గత కొంత కాలంగా కొన్నిసార్లు బంగారం ధర పెరగ్గా, కొన్నిసార్లు బంగారం ధర తగ్గింది. కానీ గతవారం నుండి చూస్తే పసిడి ధరలు వరుసగా మూడు రోజుల పాటు దిగొచ్చాయి. ఈ రోజుల్లో బంగారం ధర సుమారు 4 నుండి 5 వేల వరకు తగ్గింది. ఇక నేడు కూడా ధరలు మరింత తగ్గుతాయని అనుకుంటుండగా ఒక్కసారిగా బంగారంతో పాటు వెండి ధర కూడా పెరిగి సామాన్యులకి షాకిచ్చాయి. దింతో పసిడి ధరల పెంపు ట్రెండ్ మళ్ళీ మొదలైంది. ఇవాళ బంగారం ధర చూస్తే 18 క్యారెట్ల నుండి 24 క్యారెట్ల వరకు 10 గ్రాముల ధరలు రూ.80 నుండి రూ.110 వరకు పెరిగాయి. అలాగే వెండి కూడా ఏకంగా కేజీకి వెయ్యి పెరిగింది. ఈ ఏడాది మొదటి నుండి చూస్తే బంగారం ధరలు భారీగా పెరిగి, ఎన్నడూ లేని విధంగా రికార్డ్ స్థాయికి చేరాయి. ఇక పెళ్లిళ్ల సీజనలో మాత్రం సామాన్యులకు ఆందోళన కలిగించాయి.

ప్రస్తుత అంతర్జాతీయ రాజకీయ పరిస్థితిలు, డాలర్ రూపాయి మారకం విలువ ఇంకా ఏప్రిల్ 2 నుండి మొదలయ్యే ట్రంప్ సుంకాల కారణం బంగారం ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు సూచిస్తుంది. అయితే భారతదేశ బంగారం దిగుమతులు ఏడాదికి 800 టన్నులు ఇంకా దేశీయ ఉత్పత్తి కేవలం 1 టన్ను మధ్య ఉన్న భారీ అంతరాయంపై నిపుణులు ధరల పెంపు సూచిస్తూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మన దేశ బంగారం అవసరాలలో ఎక్కువ భాగాన్ని దిగుమతుల ద్వారా తీర్చుకుంటుంది. బంగారం దిగుమతి ఖర్చు పెరగడం వల్ల దేశ విదేశీ మారక నిల్వలు కూడా ప్రభావితమవుతున్నాయి. భారతదేశానికి బంగారం దిగుమతులలో స్విట్జర్లాండ్ అతిపెద్ద వనరు. ఇండియా మొత్తం బంగారం దిగుమతుల్లో ఈ దేశం వాటా దాదాపు 40 శాతం. వీటి తర్వాత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (16%), దక్షిణాఫ్రికా (10%).
నేడు 1 గ్రాము, 10 గ్రాముల బంగారం ధరలు :
1 గ్రాము 22 క్యారెట్ల ధర రూ.8,195, 24 క్యారెట్ల ధర రూ. 8,940, 18 క్యారెట్ల ధర రూ. 6,705.
10 గ్రాములు 22 క్యారెట్ల ధర రూ. 81,950, నిన్నటి ధర రూ.81,850 అంటే రూ.100 పెరిగింది,
10 గ్రాములు 24 క్యారెట్ల ధర రూ. 89,400, నిన్నటి ధర చూస్తే రూ.89,290 దింతో రూ.110 ఎగబాకింది.
ఇక 10 గ్రాములు 18 క్యారెట్ల ధర రూ.67,050, నిన్నటి ధర రూ.66,970 అంటే రూ.80 పెంపును నమోదు చేసింది.
దేశంలోని ప్రముఖ నగరాలలో ఇవాళ్టి ధరలు చూస్తే:
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల ధర రూ.82,100, 24 క్యారెట్లకు రూ.89,550, 18 క్యారెట్లకు రూ.67,180,
ఆర్ధిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.81,950, 24 క్యారెట్లకు రూ.89,400, 18 క్యారెట్లకు రూ.67,050,
ఇక చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.81,950, 24 క్యారెట్లకు రూ.89,400, 18 క్యారెట్లకు రూ.67,050,
కోల్కోత్తలో 22 క్యారెట్ల ధర రూ.81,950, 24 క్యారెట్లకు రూ.89,400, 18 క్యారెట్లకు రూ.67,050,
తెలంగాణ రాష్ట్రంలోని నగరాల్లో ప్రస్తుత బంగారం ధరలు:
వరంగల్లో 22 క్యారెట్ల ధర రూ.81,950, 24 క్యారెట్లకు రూ.89,400, 18 క్యారెట్లకు రూ.67,050,
కరీంనగర్లో 22 క్యారెట్ల ధర రూ.81,950, 24 క్యారెట్లకు రూ.89,400, 18 క్యారెట్లకు రూ.67,050,
ఖమ్మంలో 22 క్యారెట్ల ధర రూ.81,950, 24 క్యారెట్లకు రూ.89,400, 18 క్యారెట్లకు రూ.67,050,
హైదరాబాద్లో 22 క్యారెట్ల ధర రూ.81,950, 24 క్యారెట్లకు రూ.89,400, 18 క్యారెట్లకు రూ.67,050,
ఆంధ్రప్రదేశ్ ప్రముఖ నగరాల్లో నేటి బంగారం ధరలు:
విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ.81,950, 24 క్యారెట్లకు రూ.89,400, 18 క్యారెట్లకు రూ.67,050,
విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.81,950, 24 క్యారెట్లకు రూ.89,400, 18 క్యారెట్లకు రూ.67,050,
అమరావతిలో 22 క్యారెట్ల ధర రూ.81,950, 24 క్యారెట్లకు రూ.89,400, 18 క్యారెట్లకు రూ.67,050,
గుంటూరులో 22 క్యారెట్ల ధర రూ.81,950, 24 క్యారెట్లకు రూ.89,400, 18 క్యారెట్లకు రూ.67,050,
నెల్లూరులో 22 క్యారెట్ల ధర రూ.81,950, 24 క్యారెట్లకు రూ.89,400, 18 క్యారెట్లకు రూ.67,050,
కాకినాడలో 22 క్యారెట్ల ధర రూ.81,950, 24 క్యారెట్లకు రూ.89,400, 18 క్యారెట్లకు రూ.67,050,
తిరుపతిలో 22 క్యారెట్ల ధర రూ.81,950, 24 క్యారెట్లకు రూ.89,400, 18 క్యారెట్లకు రూ.67,050,
కడపలో 22 క్యారెట్ల ధర రూ.81,950, 24 క్యారెట్లకు రూ.89,400, 18 క్యారెట్లకు రూ.67,050,
అనంతపురంలో 22 క్యారెట్ల ధర రూ.81,950, 24 క్యారెట్లకు రూ.89,400, 18 క్యారెట్లకు రూ.67,050,
మరోవైపు బంగారం బాటలోనే వెండి ధరలు కూడా నేడు పెరిగాయి. ఇవాళ ఒక్కరోజే గ్రాముకు ఒక్క రూ.1 చొప్పున పది గ్రాములకు రూ.10 పెరిగి కేజీకి రూ.1000 పెరిగింది. దింతో ఢిల్లీ, ముంబై, కోల్కతాలో కేజీ వెండి ధర రూ.1,02,000, చెన్నై, హైదరాబాద్, ఆంధ్రప్రదేశంలో కిలో వెండి ధర రూ.1,11,000.
0026GMT నాటికి స్పాట్ గోల్డ్ ఔన్సుకు $3,020.87 వద్ద ఉండగా, US గోల్డ్ ఫ్యూచర్స్ $3,025.10 వద్ద స్థిరంగా మారలేదు. స్పాట్ సిల్వర్ ఔన్సుకు 0.3 శాతం తగ్గి $33.65కి చేరుకోగా, ప్లాటినం 0.1 శాతం తగ్గి $975.96కి చేరుకుంది. పల్లాడియం $956.12 వద్ద స్థిరంగా ఉంది.
బంగారం ధరలు తగ్గడానికి కారణాలు: HDFC సెక్యూరిటీస్ సీనియర్ విశ్లేషకుడు సౌమిల్ గాంధీ ప్రకారం, US డాలర్ అండ్ బాండ్ దిగుబడి పెరుగుదల కారణంగా బంగారం ధరల్లో ఈ తగ్గుదల నమోదైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్తగా సుంకాలను విధించే అవకాశాలను తగ్గించే సూచనలు రావడంతో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం డిమాండ్ ప్రభావితమైంది.
note: పైన పేర్కొన్న బంగారం ధరలు ఉదయం 10 గంటలకు చెందినవి ఇంకా GST, TCS ఇంకా ఇతర లెవీలతో ఉండవు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల వ్యాపారిని లేదా జ్యువెలరీ షాపులో సంప్రదించండి. అలాగే బంగారం ధరలు ఏ సమయంలోనైనా మారవచ్చు.
More From GoodReturns

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications