆంధ్రప్రదేశంలో కిలో వెండి ధర రూ.1,14,000.

బంగారం ధరలు పెరగడానికి కారణాలు: మన దేశంలో బంగారం ధరల పెరుగుదలకు దేశీయంగా, అంతర్జాతీయంగా చాల అంశాలు కారణమని చెప్పవచ్చు. బంగారం ధరలు పెరగడానికి ప్రధాన కారణాలలో ఒకటి ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆర్థిక, రాజకీయ అనిశ్చితి. దీనికి తోడు US డాలర్‌లో హెచ్చుతగ్గులు, పెరుగుతున్న ద్రవ్యోల్బణ ఆందోళనలు, యునైటెడ్ స్టేట్స్ వంటి పెద్ద ఆర్థిక వ్యవస్థలలో కొత్త ఆర్థిక విధానాలు, ప్రపంచ సంఘటనలు బంగారం డిమాండ్ పెరగడానికి దోహదం చేస్తున్నాయి.

బంగారం ధరలు ఎలా నిర్ణయిస్తారు: ఇండియాలో బంగారం ధరలు ప్రపంచ, స్థానికంగా వివిధ అంశాల ద్వారా ప్రభావితమవుతాయి. అంతర్జాతీయ బంగారం ధర, ముఖ్యంగా ప్రపంచ మార్కెట్ ద్వారా నిర్ణయించబడుతుంది. దీనికి తోడు US డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువలో హెచ్చుతగ్గులు కూడా దేశంలో బంగారం ధరపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి.

అంతేకాకుండా భారత ప్రభుత్వం బంగారంపై విధించే వస్తు సేవల పన్ను (GST) వంటి పన్నులు కస్టమర్లని అధిక ధరకు కొనుగోలు చేసేలా చేస్తాయి. బంగారాన్ని భారతీయ వివాహాలు, పండుగలు అలాగే ఇతర ముఖ్యమైన కార్యక్రమాలలో ముఖ్యమైన భాగంగా పరిగణిస్తారు. చాలా మంది భారతీయ కుటుంబాలకు బంగారం కేవలం ఒక విలువైన లోహం మాత్రమే కాదు సంపద, సాంస్కృతిక ప్రాముఖ్యతకు చిహ్నము. పెళ్లిళ్లు ఇంకా ముఖ్యమైన పండుగలు దీపావళి, అక్షయ తృతీయల రోజుల్లో కీలక పాత్ర పోషిస్తుంది. ఇలాంటి సమయాల్లో బంగారం డిమాండ్ గరిష్ట స్థాయికి చేరుకుంటుంది, దీని వల్ల కూడా ధరలు పెరుగుతాయి.

note: పైన పేర్కొన్న బంగారం ధరలు ఉదయం 10గంటలకు చెందినవి ఇంకా GST, TCS ఇంకా ఇతర లెవీలతో ఉండవు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల వ్యాపారిని లేదా జ్యువెలరీ షాపులో సంప్రదించండి. అలాగే బంగారం ధరలు ఏ సమయంలోనైనా మారవచ్చు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+