ఈ వారం బంగారం కొనకండి, ధరలు ఇంకా తగ్గబోతున్నాయి..అసలైన కారణమేంటంటే..

ఈ మధ్య నింగిని తాకిన బంగారం ధరలు ఈ రోజు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయంతో పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. అమెరికా, జపాన్ మధ్య వాణిజ్య ఒప్పందంతో పాటుగా యూరోపియన్ యూనియన్‌తో చర్చల పురోగతి వచ్చింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్య యుద్ధ భయాలు కొంతవరకు తగ్గాయని చెప్పుకోవచ్చు. దీంతో పెట్టుబడిదారులు బంగారం మీద పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. ఇతర రంగాల వైపు తమ పెట్టుబడులను మళ్లించారు. దీంతో Gold ధరలు తగ్గుముఖం పట్టాయి.

అమెరికా ప్రభుత్వం జపాన్ వస్తువులపై 15 శాతం దిగుమతి సుంకాలు విధించనున్నట్టు ప్రకటించింది. ఈ ఒప్పందం సానుకూలంగా ఉండటంతో పాటుగా చర్చలు కూడా ఎటువంటి టెన్సన్స్ లేకుండా ముగిశాయి. దీనికి తోడు EUతో కూడా ఇలాంటి ఒప్పందం జరిగే అవకాశాలపై పాజిటివ్ సంకేతాలు వస్తున్నాయని ఫైనాన్షియల్ టైమ్స్ కథనం తెలిపింది. దీంతో పెరుగుతున్న బంగారానికి బ్రేక్ పడిందని చెప్పుకోవచ్చు. ఈ పరిణామాల మధ్య న్యూయార్క్ మార్కెట్‌లో బుధవారం మధ్యాహ్నం స్పాట్ గోల్డ్ ఔన్స్‌కు 1.3 శాతం తగ్గి 3,385.81 డాలర్ల వద్ద ట్రేడయ్యింది.

gold price drop US Japan trade deal EU trade talks global trade optimism gold market news gold trends 2025 gold futures safe haven assets commodities news economic trade relations gold investment news gold and dollar gold market analysis

భారతదేశం కూడా అమెరికాతో వ్యూహాత్మక వాణిజ్య ఒప్పందాల కోసం చురుకుగా చర్చలు జరుపుతోంది. ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ యునైటెడ్ కింగ్‌డమ్ (UK) పర్యటనలో ఉన్నారు. జూలై 23-24 తేదీలలో జరిగే ఈ రెండు రోజుల పర్యటనలో UK ప్రధానమంత్రి కీర్ స్టార్మర్‌తో చర్చలు జరుపనున్నారు. ఈ చర్చల్లో భారత్-బ్రిటన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA)పై సంతకం చేసే అవకాశముంది.ఈ ఒప్పందం రెండు దేశాల మధ్య ట్రేడ్, ఇన్వెస్ట్‌మెంట్, మౌలిక సదుపాయాలు, టెక్నాలజీ మేథస్సు భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు. ఇది కూడా Gold ధరల తగ్గుదలకు కారణమవుతోంది.

మోతీలాల్ ఓస్వాల్ ప్రెషియస్ మెటల్ విశ్లేషకుడు మానవ్ మోడీ ప్రకారం.. బంగారం గత కొన్ని నెలలుగా గరిష్ఠ స్థాయిలను తాకినప్పటికీ ఇప్పుడు ఒడిదుడుకు ఎదుర్కుంటోందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే జూలై 2025 లో బంగారం నుంచి పూర్తిగా వెనక్కి తగ్గకపోయినా.. కొంత లాభాల ను బుక్ చేసుకోవడం మంచి ఆలోచన అవుతుందని చెప్పుకొచ్చారు. దీర్ఘకాలికంగా బంగారం ధరలు పెరిగే అవకావం ఉంది కాబట్టి కొత్తగా కొనేవారు ఆచితూచి అడుగులు వేయడం ముఖ్యమని తెలిపారు. ఈ నేపథ్యంలోనే పెట్టుబడిదారులు వెండిని కొనడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

ప్రపంచ వాణిజ్యంలో అస్థిరత, పారిశ్రామిక వినియోగం పెరగడం వంటి అంశాల వల్ల వెండికి మంచి మద్దతు ఉన్నట్లు కనిపిస్తోందని చెబుతున్నారు. రిలయన్స్ సెక్యూరిటీస్ కు చెందిన జిగర్ త్రివేది కూడా బంగారం ధరలు కొంత తగ్గుతాయని అంచనా వేస్తున్నారు. ఆయన ప్రకారం రూ. 98,400 వద్ద బంగారాన్ని కొనుగులో చేయాలని సూచిస్తున్నారు. దాన్ని దాటితే కొనడం అంత మంచిది కాదని రిస్క్ లో పడతామని చెబుతున్నారు. ఏదేమైనా ఈ నెల (జూలై 2025) చివరి వారం మార్కెట్లకు కీలకం కానుంది.కేంద్ర బ్యాంకుల నుంచి కీలకమైన నిర్ణయాలు వచ్చే అవకాశం ఉన్నందున దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు బంగారం, వెండి రెండూ మంచి లాభాలను అందిస్తాయని తెలుస్తోంది. అయితే తక్కువగా వచ్చినప్పుడు కొనుగోలు చేయడం ఉత్తమమని చెబుతున్నారు.

జూలై 24న గురువారం బంగారం ధరలను పరిశీలిస్తే..24 క్యారెట్ల గ్రాము బంగారం ధర 136 రూపాయలు తగ్గింది. ప్రస్తుతం గ్రాము బంగారం ధర రూ.10,097 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారట్ల గ్రాము బంగారం ధర 125 రూపాయిలు తగ్గి 9,255 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 18 క్యారట్ల గ్రాము బంగారం ధర 102 రూపాయిలు తగ్గి రూ.7,573 వద్ద ట్రేడ్ అవుతోంది. 100 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 13,600 తగ్గి రూ. 10,09,700 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే 22 క్యారట్ల బంగారం ధర 100 గ్రాములు రూ.12,500 తగ్గి రూ. 9,25,500 వద్ద ట్రేడ్ అవుతోంది. 18 క్యారట్ల బంగారం ధర 100 గ్రాములు రూ. 10,200 తగ్గి రూ.7,57,300 వద్ద ట్రేడ్ అవుతోంది

డిస్క్లైమర్: ఈ వ్యాసం కేవలం సమాచారం కోసం మాత్రమే అందించబడింది. ఇది విలువైన లోహాలు, వస్తువులు, స్టాకులు లేదా ఇతర ఆర్థిక పెట్టుబడులను కొనుగోలు చేయమని లేదా అమ్మమని చెప్పడం కాదు. ఈ వ్యాసంలోని సమాచారం ఆధారంగా ఎవరైనా నష్టాలు లేదా సమస్యలను ఎదుర్కొంటే, గ్రేనియమ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థలు, భాగస్వాములు లేదా రచయితలు ఎలాంటి బాధ్యత వహించరు. కాబట్టి మీరు ఏవైనా లావాదేవీలు జరిపే ముందు నిపుణులు సంప్రదించి నిర్ణయం తీసుకోండి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+