Gold Price Today: తెలుగు ప్రజలు ఎంతో అద్భుతంగా జరుపుకునే పండుగ సంక్రాంతి. అయితే ఈ సారి ప్రజల్లో జోష్ బంగారం రేట్ల పెరుగుదలతో కొంత ఆవిరైంది. చాలా మంది ఆభరణాల షాపింగ్ ప్లాన్స్ వాయిదా కూడా వేసుకుంటున్నారు.
నేడు 22 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు నిన్నటితో పోల్చితే రూ.300 పెరుగుదలను నమోదు చేసింది. ఈ క్రమంలో దేశంలోని ప్రధాన నగరాల్లో రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.58450, ముంబైలో రూ.58,000, దిల్లీలో రూ.58,150, కలకత్తాలో రూ.58,000, కేరళలో రూ.58,000, పూణేలో రూ.58,000, వడోదరలో రూ.58,050, జైపూరులో రూ.58,150, సూరత్ లో రూ.58,050, మంగళూరులో రూ.58,000, నాశిక్ లో రూ.58,030, సేలంలో రూ.58,450, అయోధ్యలో రూ.58,150, బళ్లారిలో రూ.58,000, గురుగ్రామ్ లో రూ.58,150 వద్ద కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాముల ధర నిన్నటి కంటే రూ.320 మేర పెరిగింది. దేశవ్యాప్తంగా ముఖ్య నగరాల్లో రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.63,760, ముంబైలో రూ.63,270, దిల్లీలో రూ.63,420, కలకత్తాలో రూ.63,270, కేరళలో రూ.63,270, పూణేలో రూ.63,270, వడోదరలో రూ.63,320, జైపూరులో రూ.63,420, సూరత్ లో రూ.63,320, మంగళూరులో రూ.63,270, నాశిక్ లో రూ.63,300, సేలంలో రూ.63,760, అయోధ్యలో రూ.63,420, బళ్లారిలో రూ.63,270, గురుగ్రామ్ లో రూ.63,420గా ఉన్నాయి.
ఇదే క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని నగరాలైన గుంటూరు, నెల్లూరు, విజయవాడ, కాకినాడ, తిరుపతి, వైజాగ్, అనంతపురం, కడప, కర్నూలు, గుంటూరు, హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, కరీంనగర్ లలో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.58,000 వద్ద కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.63,270గా కొనసాగుతున్నాయి. ఇక ఏపీ, తెలంగాణలో వెండి ధరలను పరిశీలిస్తే.. ధర కేజీకి రూ.500 పెరిగి రిటైల్ మార్కెట్లో రూ.78,000 వద్ద కొనసాగుతున్నాయి.


Click it and Unblock the Notifications