భారతదేశంలో ఇన్వెస్టర్లకు బంగారం, వెండి ఎప్పుడూ సురక్షితంగా కనిపిస్తూ ఉంటుంది. పండగలు, పెళ్లిళ్లు, ఆచారాలు ఇలా ఈ సీజన్ వచ్చినా పసిడిని కొనేస్తూ ఉంటారు. అయితే వాటి ధరలు పెరగడం లేదా పడిపోవడంలో కేవలం ఆభరణాల డిమాండ్ మాత్రమే కారణం కాదు. దీని వెనుక అసలు రహస్యపు శక్తులు అంతర్జాతీయ స్థాయిలో ఉన్నాయని సెబీ-నమోదు పొందిన రీసెర్చ్ అనలిస్ట్ సుమేష్ గులేరియా చెబుతున్నారు. .
సాధారణంగా దీపావళి, దసరా, ధన్‌తేరస్ సీజన్ వచ్చిందంటే బంగారం, వెండి మార్కెట్లు ఎప్పటిలాగే కళకళలాడుతుంటాయి. అయితే ఈ ఆనందం వెనుక పెట్టుబడి వాస్తవాలను గమనించకపోతే సామాన్యులు భారీగా నష్టపోయే ప్రమాదం ఉంది. రిటైల్ ఇన్వెస్టర్లు బంగారాన్ని అధిక ధరలకు కొనుగోలు చేసి, తర్వాత నష్టపోయే అవకాశం ఉందని సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ (RIA) సుమేష్ గులేరియా హెచ్చరిస్తున్నారు.

గత కొన్ని నెలలుగా బంగారం, వెండి అంతర్జాతీయ ధరలు నిరంతర పెరుగుదలతో రికార్డులను తాకుతున్నాయి. జియోపాలిటికల్ ఉద్రిక్తతలు, గ్లోబల్ సెంట్రల్ బ్యాంకుల బంగారం కొనుగోళ్లు, డాలర్ బలహీనత, వడ్డీ రేట్ల మార్పు అంచనాలు ఇవన్నీ కలిసి Gold ర్యాలీకి ఇంధనమిచ్చాయి. ఫలితంగా.. భారతీయ మార్కెట్లో బంగారం 24 క్యారెట్ల ధర లక్ష రూపాయల దాటగా, వెండి కిలో ధర కూడా లక్ష రూపాయలను దాటింది.
పండుగ సీజన్‌లో రిటైల్ ఇన్వెస్టర్లు భావోద్వేగాలకు లోనై అధిక ధరల వద్ద కొనుగోలు చేస్తారు. దీని తర్వాత మార్కెట్ సరిదిద్దుకునే (correction) అవకాశం ఎక్కువగా ఉంటుంది. సుమేష్ గులేరియా చెబుతున్న ప్రకారం.. ఇన్వెస్టింగ్‌లో టైమింగ్ కంటే డిసిప్లిన్ ముఖ్యం. పీక్ సమయంలో ఎంట్రీ ఇస్తే, షార్ట్ టర్మ్‌లో నష్టాలు తప్పవని చెబుతున్నారు.
పెట్టుబడిదారులు పండుగ ఆఫర్లు, జువెలరీ అడ్స్, సోషల్ మీడియాలో హడావిడి చూసి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవద్దని సూచిస్తున్నారు. లంప్‌సమ్‌గా అధిక ధర వద్ద కొనుగోలు చేసే బదులుగా, నెలవారీ లేదా త్రైమాసికంగా కొనుగోలు చేయడం ద్వారా సగటు ధరను తగ్గించుకోవచ్చని చెబుతున్నారు. మొత్తం పెట్టుబడిని బంగారం, వెండి మీదే కాకుండా ఈక్విటీలు, బాండ్లు, రియల్ ఎస్టేట్ వంటి ఆస్తుల మధ్య విభజించాలని సలహా ఇస్తుననారు.
సాధారణంగా ధన్‌తేరస్ లేదా దీపావళి తర్వాత కొద్ది వారాల్లో ధరలు కొంత శాంతిస్తాయి. డిమాండ్ తాత్కాలికంగా తగ్గడం, అంతర్జాతీయ మార్కెట్లలో సెంటిమెంట్ మార్పులు, ఫ్యూచర్స్ పొజిషన్ అన్‌వైండింగ్ ప్రభావంతో ధరలు తగ్గుముఖం పడతాయి. కాబట్టి పండుగ సీజన్‌లో బంగారం, వెండి కొనుగోలు సాంప్రదాయం అయినప్పటికీ.. పెట్టుబడి విషయంలో మాత్రం కాదని సుమేష్ గులేరియా చెబుతున్నారు.
డిస్క్లైమర్: ఈ వ్యాసం కేవలం సమాచారం కోసం మాత్రమే అందించబడింది. ఇది విలువైన లోహాలు, వస్తువులు, స్టాకులు లేదా ఇతర ఆర్థిక పెట్టుబడులను కొనుగోలు చేయమని లేదా అమ్మమని చెప్పడం కాదు. ఈ వ్యాసంలోని సమాచారం ఆధారంగా ఎవరైనా నష్టాలు లేదా సమస్యలను ఎదుర్కొంటే, గ్రేనియమ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థలు, భాగస్వాములు లేదా రచయితలు ఎలాంటి బాధ్యత వహించరు. కాబట్టి మీరు ఏవైనా లావాదేవీలు జరిపే ముందు నిపుణులను సంప్రదించి నిర్ణయం తీసుకోండి.
More From GoodReturns

Today Gold Silver Rate Live: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

బంగారం ధరల పెరుగుదలపై లేటెస్ట్ రిపోర్ట్.. సరికొత్త నివేదికను విడుదల చేసిన ప్రముఖ బ్యాంకులు

Gold reserves: ఈ చిన్న దేశం కొంటున్న బంగారం చూస్తే కళ్లు చెదరాల్సిందే!

బంగారం ధరలపై దిమ్మతిరిగే న్యూస్.. పసిడి ధర భారీగా పెరగడానికి ఈ మూడే కారణం.. భవిష్యత్తులో కూడా..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పసిడి రేటు భారీ ర్యాలీతో ఎంత వరకు వెళ్లిందంటే.. ఏప్రిల్ 15, బుధవారం ధరలు ఇవే..

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు ర్యాలీ చేసిందంటే.. ఏప్రిల్ 11, శనివారం ధరలు ఇవే..

ఈ ఏడాది బంగారం, వెండి పెరుగుదలపై సంచలన నివేదిక.. ఏకంగా ఆ స్థాయి వరకు వెళుతుందంటున్న నిపుణులు..

బంగారం, వెండి ధరలు తగ్గాయి. తాజా రేట్లు ఇక్కడ చూడండి

Today Gold Silver Rate Live: అమెరికా ఇరాన్ చర్చల తర్వాత పెరిగిన బంగారం ధరలు

Gold: బంగారంపై పెట్టుబడి పెడుతున్నారా? బిస్కెట్లు, కాయిన్స్ ఎక్కడ కొంటే ఎక్కువ లాభం?

Today Gold Silver Rate Live: బంగారం, వెండి ధరలు పతనం.. ఈ రోజు రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications