బంగారం రూ.1.45 లక్షలు, వెండి రూ.2.27 లక్షలు.. గోల్డ్, సిల్వర్ ధరలపై నిపుణులు తాజా అంచనాలు ఇవే..

బంగారం, వెండి ధరలు ఏ క్షణం ఎలా మారుతున్నాయో అర్థం కావడం లేదు. పసిడి, సిల్వర్ ధరలు ఇటీవల కాలంలో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నప్పటికీ.. మార్కెట్‌లో తిరిగి కొనుగోళ్లు పెరిగితే MCX గోల్డ్ రూ.1.45 లక్షలు (10 గ్రాములు), MCX సిల్వర్ రూ.2.27 లక్షలు (కిలో) స్థాయిలను చేరుకునే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ లక్ష్యాలను చేరుకోవడం అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయాలు, డాలర్ బలం, ట్రెజరీ ఈల్డ్స్, ద్రవ్యోల్బణ గణాంకాలు, అలాగే మధ్యప్రాచ్య భౌగోళిక ఉద్రిక్తతలపై ఆధారపడి ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు

నువామా ప్రొఫెషనల్ క్లయింట్స్ గ్రూప్ ఫారెక్స్ & కమోడిటీస్ హెడ్ అభిలాష్ కోయిక్కర విశ్లేషణల ప్రకారం.. కొంతకాలంగా మార్కెట్లో బలహీనతను చవిచూసిన Gold, వెండి ధరలు ఇప్పుడు తిరిగి కోలుకునే స్పష్టమైన సంకేతాలను చూపిస్తున్నాయి. సాంకేతిక సూచికలను పరిశీలిస్తే.. సమీప భవిష్యత్తులో ఈ విలువైన లోహాల ధరలు మరింత పుంజుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయని చెబుతున్నారు.

Gold Price Prediction Silver Price Prediction Gold Outlook Silver Outlook MCX Gold MCX Silver Gold Price Today Silver Price Today Bullion Market Precious Metals Gold Forecast Business News MCX MCX

ఇటీవలి కాలంలో చోటుచేసుకున్న విక్రయాల ఒత్తిడి కారణంగా మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) లో బంగారం ధరలు ఓవర్‌సోల్డ్ జోన్‌లోకి ప్రవేశించాయి. మార్కెట్ విశ్లేషణల ప్రకారం.. ఇటువంటి పరిస్థితులు తరచుగా తక్కువ ధరకు కొనుగోళ్లు పెరగడానికి, షార్ట్ పొజిషన్ల కవరింగ్‌కు దారితీసి ధరల పునరుద్ధరణ ర్యాలీని సృష్టిస్తాయి. ప్రస్తుతం ఎంసీఎక్స్ మార్కెట్లో Gold ధరలకు రూ. 1,40,000 స్థాయి ఒక అత్యంత బలమైన మద్దతు ధరగా పనిచేస్తుందని అంచనా వేస్తున్నారు.

Also Read

ధరలు ఈ కీలక మద్దతు స్థాయికి పైన కొనసాగినంత కాలం పసిడి సెంటిమెంట్ బలంగా ఉంటుంది. దీనివల్ల రాబోయే సెషన్లలో బంగారం ధరలు రూ. 1,44,000 నుండి రూ. 1,45,000 మధ్యలో నిరోధక స్థాయిల వైపు కదిలేందుకు మార్గం సుగమం అవుతుంది. ఒకవేళ మార్కెట్ ఈ మద్దతు ధర కంటే కిందకు పడిపోతే మాత్రం అమ్మకాల ఒత్తిడి మొదలయ్యే ప్రమాదం ఉంది. ప్రస్తుత మార్కెట్ ధర (CMP) రూ. 1,42,000 వద్ద ఉన్న నేపథ్యంలో.. ట్రేడర్లు రూ. 1,45,000 లక్ష్యంతో కొనుగోళ్లు జరపవచ్చని.. అలాగే నష్టాలను నివారించడానికి రూ. 1,40,000 వద్ద స్టాప్ లాస్ పాటించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

బంగారు వ్యాపార వ్యూహం ఇదే..
CMP: 142,000 ( ప్రస్తుత ధర)
లక్ష్యం: 145,000 (కొనుగోలు ఆపే స్థాయి)
స్టాప్ లాస్: 140,000 ( కొనుగోలు చేసే స్థాయి)

వెండి వ్యాపార వ్యూహం ఇదే..
CMP: 221,500
లక్ష్యం: 227,000
స్టాప్ లాస్: 218,000

బంగారం బాటలోనే ఎంసీఎక్స్ వెండి ధరలు కూడా స్వల్పకాలంలో బలాన్ని పుంజుకునేందుకు సిద్ధంగా ఉన్నాయి. వెండికి సంబంధించిన మెజారిటీ మొమెంటం ఆసిలేటర్లు కూడా ఓవర్‌సోల్డ్ జోన్‌లోకి జారిపోవడంతో.. ఇటీవలి ధరల క్షీణత ముగింపు దశకు చేరుకుందని స్పష్టమవుతోంది. ఇది మార్కెట్లో తక్కువ ధరకు కొనుగోళ్లు పెరగడానికి.. షార్ట్-కవరింగ్ ర్యాలీ రావడానికి బలమైన అవకాశాలను కల్పిస్తోంది.

ప్రస్తుతం వెండి ధరలకు రూ. 2,18,000 వద్ద ఒక పటిష్టమైన మద్దతు లభిస్తోంది. ఇది ధరలు మరింత పతనం కాకుండా అడ్డుకుంటోంది. మార్కెట్ ఈ స్థాయికి పైన విజయవంతంగా నిలదొక్కుకుంటే, బుల్లిష్ సెంటిమెంట్ మరింత బలపడి కొత్త కొనుగోళ్లకు ప్రోత్సాహం లభిస్తుంది, తద్వారా ధరలు రూ. 2,27,000 నిరోధక స్థాయిని పరీక్షించే అవకాశం ఉంటుంది. ఒకవేళ రూ. 2,18,000 కంటే దిగువకు పడిపోతే మాత్రం ఆశించిన ధరలపై అదనపు ఒత్తిడి పెరుగుతుంది. ప్రస్తుత మార్కెట్ ధర (CMP) రూ. 2,21,500 వద్ద ఉండగా.. నిపుణులు రూ. 2,27,000 లక్ష్యంతో ట్రేడింగ్ వ్యూహాన్ని నిర్దేశించారు. ఇందుకోసం రూ. 2,18,000 వద్ద స్టాప్ లాస్ ఉంచుకోవడం సురక్షితమని ట్రేడర్లకు సిఫార్సు చేస్తున్నారు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+