Gold Rate Today: మళ్లీ పెరిగిన గోల్డ్ రేటు.. షాపింగ్ లేటు చేస్తే మీకే నష్టం.. తాజా రేట్లు..
Gold Price: గతవారం అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వు ప్రకటనతో బంగారం ధరలు ఊపందుకున్న సంగతి తెలిసిందే. అయితే వారాంతంలో స్వల్ప తగ్గుదలను నమోదు చేసింది. అయితే కొత్త వారంలో ధరలు మళ్లీ తిరిగి పుంజుకోవటం ఆందోళన కలిగిస్తోంది.
22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 10 గ్రాములకు స్వల్పంగా రూ.100 మేర పెరిగింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో పెరిగిన తాజా రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.57,850, ముంబైలో రూ.57,400, దిల్లీలో రూ.57,550, కలకత్తాలో రూ.57,400, బెంగళూరులో రూ.57,400, కేరళలో రూ.57,400, పూణేలో రూ.57,400, వడోదరలో రూ.57,450, జైపూరులో రూ.57,550, కోయంబత్తూరులో రూ.57,850, నాశిక్‌లో రూ.57,430, మైసూరులో రూ.57,400, బళ్లారిలో రూ.57,400, గురుగ్రాములో రూ.57,550, నోయిడాలో రూ.57,550గా కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర నిన్నటి కంటే రూ.110 మేర పెరుగుదలను నమోదు చేసింది. దేశంలోని ప్రముఖ నగరాల్లో రిటైల్ విక్రయ ధరలను గమనిస్తే.. చెన్నైలో రూ.63,110, ముంబైలో రూ.62,620, దిల్లీలో రూ.62,770, కలకత్తాలో రూ.62,620, బెంగళూరులో రూ.62,620, కేరళలో రూ.62,620, పూణేలో రూ.62,620, వడోదరలో రూ.62,670, జైపూరులో రూ.62,770, కోయంబత్తూరులో రూ.63,110, నాశిక్‌లో రూ.62,650, మైసూరులో రూ.62,620, బళ్లారిలో రూ.62,620, గురుగ్రాములో రూ.62,770, నోయిడాలో రూ.62,770గా కొనసాగుతున్నాయి.
రెండు తెలుగు రాష్ట్రాల్లోని నగరాలైన విజయవాడ, విశాఖ, కాకినాడ, నెల్లూరు, తిరుపతి, అనంతపురం, గుంటూరు, కడప, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ నగరాల్లో 22 క్యారెట్ల ధర రూ.57,400 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రేటు రూ.62,620గా కొనసాగుతోంది. ఇదే క్రమంలో ఏపీ, తెలంగాణలో నేటి వెండి రిటైల్ ధరలను పరిశీలిస్తే.. కేజీ ధర రూ.300 పెరిగి రూ.80,000 వద్ద కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications