ఈ నెల మార్చిలో బంగారం, వెండి ధరలు సరికొత్త రికార్డు స్థాయికి చేరాయి.అయితే కేవలం ఒక్క మార్చి నెల ప్రారంభం నుండే బంగారం ధర భారీగా పెరగడం గమనార్హం. ఇక పెళ్లిళ్ల సీజన్లో కాస్త దిగొస్తాయనుకున్న ధరలు మాత్రం అమాంతం పెరిగిపోయాయి. ప్రస్తుతం బంగారం ధర రూ.90 వేల మార్కు చేరువలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా బంగారం వినియోగంలో చైనా తర్వాత భారతదేశం రెండవ స్థానంలో ఉంది. మన దేశంలో బంగారం డిమాండ్‌లో ఎక్కువ భాగం దిగుమతుల ద్వారా అవుతుంది, మిగిలినది దేశీయంగా రీసైకిల్ చేసిన బులియన్ నుండి లభిస్తుంది.

భారతదేశంలో బంగారం ధరలను అనేక అంశాలు ప్రభావితం చేస్తాయి. వీటిలో గ్లోబల్ మార్కెట్ ట్రెండ్‌లు కీలకమైనవి, ఎందుకంటే బంగారం ఎక్కువగా US డాలర్లలో ధర నిర్ణయించబడుతుంది. ఇంకా దిగుమతి సుంకాలు, పన్నులు దేశీయ ధరలను నిర్ణయించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఈరోజు శుక్రవారం బంగారం, వెండి ధరలు కాస్త కలిసొచ్చాయి. నిన్న మొన్నటి వరకు మంట పుట్టించిన ధరలు నేడు కాస్త చల్లబడి దిగొచ్చాయి. దింతో 24 క్యారెట్ల బంగారం ధర రూ.440 తగ్గి పది గ్రాములకి రూ.90,670కి చేరింది. అలాగే వెండి ధర రూ.2100 తగ్గి ఒక కిలోకి రూ.1,12,000కి పడిపోయింది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర రూ.400 పడిపోయి పది గ్రాముల ధర రూ.82,700కి దిగొచ్చింది.
నేడు 1 గ్రాము, 10 గ్రాముల బంగారం ధరలు :
1 గ్రాము 22 క్యారెట్ల ధర రూ.8,270, 24 క్యారెట్ల ధర రూ. 9,022, 18 క్యారెట్ల ధర రూ. 6,767. 10 గ్రాములు 22 క్యారెట్ల ధర రూ. 82,700, నిన్నటి ధర రూ.83,100 అంటే రూ.400 తగ్గగా, 10 గ్రాములు 24 క్యారెట్ల ధర రూ. 90,220, నిన్నటి ధర చూస్తే రూ.90,660 దింతో రూ.440 తగ్గింది. 10 గ్రాములు 18 క్యారెట్ల ధర రూ.67,670, నిన్నటి ధర రూ.67,991 అంటే రూ.321 పడిపోయింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ నగరాల్లో నేటి బంగారం ధరలు:
విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ.82,700, 24 క్యారెట్లకు రూ.90,220, 18 క్యారెట్లకు రూ.67,670,
విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.82,700, 24 క్యారెట్లకు రూ.90,220, 18 క్యారెట్లకు రూ.67,670,
అమరావతిలో 22 క్యారెట్ల ధర రూ.82,700, 24 క్యారెట్లకు రూ.90,220, 18 క్యారెట్లకు రూ.67,670,
గుంటూరులో 22 క్యారెట్ల ధర రూ.82,700, 24 క్యారెట్లకు రూ.90,220, 18 క్యారెట్లకు రూ.67,670,
నెల్లూరులో 22 క్యారెట్ల ధర రూ.82,700, 24 క్యారెట్లకు రూ.90,220, 18 క్యారెట్లకు రూ.67,670,
కాకినాడలో 22 క్యారెట్ల ధర రూ.82,700, 24 క్యారెట్లకు రూ.90,220, 18 క్యారెట్లకు రూ.67,670,
తిరుపతిలో 22 క్యారెట్ల ధర రూ.82,700, 24 క్యారెట్లకు రూ.90,220, 18 క్యారెట్లకు రూ.67,670,
కడపలో 22 క్యారెట్ల ధర రూ.82,700, 24 క్యారెట్లకు రూ.90,220, 18 క్యారెట్లకు రూ.67,670,
అనంతపురంలో 22 క్యారెట్ల ధర రూ.82,700, 24 క్యారెట్లకు రూ.90,220, 18 క్యారెట్లకు రూ.67,670,
హైదరాబాద్లో 22 క్యారెట్ల ధర రూ.82,700, 24 క్యారెట్లకు రూ.90,220, 18 క్యారెట్లకు రూ.67,670,
ఇవాళ వెండి ధర చూస్తే కేజీ ధర రూ.2,100 తగ్గి రూ.1,12,000 చేరింది.
0030 GMT నాటికి స్పాట్ గోల్డ్ ఔన్సుకు $3,043.89 వద్ద స్థిరంగా ఉండగా, నిన్న ఔన్సుకు $3,057.21 ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది. ఈ వారంలో ఇప్పటివరకు దాదాపు 2 శాతం పెరిగింది. అమెరికా గోల్డ్ ఫ్యూచర్స్ 0.3 శాతం పెరిగి $3,051.90కి చేరుకుంది. స్పాట్ సిల్వర్ ఔన్సుకు 0.3 శాతం తగ్గి $33.45కి, ప్లాటినం 0.1 శాతం తగ్గి $985.55కి, పల్లాడియం 0.2 శాతం తగ్గి $950.47కి చేరుకుంది. అయితే బంగారం ధరలు రానున్న రోజుల్లో మరింతల తగ్గుతాయా లేదా అనేది వేచి చూడాలి. ప్రస్తుత కాలంలో పసిడి, వెండి రేట్లు తగ్గుముఖం పట్టడం కొనుగోలుదారుల ముఖాల్లో సంతోషాన్ని ఇస్తుంది.
note: పైన పేర్కొన్న బంగారం ధరలు ఉదయం 10 గంటలకు చెందినవి ఇంకా GST, TCS ఇంకా ఇతర లెవీలతో ఉండవు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల వ్యాపారిని లేదా జ్యువెలరీ షాపులో సంప్రదించండి. అలాగే బంగారం ధరలు ఏ సమయంలోనైనా మారవచ్చు.
More From GoodReturns

Gold rates: బంగారం ధరలకు మళ్ళీ రెక్కలు! తెలుగు రాష్ట్రాల్లో నేటి ధరలివే..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications