బంగారం, వెండి కొనుగోలుపై నిపుణులు కీలక సూచన.. ఈ ధర వద్దకు రాగానే కొనడం ఆపేయండి.. స్టాప్ లాస్ రేటు ఇదే..

భారత కమోడిటీ మార్కెట్ (MCX) లో బంగారం ధరలు ప్రస్తుతం ఒక నిర్దిష్ట పరిధిలో కన్సాలిడేషన్ (స్థిరత్వం) అవుతుండగా, వెండి ధరలు మాత్రం స్థిరంగా ఉంటూ పైకి కదిలే బలమైన సంకేతాలను ప్రదర్శిస్తున్నాయి.

నువామా ప్రొఫెషనల్ క్లయింట్స్ గ్రూప్, ఫారెక్స్ & కమోడిటీస్ హెడ్ అభిలాష్ కోయిక్కర ప్రకారం.. బంగారం మార్కెట్ ప్రస్తుతం సైడ్‌వేస్ (తాత్కాలిక స్థిరత్వం) నుండి బుల్లిష్ (పెరుగుదల) ధోరణిని నిలుపుకుంటోంది. మునుపటి ట్రేడింగ్ సెషన్లలో నమోదైన అత్యల్ప స్థాయిల వద్ద లభిస్తున్న సపోర్ట్ కారణంగా బేస్ ట్రెండ్ బలంగా ఉంది. అందువల్ల స్వల్పకాలికంగా ధరలు ఎక్కడైనా తగ్గితే, దానిని ఇన్వెస్టర్లు సరికొత్త కొనుగోలు అవకాశంగా మలచుకోవచ్చని సూచిస్తున్నారు.

gold price prediction silver price prediction gold outlook silver outlook gold price today silver price today bullion market precious metals gold investment silver investment inflation Federal Reserve commodity market safe haven assets gold forecast

ప్రస్తుత చార్టుల ప్రకారం బంగారం ధరలకు రూ. 1, 48,000 స్థాయి అత్యంత కీలకమైన వారపు మద్దతుగా (Key Support Level) నిలుస్తోంది. ధరలు ఈ జోన్‌కు తగ్గినప్పుడల్లా కొనుగోలుదారులు తిరిగి పుంజుకునే అవకాశం ఉంది. ఒకవేళ మార్కెట్ ముగింపు సమయానికి ధర ఈ స్థాయి కంటే దిగువకు పడిపోతేనే బుల్లిష్ ట్రెండ్ ముగిసి మరింత లోతైన కరెక్షన్ (ధరల తగ్గుదల) ప్రారంభమవుతుంది.

Also Read

అంతవరకు బంగారం తన తదుపరి నిరోధక స్థాయి (Resistance) అయిన రూ. 1, 60,000 లక్ష్యంగా ముందుకు సాగుతుంది. ప్రస్తుతం మార్కెట్ సెంటిమెంట్ ఆశాజనకంగా ఉన్నందున Gold ధరలు మరింత పెరిగేందుకే పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి.

MCX గోల్డ్ ట్రేడింగ్ స్ట్రాటజీ:
ప్రస్తుత మార్కెట్ ధర (CMP): రూ. 1, 52,400
తదుపరి లక్ష్యం (Target): రూ. 1, 60,000
స్టాప్ లాస్ (Stop Loss): రూ. 1,48,000

ఎమ్‌సీఎక్స్ (MCX) వెండి ధరల అంచనా

గత వారం నమోదైన కనిష్ట స్థాయిల నుండి వెండి అద్భుతంగా కోలుకుంది. వీక్లీ మూవింగ్ యావరేజ్ వద్ద వెండికి గట్టి మద్దతు లభిస్తుండటంతో దీని అంతర్లీన ట్రెండ్ చాలా సానుకూలంగా ఉంది. టెక్నికల్స్, మొమెంటం రెండూ అనుకూలంగా ఉన్నందున, రాబోయే సెషన్లలో వెండి ధరలు మరింత వేగంగా పైకి కదిలే అవకాశం ఉంది.

వెండికి ప్రస్తుతం రూ. 2, 35,000 స్థాయి అత్యంత కీలకమైన వారపు మద్దతుగా ఉంది. ఈ స్థాయి కంటే పైన ధర నిలదొక్కుకున్నంత కాలం బుల్స్ (కొనుగోలుదారులు) మార్కెట్‌పై పూర్తి పట్టు కలిగి ఉంటారు. ప్రస్తుత ఊపును బట్టి చూస్తే వెండి తదుపరి నిరోధక స్థాయి అయిన రూ. 2,65,000 దాటుకుని, ఈ వారానికి గాను రూ.2,70,000 తక్షణ లక్ష్యాన్ని ముట్టడించేలా కనిపిస్తోంది. ముగింపు నాటికి వెండి రూ. 2,70,000 మార్కును దాటి స్థిరపడితే భవిష్యత్తులో మరిన్ని భారీ లాభాలకు మార్గం సుగమం అవుతుంది.

MCX సిల్వర్ ట్రేడింగ్ స్ట్రాటజీ:
ప్రస్తుత మార్కెట్ ధర (CMP):రూ. 2, 49,000
తదుపరి లక్ష్యం (Target):రూ.2,70,000
స్టాప్ లాస్ (Stop Loss): రూ. 2, 35,000

మొత్తంగా చూసినట్లయితే మార్కెట్ ఒడిదుడుకులను తట్టుకుని నిలబడటానికి ట్రేడర్లు కచ్చితమైన స్టాప్-లాస్‌లను పాటిస్తూ, ట్రెండ్‌కు అనుగుణంగా కొనుగోళ్లు జరపడం సూచించదగిన వ్యూహం.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+