బంగారం, వెండి ధరలపై నిపుణులు కీలక సూచన.. ఇన్వెస్టర్లు ఈ రేటు వద్ద స్టాప్ లాస్ పెట్టుకుంటే బయటపడతారు..

అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు ఒక్కసారిగా పుంజుకోవడంతో దేశీయంగానూ బంగారం ధరలు సరికొత్త గరిష్టాల వైపు దూసుకెళ్తున్నాయి. జూన్ 18న ఔన్సుకు 4,352 డాలర్ల పైకి చేరిన తర్వాత.. Gold ధరలు 4,333 డాలర్ల స్థాయికి రావడం ఇదే తొలిసారి. కమోడిటీ ఎక్స్ఛేంజ్ MCX లో స్పాట్ గోల్డ్ 10 గ్రాములకు అత్యధికంగా రూ. 1,47,647 ని తాకింది. ప్రస్తుతం బంగారం ధరలు బుల్లిష్ ధోరణిని కొనసాగిస్తుండగా.. వెండి కూడా క్రమంగా పుంజుకుంటోందని నువామా ప్రొఫెషనల్ క్లయింట్స్ గ్రూప్ ఫారెక్స్ & కమోడిటీస్ హెడ్ అభిలాష్ కోయిక్కర తెలిపారు.

సాంకేతిక సూచీలు ప్రకారం.. బంగారం, వెండి రెండింటిలోనూ ప్రస్తుతం సానుకూల ధోరణి కొనసాగుతోందని.. కీలక మద్దతు స్థాయిలు నిలబెట్టుకుంటే మరింత ర్యాలీకి అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఎంసీఎక్స్ గోల్డ్ ఇటీవల కన్సాలిడేషన్ దశ నుంచి బయటపడి.. తాజా స్వింగ్ హైస్ వైపు కదులుతోంది. ఇది మధ్యంతర బుల్లిష్ ట్రెండ్ కొనసాగుతోందనే సంకేతమని నిపుణులు చెబుతున్నారు.

Gold Price Prediction Silver Price Prediction Gold Price Today Silver Price Today Gold Outlook Silver Outlook Gold Investment Silver Investment MCX Gold MCX Silver Spot Gold Bullion Market Precious Metals Gold News Business News

ప్రస్తుతం రూ. 1,42,500 స్థాయి కీలక మద్దతుగా ఉండగా.. ఈ స్థాయి పైన Gold ధరలు కొనసాగినంత వరకు తగ్గుదలలను కొనుగోలు అవకాశాలుగా పరిగణించవచ్చని సూచించారు. అయితే రూ. 1,42,500 కంటే దిగువకు ధరలు పడితే ప్రస్తుత సానుకూల ధోరణిపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. మరోవైపు, బంగారం ధరలు రూ. 1,48,000 నుండి రూ. 1,52,000 స్థాయిలను తక్షణ నిరోధక (రెసిస్టెన్స్) లక్ష్యాలుగా చేరుకునే అవకాశాలు ఉన్నాయని విశ్లేషించారు.

Also Read

MCX గోల్డ్ ట్రేడింగ్ వ్యూహం ఏంటంటే..

ప్రస్తుత ధర (CMP): రూ. 1,46,100
లక్ష్యం (Target): రూ. 1,52,000
స్టాప్ లాస్ (Stop Loss):రూ. 1,42,500

MCX వెండి ధర అంచనా : ఎంసీఎక్స్ వెండి కూడా కన్సాలిడేషన్ నుంచి బయటపడి ప్రాథమిక అప్‌ట్రెండ్‌కు అనుగుణంగా కదులుతోంది. ప్రస్తుతం 2,20,000 స్థాయి బలమైన మద్దతుగా ఉండగా, ఈ స్థాయి పైన ధరలు కొనసాగినంత వరకు స్వల్పకాలిక దృక్పథం సానుకూలంగానే ఉంటుందని నిపుణులు తెలిపారు. వెండి ధరలకు రూ. 2,30,000 తక్షణ నిరోధక స్థాయి కాగా.. రూ. 2,38,000 ఈ వారానికి కీలక లక్ష్యంగా ఉంది. రూ. 2,30,000 పైన బలమైన ముగింపు నమోదైతే బుల్లిష్ ఊపు మరింత బలపడే అవకాశం ఉందని అంచనా వేశారు.

MCX వెండి ట్రేడింగ్ వ్యూహం ఏంటంటే..

ప్రస్తుత ధర (CMP): రూ. 2,25,800
లక్ష్యం (Target): రూ. 2,38,000
స్టాప్ లాస్ (Stop Loss): రూ. 2,20,000

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+