Gold Price Today: కొత్త ఏడాదిలో తొలిసారిగా పసిడి ధరలు తగ్గుదలను నమోదు చేశాయి. మరికొద్ది రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో విశేషంగా జరుపుకునే సంక్రాంతి దగ్గర పడుతున్న వేళ పసిడి రేట్లు తగ్గటం కొనుగోలుదారులకు ఆకర్షనీయంగా మారింది.
22 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు నిన్నటితో పోల్చితే రూ.250 మేర స్వల్ప క్షీణతను నమోదు చేసింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి రిటైల్ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.59,150, ముంబైలో రూ.58,500, దిల్లీలో రూ.58,650, కలకత్తాలో రూ.58,500, బెంగళూరులో రూ.58,500, కేరళలో రూ.58,500, పూణేలో రూ.58,500, వడోదరలో రూ.58,550, జైపూరులో రూ.58,650, కోయంబత్తూరులో రూ.59,150, పాట్నాలో రూ.58,550, నాశిక్ లో రూ.58,530, మైసూరులో రూ.58,500 వద్ద కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధరను పరిశీలిస్తే నిన్నటి కన్నా రూ.270 మేర తగ్గాయి. దీంతో వివిధ ప్రాంతాల్లో తాజా రిటైల్ ధరలు చూస్తే.. చెన్నైలో రూ.64,530, ముంబైలో రూ.63,820, దిల్లీలో రూ.63,970, కలకత్తాలో రూ.63,820, బెంగళూరులో 63,820, కేరళలో 63,820, పూణేలో రూ.63,820, వడోదరలో రూ.63,870, జైపూరులో రూ.63,970, కోయంబత్తూరులో రూ.64,530, పాట్నాలో రూ.63,870, నాశిక్ లో రూ.63,850, మైసూరులో రూ.63,820గా ఉన్నాయి.
ఏపీ, తెలంగాణ నగరాలైన విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కాకినాడ, అనంతపురం, విశాఖ, కడప, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్, నిజాంబాద్ లలో 22 క్యారెట్ల గోల్డ్ రిటైల్ ధర రూ.58,500గా ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రిటైల్ తాజా ధరలు రూ.63,820గా కొనసాగుతున్నాయి. ఇదే క్రమంలో వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో పరిశీలిస్తే నేడు కేజీకి రూ.300 తగ్గి రిటైల్ మార్కెట్లో రూ.80,000 వద్ద అమ్ముడవుతున్నాయి.


Click it and Unblock the Notifications