సెప్టెంబర్ 1 (సోమవారం) రోజున దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు కొత్త రికార్డు గరిష్టాలను తాకాయి. అక్టోబర్ 3 ఫ్యూచర్స్ కాలానికి బంగారం ధర 10 గ్రాములకు రూ.1,05,937 వరకు చేరగా.. డిసెంబర్ 5 ఫ్యూచర్ కాలానికి వెండి ధర కిలోకు రూ.1,24,214 రికార్డు స్థాయికి ఎగబాకింది. ఉదయం 9:50 గంటల సమయంలో MCXలో అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ 1.02% పెరిగి 10 గ్రాములకు ₹1,04,883 వద్ద ట్రేడ్ అవుతుండగా, డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ 1.81% పెరిగి కిలోకు ₹1,24,079 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.
ఈ పెరుగుదల వెనుక అనేక అంతర్జాతీయ కారణాలు ఉన్నాయి.US ఫెడరల్ రిజర్వ్ ఈ నెలలో వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉందని పెట్టుబడిదారులు భావిస్తున్నారు. వడ్డీ రేట్లు తగ్గితే డాలర్ బలహీనపడుతుంది. దాంతో బంగారం, వెండి వంటి విలువైన లోహాలపై పెట్టుబడులు పెరుగుతాయి. ధరలు ఆకాశాన్ని తాకుతాయి.
ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య విధానాలు ఎప్పటికప్పుడు మారుతున్నాయి. ఆయన సుంకాల నిర్ణయాలు ప్రపంచ ఆర్థిక వృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ఈ తరహా అనిశ్చితిలో పెట్టుబడిదారులు సేఫ్ హావెన్ (సురక్షిత ఆస్తి)గా బంగారాన్ని ఎంచుకుంటున్నారు.

ఆగస్టు చివరి వారంలో డాలర్ ఇండెక్స్ 2 శాతం కంటే ఎక్కువగా పడిపోయింది. బంగారం ధర US డాలర్లలో ఉంటుందని గమనిస్తే.. డాలర్ బలహీనపడినప్పుడు ఇతర కరెన్సీలతో పోల్చితే బంగారం చౌక అవుతుంది. దీంతో అంతర్జాతీయ డిమాండ్ పెరుగుతుంది.ఇక పండుగ సీజన్ దగ్గర పడుతున్నందున భారత్‌లోనూ బంగారం, వెండి డిమాండ్ బలంగా ఉంది. ఇది ధరలను ఇంకా పైకి నెట్టిందని చెప్పవచ్చు.
పెట్టుబడిదారులు ఇప్పుడు బంగారం, వెండిలో షార్ట్ సెల్లింగ్ (తగ్గుతుందని ఊహించి అమ్మడం) చేయకూడదని పృథ్వీఫిన్‌మార్ట్ కమోడిటీ రీసెర్చ్‌కు చెందిన మనోజ్ కుమార్ జైన్ సూచిస్తున్నారు. దీనికి బదులుగా బై ఆన్ డిప్స్ (తగ్గినప్పుడు కొనడం) స్ట్రాటజీ అనుసరించాలని చెబుతున్నారు. బంగారం త్వరలోనే రూ. 1,07,000 వరకు వెళ్లే అవకాశం ఉందని బ్యాంక్ నిపుణులు చెబుతున్నారు.ఇక వెండి కూడా రూ. 1,27,000 స్థాయికి పెరిగే అవకాశం ఉందని అంచనా. డాలర్ ఇంకా బలహీనమైతే, ధరలు మరింత ఎగబాకే అవకాశం ఉంది.
మెహతా ఈక్విటీస్ కమోడిటీస్ విభాగం వైస్ ప్రెసిడెంట్ రాహుల్ కలాంత్రి ప్రకారం, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరకు 3,420 డాలర్ల నుంచి 3,395 డాలర్ల వరకు మద్దతు ఉండగా, 3,465 డాలర్ల నుంచి 3,480 డాలర్ల వరకు నిరోధం ఉన్నట్లు తెలిపారు. అదే విధంగా, వెండి ధరకు 39.35 డాలర్ల నుంచి 39.10 డాలర్ల వరకు మద్దతు ఉండగా, 40.05 డాలర్ల నుంచి 40.35 డాలర్ల వరకు నిరోధక స్థాయిలు ఉన్నాయని అన్నారు.
భారతీయ రూపాయిల్లో కూడా ఇదే ధోరణి కనిపిస్తోందని ఆయన వివరించారు. బంగారం ధరకు రూ.1,02,940 నుంచి రూ.1,03,340 వరకు మద్దతు ఉండగా, రూ.1,04,450 నుంచి రూ. 1,04,750 వరకు నిరోధం ఉందని తెలిపారు. వెండి విషయానికి వస్తే, కిలోకు రూ. 1,18,850 నుంచి రూ. 1,19,450 వరకు మద్దతు ఉండగా, ₹1,20,950 నుంచి ₹1,21,650 వరకు నిరోధ స్థాయిలు ఉన్నట్లు కలాంత్రి పేర్కొన్నారు.
బంగారం కొనుగోలుపై నిపుణులు ఏమంటున్నారంటే.. Gold రూ.1,03,300 వద్ద ట్రేడ్ అవుతున్నప్పుడు కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు. అలాగే రూ.1,04,700 వద్దకు చేరినప్పుడు కొనడం ఆపాలని చెబుతున్నారు. వెండి కూడా రూ. 1,20,000 వద్ద కొనుగోలు చేయాలని..రూ. 1,24,000 వద్ద కొనుగోలు ఆపాలని చెబుతున్నారు. ఈ స్థాయిలను పెట్టుబడిదారులు గమనించాలని వారు సలహా ఇస్తున్నారు.
బంగారం, వెండి ధరలు ఇప్పటికే రికార్డు గరిష్టాలను తాకాయి. మరికొంత పెరుగుదల అవకాశం ఉన్నప్పటికీ, ఈ స్థాయిల్లో భారీగా కొనుగోలు చేయడం కంటే తగ్గినప్పుడు కొంత కొంతగా కొనడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. దీర్ఘకాలంలో బంగారం, వెండి రెండూ మంచి రక్షణ కలిగించే పెట్టుబడులుగా ఉంటాయని..అయితే ఆచితూచి అడుగులు వేయాలని చెబుతున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications