భవిష్యత్ బంగారం, వెండి ధరల మార్పులపై కీలక అప్‌డేట్.. పసిడి ప్రియులు వీటిపై కన్నేసి ఉంచాలని నిపుణులు సూచన..

భారతదేశంలో వెండి దిగుమతులపై ప్రభుత్వం విధించిన తాజా ఆంక్షలు, అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల కదలికలు, అమెరికా-ఇరాన్ వివాదం చుట్టూ నెలకొన్న భౌగోళిక రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో.. రాబోయే వారంలో Gold, Silver మార్కెట్లు తీవ్ర అస్థిరతకు గురయ్యే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రానున్న రోజుల్లో ఇన్వెస్టర్లు చైనా ఆర్థిక గణాంకాలు, అమెరికా గృహ నిర్మాణ రంగ డేటా, పీఎంఐ (PMI) నివేదికలు, వారపు నిరుద్యోగ క్లెయిమ్‌లతో పాటు ఎఫ్‌ఓఎంసీ (FOMC) సమావేశ నిమిషాలను నిశితంగా పరిశీలిస్తారని పీటీఐ నివేదిక పేర్కొంది.

గడిచిన వారంలో దేశీయ మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో బులియన్ మార్కెట్ బలమైన సానుకూల ధోరణిని ప్రదర్శించింది. బంగారం ఫ్యూచర్స్ ఏకంగా పది గ్రాములకు 6,017 (లేదా 3.94 శాతం) పెరిగి, రికార్డు స్థాయిలో ఒక లక్ష యాభై ఎనిమిది వేల రూపాయల వద్ద స్థిరపడింది. అదేవిధంగా వెండి ఫ్యూచర్స్ కూడా కిలోకు 9,964 రూపాయలు (లేదా మూడు పాయింట్ ఎనిమిది శాతం) వృద్ధి చెంది.. 2,71,000 రూపాయల మార్కు వద్ద ముగిసింది.

gold silver price prediction gold price forecast this week silver price outlook US Iran tensions impact on gold silver import curbs India bullion market volatility gold rates today silver rates today precious metals market MCX gold silver gold investment news silver market analysis bullion price prediction Middle East tensions and gold crude oil impact on gold prices safe haven assets gold silver trading news India silver import policy international bullion prices latest gold silver news

ఎల్‌కేపీ సెక్యూరిటీస్ విశ్లేషకులు జతీన్ త్రివేది అభిప్రాయం ప్రకారం.. అంతర్జాతీయ మార్కెట్లలో కొంత బలహీనత ఉన్నప్పటికీ, దేశీయంగా ఇటీవల ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని ఆరు శాతం మేర పెంచడం వల్లే ఈ స్థాయిలో ర్యాలీ కనిపించింది. వెండి దిగుమతులపై విధించిన ఆంక్షలు అంటే దేశీయంగా సరఫరా పూర్తిగా ఆగిపోవడం కాదు, వాటిని క్రమబద్ధీకరించడం మాత్రమే. ఇకపై రిజర్వ్ బ్యాంక్ (RBI) ద్వారా, డీజీఎఫ్‌టీ ఆమోదిత సంస్థల ద్వారా మరియు బులియన్ ఎక్స్ఛేంజ్ల ద్వారా మాత్రమే నియమిత ఏజెన్సీల సమక్షంలో నగల వ్యాపారులకు వెండి అందుతుంది.

కేవలం మూడు రోజుల వ్యవధిలో ప్రభుత్వం తీసుకున్న రెండు ప్రధాన విధానపరమైన నిర్ణయాలు దేశ ఫారెక్స్ (విదేశీ మారక నిల్వలు) నిర్వహణను సూచిస్తున్నాయి. వెండి దిగుమతులను పరిమితం చేయడం వల్ల తక్షణ డాలర్ ప్రవాహం తగ్గుతుందని, ఫలితంగా దేశీయ నిల్వలపై ఒత్తిడి తగ్గుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. దీనివల్ల వినియోగదారులు స్థానికంగా అధిక ధరలను ఎదుర్కొన్నప్పటికీ, అంతిమంగా దేశ విదేశీ ఖాతాను కాపాడుకోవడమే ప్రభుత్వ అసలు ఉద్దేశం.

Also Read

దీనికి పూర్తి భిన్నంగా గత వారం అంతర్జాతీయ బులియన్ ధరలు తీవ్ర ఒతిడిని ఎదుర్కొన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో కామెక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్సుకు దాదాపు 168 డాలర్లు (లేదా 3.6 శాతం) క్షీణించి 4,561 డాలర్ల వద్ద ముగిసింది. అలాగే సిల్వర్ ఫ్యూచర్స్ కూడా ఔన్సుకు మూడు డాలర్ల కంటే ఎక్కువ తగ్గి 77.54 డాలర్ల వద్ద స్థిరపడింది.

జేఎమ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వైస్ ప్రెసిడెంట్ ప్రణవ్ మేర్ విశ్లేషణ ప్రకారం.. భారత్, చైనా, అమెరికా వంటి ప్రధాన దేశాల నుండి ఏప్రిల్ నెల ద్రవ్యోల్బణ గణాంకాలు అంచనాల కంటే ఎక్కువగా రావడంతో, ప్రపంచవ్యాప్తంగా అమెరికా డాలర్ విలువ, బాండ్ ఈల్డ్స్ భారీగా పెరిగాయి. దీనివల్ల సమీప భవిష్యత్తులో యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల కోతలు ఉండవనే అంచనాలు బలపడి అంతర్జాతీయంగా బంగారం ధరలు నెమ్మదించాయి.

ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు వినియోగదారులలో ఒకటైన భారతదేశం, కరెంట్ అకౌంట్ లోటు (CAD) ఆందోళనల నేపథ్యంలో బులియన్ దిగుమతులను అరికట్టడానికి, డాలర్ కొనుగోళ్లను నియంత్రించడానికి కఠినమైన చర్యలు చేపట్టింది. ఈ నిర్ణయాలు కూడా అంతర్జాతీయ బులియన్‌పై భారాన్ని పెంచాయి.

మరోవైపు, అమెరికా-ఇరాన్‌ల మధ్య శాంతి ఒప్పందంపై స్పష్టత లేకపోవడం, కాల్పుల విరమణ అమలు, హార్ముజ్ జలసంధి దిగ్బంధం ఇంకా కొనసాగుతుండటంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు వారానికి ఎనిమిది నుండి పది శాతం చొప్పున పెరుగుతూ, బ్యారెల్‌కు వంద డాలర్లకు పైగా స్థిరంగా కొనసాగుతున్నాయి.

రాబోయే రోజుల్లో దేశీయ బులియన్ ధరలను ప్రభావితం చేసే కీలక అంశంగా రూపాయి కదలికలు నిలవనున్నాయి. జెరోమ్ పావెల్ ఎనిమిదేళ్ల పదవీకాలం ముగిసిన తర్వాత, కొత్తగా కెవిన్ వార్ష్ అమెరికా ఫెడరల్ రిజర్వ్ బాధ్యతలను స్వీకరించనుండటంతో, యూఎస్ ఫెడ్‌లో జరగనున్న ఈ కీలక పరివర్తనను, రాబోయే స్థూల ఆర్థిక పరిణామాలను మార్కెట్ పెట్టుబడిదారులు నిశితంగా గమనిస్తున్నారు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+