Gold Rate Today: మార్చి నెలలో పెళ్లిళ్లు ముగిసినప్పటికీ బంగారం రేట్లకు మాత్రం రెక్కలు వచ్చాయి. అంతర్జాతీయంగా పసిడికి పెరుగుతున్న డిమాండ్ కారణంగా ధరలు తిరిగి పుంజుకోవటంతో భారతీయ పసిడి ప్రేమికులు నిరాశకు గురవుతున్నారు.
ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు నిన్నటితో పోల్చితే రూ.700 పెరిగి అందరికీ షాక్ ఇచ్చింది. ఈ క్రమంలో దేశంలోని ప్రముఖ నగరాల్లో నేడు రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.60,150, ముంబైలో రూ.59,450, దిల్లీలో రూ.59,600, కలకత్తాలో రూ.59,450, బెంగళూరులో రూ.59,450, కేరళలో రూ.59.450, జైపూరులో రూ.59,600, మంగళూరులో రూ.59,450, నాశిక్ లో రూ.59,480, మైసూరులో రూ.59,450, అయోధ్యలో రూ.59,600, బళ్లారిలో రూ.59,450, గురుగ్రాములో రూ.59,600, నోయిడాలో రూ.59,600 వద్ద విక్రయించబడుతున్నాయి.

ఇక 24 క్యారెట్ల పసిడి ధరలను పరిశీలిస్తే 10 గ్రాముల ధర నిన్నటి కంటే రూ.760 పెరుగుదలను నమోదు చేసింది. దీంతో ప్రముఖ నగరాల్లో రిటైల్ రేట్లను గమనిస్తే.. చెన్నైలో రూ.65,620, ముంబైలో రూ.64,850, దిల్లీలో రూ.65,000, కలకత్తాలో రూ.64,850, బెంగళూరులో రూ.64,850, కేరళలో రూ.64,850, జైపూరులో రూ.65,000, మంగళూరులో రూ.64,850, నాశిక్ లో రూ.64,880, మైసూరులో రూ.64,850, అయోధ్యలో రూ.65,000, బళ్లారిలో రూ.64,850, గురుగ్రాములో రూ.65,000, నోయిడాలో రూ.65,000గా ఉన్నాయి.
రెండు తెలుగు రాష్ట్రాల్లోని నగరాలైన విజయవాడ, గుంటూరు, విశాఖ, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, కడప, అనంతపురం, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.59,450గా ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.64,850గా కొనసాగుతోంది. ఇదే క్రమంలో ఏపీ, తెలంగాణలో నేటి వెండి ధరలను పరిశీలిస్తే.. కేజీ రేటు రూ.1,100 పెరిగి రిటైల్ విక్రయ ధర రూ.78,200గా కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications