భారతీయ బులియన్ మార్కెట్లో ఫిబ్రవరి 3న బంగారం ధరలు ఒక్కసారిగా పైకి ఎగసాయి. అమెరికా-భారత్ మధ్య కుదిరిన కీలక వాణిజ్య ఒప్పందం తర్వాత..సురక్షిత పెట్టుబడి సాధనంగా భావించే బంగారం వైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపడంతో ధరలు దూసుకెళ్లాయి. ఈ ప్రభావంతో MCX గోల్డ్ ఫ్యూచర్స్‌లో బలమైన కొనుగోళ్లు కనిపించాయి.
MCXలో ఏప్రిల్ డెలివరీకి సంబంధించిన 24 క్యారెట్ల బంగారం ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ దాదాపు 3 శాతం పెరిగి 10 గ్రాములకు రూ.1,48,000 స్థాయికి చేరుకుంది. తరువాతి సెషన్లలో ఈ ర్యాలీ మరింత ఊపందుకొని, బంగారం ధర రూ.1.53 లక్షల మార్కును కూడా దాటింది. ఇంట్రాడేలో 10 గ్రాములకు రూ.1,53,290 గరిష్ట స్థాయిని తాకడం గమనార్హం. మొత్తం మీద బంగారం ధరలు 6 శాతానికి పైగా లాభపడ్డాయి.

అంతర్జాతీయ మార్కెట్లలో కూడా బంగారం బలమైన పునరుద్ధరణను నమోదు చేసింది. దాదాపు నెల రోజుల కనిష్ట స్థాయిల నుంచి తిరిగి పుంజుకున్న స్పాట్ గోల్డ్ ఔన్సుకు సుమారు 4 శాతం పెరిగి 4,837.16 డాలర్లకు చేరుకుంది. అదే సమయంలో ఏప్రిల్ డెలివరీకి సంబంధించిన US గోల్డ్ ఫ్యూచర్స్ 4.5 శాతం పెరిగి ఔన్సుకు 4,859.30 డాలర్ల వద్ద ట్రేడయ్యాయి. అమెరికా ప్రభుత్వం పాక్షికంగా మూసివేయబడిన నేపథ్యంలో.. ఆర్థిక డేటా కొరత ఉండటంతో పెట్టుబడిదారులు రిస్క్ తీసుకోవడం తగ్గించి బంగారం వంటి సురక్షిత ఆస్తుల వైపు మళ్లినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
ఈ ర్యాలీకి ప్రధాన కారణంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం నిలిచింది. ఈ ఒప్పందం ప్రకారం.. భారతీయ వస్తువులపై విధిస్తున్న సుంకాలను అమెరికా 50 శాతం నుంచి 18 శాతానికి తగ్గించింది. దీనితో భారత మార్కెట్లో కొనుగోలు సెంటిమెంట్ బలపడింది. బంగారం దిగుమతి ఖర్చులపై ప్రభావం తగ్గుతుందన్న అంచనాలు కూడా ధరలను పైకి నడిపించాయి.
జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ కమోడిటీ రీసెర్చ్ హెడ్ హరీష్ వి మాట్లాడుతూ.. గత వారం భారీ అమ్మకాల తర్వాత Gold, వెండి ధరలు స్థిరపడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇది దీర్ఘకాలిక బలమైన పునరుద్ధరణా? లేక కేవలం తాత్కాలిక ఓవర్‌షూట్‌నా? అన్నదానిపై పెట్టుబడిదారులు తిరిగి అంచనా వేస్తున్నారని అన్నారు. బులియన్ మార్కెట్‌కు మద్దతిచ్చే ఫండమెంటల్స్ ఇప్పటికీ బలంగానే ఉన్నాయని, ఇటీవల వచ్చిన దిద్దుబాటు ప్రధానంగా తాత్కాలిక కారణాల వల్లేనని ఆయన తెలిపారు.
బంగారంతో పాటు వెండి ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. మార్చి 2026 డెలివరీకి సంబంధించిన MCX వెండి ధర 1 కిలోకు దాదాపు రూ.2.7 లక్షల స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం వెండి రూ.2,67,890 వద్ద ట్రేడవుతుండగా, ఇది దాదాపు 13.4 శాతం లాభాన్ని సూచిస్తుంది. ఇంట్రాడేలో వెండి ధర రూ.2,69,654 గరిష్టాన్ని తాకింది. అంతర్జాతీయంగా స్పాట్ సిల్వర్ కూడా 11 శాతం కంటే ఎక్కువగా పెరిగింది.
క్లుప్తంగా చెప్పాలంటే.. ప్రపంచ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు, వాణిజ్య ఒప్పందంపై ఆశావాదం, డాలర్ కదలికలు, సురక్షిత పెట్టుబడులపై పెరిగిన డిమాండ్ Gold-వెండి ధరల్లో ఈ భారీ ర్యాలీకి కారణమయ్యాయి. రాబోయే రోజుల్లో మార్కెట్లు అస్థిరంగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ, పెట్టుబడిదారులు బులియన్ ధరల కదలికలను నిశితంగా గమనిస్తున్నారని ఆర్ధిక నిపుణులు అంటున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.
More From GoodReturns

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన వెండి, పసిడి ధరలు,..పుంజుకున్న రూపాయి

బంగారం, వెండి ధరలు తగ్గాయని సంబరాలు వద్దు.. పసిడి పెరుగుదలపై షాకింగ్ న్యూస్ చెప్పిన బ్యాంకింగ్ దిగ్గజం..

Today Gold Silver Rate Live: తగ్గిన వెండి ధర.. పెరిగిన బంగారం ధర.. కారణం ఏంటంటే..

Gold: ఐసీఐసీఐ బ్యాంక్‌లో భారీ గోల్డ్ లోన్ కుంభకోణం! నకిలీ బంగారంతో రూ. 23 కోట్లు మాయం!

ఇరాన్ యుద్దం దెబ్బ.. బంగారం కొనడం మానేసి అమ్మేసుకుంటున్న కేంద్ర బ్యాంకులు.. కారణం ఏంటంటే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాలంటే రూపాయి బలపడాల్సిందే.. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..



Click it and Unblock the Notifications