ప్రస్తుతం బంగారం ధర చాలా వేగంగా పెరుగుతోంది. గడిచిన 3 రోజుల్లో చూస్తే 2 వేలకి పైగానే పెరిగింది. ఇక బంగారంతో పాటు వెండి కేజీ ధర కూడా లక్షకి పైనే కూర్చింది. నేడు 10 గ్రాముల రూ.250 పెరగ్గా, వెండి కాస్త పడిపోయి 1 లక్ష 9 వేల వద్ద ఉంది. ఈ వారంలో వరుసగా 3 రోజులుగా బంగారం ధరలు పెరుగుతూ పరుగులు పెట్టడం గమనార్హం. దింతో సామాన్యుల్లో రానున్న రోజుల్లో ఇక బంగారం కొనగలమా అనే ఆందోళన మొదలైంది. ప్రజలు ఇప్పుడు డబ్బు ఆదా చేసుకోవడానికి మాత్రమే బంగారం కొంటున్నారు. ఇప్పటికే రికార్డు స్థాయికి చేరుకున్న బంగారం ధరలు ఇకపై భారీగా పెరిగే అవకాశం సూచిస్తుంది. అమెరికా నుండి వచ్చే ప్రకటనలు బంగారం ధరలు నిప్పులా పెరగడానికి కారణమవుతుంది. ఇలాంటి సందర్భంలో ఎక్కువ మొత్తంలో కాకుండా గ్రాములల్లో కొనేందుకే అవకాశంగా చూస్తున్నారు.

ఇప్పుడు చాలా మంది నిపుణులు బంగారం ధరల గురించి బుల్లిష్‌గా ఉన్నట్లు కనిపిస్తున్నారు, అయితే కొన్ని రోజుల క్రితం వరకు బంగారం ధరల తగ్గుదల గురించి చాలా చర్చ జరిగింది. కానీ అమెరికా, చైనా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తత కారణంగా బంగారం ధర బలపడింది. గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ గోల్డ్‌మన్ సాచ్స్ కూడా బంగారం ధరల పెరుగుదలను అంచనా వేసింది. యుఎస్ చైనా ట్రేడ్ వార్ తీవ్రతరం కావడం వల్ల అంతర్జాతీయ బంగారం ధరలు ఔన్సుకు $4,500 వరకు పెరగవచ్చని తెలిపింది. అయితే రూపాయితో పోల్చితే డాలర్ బలహీనపడటం, వాణిజ్య యుద్ధం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల ప్రకటనల మధ్య బంగారం ధరలు నేడు పెరిగాయి. ఇక బంగారం ధరలు రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
అక్షయ తృతీయ కారణంగా పెరిగిన డిమాండ్ : ద్రవ్యోల్బణం నిరంతరం కొనసాగుతున్నప్పటికీ బంగారం డిమాండ్ పెరుగుతోంది. ధన్‌తేరస్ తర్వాత అత్యధికంగా ఆభరణాలు లేదా బంగారం కొనుగోలు చేసే పండుగ అక్షయ తృతీయ. ఏప్రిల్ 30న మన దేశంలో అక్షయ తృతీయ జరుపుకుంటారు, దినికి ముందు నుంచే ప్రజలు బంగారం కొనుగోళ్లు ప్రారంభిస్తున్నారు. రాబోయే రెండు వారాల్లో బంగారం ధర మరోసారి పెరిగే అవకాశం ఉందని అంచనా. దీనితో పాటు మే నుండి జూన్ నెలల్లో పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కానుంది, ఇలా కూడా బంగారం కొనుగోళ్లు పెరగడానికి ఛాన్స్ ఉంది. బంగారం ధరలు పెరుగుతున్న ట్రెండ్ చూసి పెట్టుబడిదారులు కూడా బంగారం పై ఇన్వెస్ట్ చేస్తున్నారు. అంతేకాక 2025లో ఇప్పటివరకు బంగారం ధర దాదాపు 28% పెరిగింది, అదే గత ఏడాది 2024లో 27% పెరిగింది.
నేడు 1 గ్రాము, 10 గ్రాముల బంగారం ధరలు : 1 గ్రాము 22 క్యారెట్ల ధర రూ.25 పెరిగి రూ.8,945, 24 క్యారెట్ల ధర రూ.27 పెరిగి రూ. 9,758, 18 క్యారెట్ల ధర రూ.20 పెరిగి రూ.7,319. 10 గ్రాములు 22 క్యారెట్ల ధర రూ. 89,450, నిన్నటి ధర రూ.89,200 అంటే రూ.250 పెరిగింది, 10 గ్రాములు 24 క్యారెట్ల ధర రూ. 97,580, నిన్నటి ధర చూస్తే రూ.97,310 దింతో రూ.270 ఎగబాకింది, 10 గ్రాములు 18 క్యారెట్ల ధర రూ.73,190, నిన్నటి ధర రూ.72,990 అంటే రూ.200 పెరుగుదల నమోదు చేసింది.
తెలంగాణ రాష్ట్రంలోని నగరాల్లో ప్రస్తుత బంగారం ధరలు: వరంగల్లో 22 క్యారెట్ల ధర రూ.89,450, 24 క్యారెట్లకు రూ.97,580, 18 క్యారెట్లకు రూ.73,190. కరీంనగర్లో 22 క్యారెట్ల ధర రూ.89,450, 24 క్యారెట్లకు రూ.97,580, 18 క్యారెట్లకు రూ.73,190. ఖమ్మంలో 22 క్యారెట్ల ధర రూ.89,450, 24 క్యారెట్లకు రూ.97,580, 18 క్యారెట్లకు రూ.73,190. హైదరాబాద్లో 22 క్యారెట్ల ధర రూ.89,450, 24 క్యారెట్లకు రూ.97,580, 18 క్యారెట్లకు రూ.73,190.
ఆంధ్రప్రదేశ్ ప్రముఖ నగరాల్లో నేటి బంగారం ధరలు: విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ.89,450, 24 క్యారెట్లకు రూ.97,580, 18 క్యారెట్లకు రూ.73,190. విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.89,450, 24 క్యారెట్లకు రూ.97,580, 18 క్యారెట్లకు రూ.73,190. అమరావతిలో 22 క్యారెట్ల ధర రూ.89,450, 24 క్యారెట్లకు రూ.97,580, 18 క్యారెట్లకు రూ.73,190. గుంటూరులో 22 క్యారెట్ల ధర రూ.89,450, 24 క్యారెట్లకు రూ.97,580, 18 క్యారెట్లకు రూ.73,190. నెల్లూరులో 22 క్యారెట్ల ధర రూ.89,450, 24 క్యారెట్లకు రూ.97,580, 18 క్యారెట్లకు రూ.73,190. కాకినాడలో 22 క్యారెట్ల ధర రూ.89,450, 24 క్యారెట్లకు రూ.97,580, 18 క్యారెట్లకు రూ.73,190. తిరుపతిలో 22 క్యారెట్ల ధర రూ.89,450, 24 క్యారెట్లకు రూ.97,580, 18 క్యారెట్లకు రూ.73,190. కడపలో 22 క్యారెట్ల ధర రూ.89,450, 24 క్యారెట్లకు రూ.97,580, 18 క్యారెట్లకు రూ.73,190. అనంతపురంలో 22 క్యారెట్ల ధర రూ.89,450, 24 క్యారెట్లకు రూ.97,580, 18 క్యారెట్లకు రూ.73,190.
మరోవైపు వెండి ధరలు చూస్తే ఇవాళ ఒక్క గ్రాముకి రూ.99.90గా ఉండగా, 10 గ్రాములకి రూ.999, కేజీకి నేడు రూ.99,900 అంటే ఇవాళ రూ.100 తగ్గింది. ఢిల్లీ, ముంబై, కోల్కతాలో కేజీ వెండి ధర రూ.99,900, చెన్నై, హైదరాబాద్, ఆంధ్రప్రదేశంలో కిలో వెండి ధర రూ.1,09,900.
అమెరికన్ సుంకాల ప్రభావం: డోనాల్డ్ ట్రంప్ ప్రపంచ ద్దేశాల పై సుంకాన్ని ప్రకటించినప్పటి నుండి బంగారం ధరలో మార్పు కనిపించింది. నిజానికి ఏప్రిల్ 2న అమెరికా అధ్యక్షుడు ఈ సుంకాలని ప్రకటించగా, తర్వాత ఏప్రిల్ 8న బంగారం ధర అకస్మాత్తుగా పడిపోయింది. దీని తరువాత సుంకాల విధింపు 90 రోజుల పాటు వాయిదా పడినప్పుడు బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. మరోవైపు ఈ వారంలో వరుసగా మూడు రోజుల నుండి బంగారం ధరలో నిరంతర పెరుగుదల కొనసాగుతోంది.
note: పైన పేర్కొన్న బంగారం ధరలు ఉదయం 10గంటలకు చెందినవి ఇంకా GST, TCS ఇంకా ఇతర లెవీలతో ఉండవు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల వ్యాపారిని లేదా జ్యువెలరీ షాపులో సంప్రదించండి. అలాగే బంగారం ధరలు ఏ సమయంలోనైనా మారవచ్చు.
More From GoodReturns

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications