Gold Rate: షాకింగ్ అంతరీక్షానికి పసిడి ధర.. నేడు ఏకంగా రూ.13,000 పెరిగిన రేటు..!!
Gold Price Today: బంగారం ధర ఈ సంవత్సరం కొత్త గరిష్ఠాలకు చేరుకుంటుందని గోల్డ్‌మన్ సాక్స్ రీసెర్చ్ అంచనా వేసింది. పసిడి ధరలు 2025 ప్రారంభంలో కొత్త రికార్డు స్థాయికి చేరుకుంటాయని నివేదించింది. ఈ సంవత్సరం విలువైన లోహం 20% కంటే ఎక్కువ పెరిగింది.
ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపు, అభివృద్ధి చెందుతున్న మార్కెట్ సెంట్రల్ బ్యాంకుల ద్వారా బంగారం కొనుగోళ్ల కారణంగా వచ్చే ఏడాది ప్రారంభంలో ధర 2,700 డాలర్ల స్థాయికి చేరుకోవచ్చని గోల్డ్‌మన్ సాక్స్ పేర్కొంది. అమెరికా కొత్త ఆర్థిక ఆంక్షలు విధించినట్లయితే లేదా రుణ భారం గురించి ఆందోళనలు పెరిగినట్లయితే పసిడి ధరలు మరింతగా పెరగొచ్చని అంచనా వేస్తోంది. దీనికి ఇతర భౌగోళిక రాజకీయ ఆందోళనలు సైతం ప్రేరణగా నిలిచే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ తరుణంలో శుక్రవారం అంటే నేడు పసిడి ధరలు ఆకాశాన్ని దాటి వెళ్లిపోయాయి.

22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.12,000 పెరుగుదలను చూసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.6825, ముంబైలో రూ.6825, దిల్లీలో రూ.6840, కలకత్తాలో రూ.6825, బెంగళూరులో రూ.6825, కేరళలో రూ.6825, వడోదరలో రూ.6830, జైపూరులో రూ.6840, మంగళూరులో రూ.6825, నాశిక్‌లో రూ.6828, అయోధ్యలో రూ.6840, బళ్లారిలో రూ.6825, నోయిడాలో రూ.6840, గురుగ్రాములో రూ.6840 వద్ద కొనసాగుతున్నాయి.
ఇదే క్రమంలో 24 క్యారెట్ల గోల్డ్ ధర 100 గ్రాములకు నిన్నటితో పోల్చితే రూ.13,000 పెరుగుదలను నమోదుచేసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో పెరిగిన రిటైల్ విక్రయ ధరలను గమనిస్తే.. చెన్నైలో రూ.7445, ముంబైలో రూ.7445, దిల్లీలో రూ.7460, కలకత్తాలో రూ.7445, బెంగళూరులో రూ.7445, కేరళలో రూ.7445, వడోదరలో రూ.7450, జైపూరులో రూ.7460, మంగళూరులో రూ.7445, నాశిక్‌లో రూ.7448, అయోధ్యలో రూ.7460, బళ్లారిలో రూ.7445, నోయిడాలో రూ.7460, గురుగ్రాములో రూ.7460గా ఉన్నాయి.
ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖ, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.6825గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7445 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.3000 పెరుగుదలతో రూ.95,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.


Click it and Unblock the Notifications