Gold Rates: అమెరికా డాలర్ బలంగా కొనసాగటం, వడ్డీ రేట్లపై యూఎస్ ఫెడ్ ఛైర్మన్ వ్యాఖ్యలు బులియన్ మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. ప్రస్తుతం బంగారం తన సేఫ్ హెవెన్ స్థానాన్ని కోల్పోయిందని నిపుణులు చెబుతున్నారు.
నిన్నటితో పోల్చితే పసిడి ధర స్వల్పంగా పెరిగింది. ఈ క్రమంలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 100 రూపాయల మేర పెరిగింది. దేశంలోని వివిధ నగరాల్లో నేటి రేట్లను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.54,300, ముంబైలో రూ.53,950, దిల్లీలో రూ.54,100, కలకత్తాలో రూ.53,950, బెంగళూరులో రూ.53,950, కేరళలో రూ.53,950, వడోదరలో రూ.54,000, జైపూర్ లో రూ.54,100, లక్నోలో రూ.54,100, మధురైలో రూ.54,300, నాగపూర్ లో రూ.53,950, చంఢీగర్ రూ.54,100, కొచ్చిలో రూ.53,950గా కొనసాగుతున్నాయి.

ఇదే సమయంలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు రూ.100 పెరిగింది. ఈ క్రమంలో దేశంలోని వివిధ నగరాల్లో గమనిస్తే.. చెన్నైలో రూ.59,240, ముంబైలో రూ.58,850, దిల్లీలో రూ.59,000, కలకత్తాలో రూ.58,850, బెంగళూరులో రూ.58,850, కేరళలో రూ.58,850, వడోదరలో రూ.58,900, జైపూర్ లో రూ.59,000, లక్నోలో రూ.59,000, మధురైలో రూ.59,240, నాగపూర్ లో రూ.58,850, చంఢీగర్ రూ.59,000, కొచ్చిలో రూ.58,850గా ఉన్నాయి.
ఇదే క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో రేట్లను పరిశీలిస్తే.. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కడప, కాకినాడ, అనంతపురం, విశాఖపట్నంలలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.53,950, ఇక 24 క్యారెట్ల బంగారం రేటు రూ.58,850గా ఉంది. ఇదే సమయంలో తెలంగాణలోని హైదరాబాదు, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్ లలో కూడా ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

ఇదే సమయంలో దేశంలో గత రెండు రోజులుగా వెండి రేట్లు స్థిరంగా కొనసాగుతున్నప్పటికీ నేడు క్షీణతను నమోదు చేశాయి. ఈ క్రమంలో దేశంలో కిలో వెండిపై ధర రూ.500 తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర నేడు రూ.74,800 గా ఉంది.


Click it and Unblock the Notifications