బంగారం , వెండి ధరలు ఎప్పుడూ ఇన్వెస్టర్లను ఆకర్షిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా 2025లో బంగారం 75% రిటర్న్స్ ఇస్తే.. వెండి ఏకంగా 167% లాభాలను అందించి ఈక్విటీలను సైతం వెనక్కి నెట్టేశాయి. అయితే 2026 లో ఈ లోహాల ధరలు కొంత మేర తగ్గడంతో (Correction), కొత్తగా పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఇది మంచి అవకాశంగా మారింది. కేవలం ఫిజికల్ గోల్డ్ మాత్రమే కాకుండా ఒకే మ్యూచువల్ ఫండ్ ద్వారా బంగారం, వెండి (Gold silver) రెండింటిలోనూ పెట్టుబడి పెట్టే అవకాశం ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది.

సాధారణంగా మనం బంగారం కోసం గోల్డ్ ఇటిఎఫ్ (ETF), వెండి కోసం సిల్వర్ ఇటిఎఫ్ విడివిడిగా కొంటుంటాం. కానీ, గోల్డ్ అండ్ సిల్వర్ మ్యూచువల్ ఫండ్ అనేది ఒకే స్కీమ్ ద్వారా ఈ రెండు లోహాల్లో పెట్టుబడి పెట్టే సౌకర్యాన్ని కల్పిస్తుంది. ఈ ఫండ్స్ నేరుగా భౌతిక బంగారం, వెండిని కొనడం లేదా ఆయా ఇటిఎఫ్ యూనిట్లలో ఇన్వెస్ట్ చేస్తాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఫండ్ మేనేజర్ బంగారం, వెండి మధ్య పెట్టుబడులను సర్దుబాటు (Rebalancing) చేస్తుంటారు. దీనివల్ల ఇన్వెస్టర్లకు రెండు లోహాల ధరల పెరుగుదల నుంచి లాభం పొందే అవకాశం ఉంటుంది.
ఈ ఫండ్లలో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి?
బంగారం, వెండిలో ఒకేసారి పెట్టుబడి పెట్టడం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..
- ఒకే స్కీమ్ - డ్యూయల్ బెనిఫిట్: రెండు వేర్వేరు ఫండ్స్‌ను ట్రాక్ చేసే పని లేకుండా ఒకే ఫోలియో ద్వారా బంగారం, వెండి (Gold silver) రెండింటి పనితీరును గమనించవచ్చు. ఇది సమయాన్ని, శ్రమను ఆదా చేస్తుంది.
- టాక్స్ సేవింగ్ రిబ్యాలెన్సింగ్: ఫండ్ మేనేజర్ త్రైమాసికానికి ఒకసారి బంగారం, వెండి నిష్పత్తిని మారుస్తుంటారు. ఇన్వెస్టర్ స్వయంగా ఒకదానిని అమ్మి మరొకటి కొంటే క్యాపిటల్ గెయిన్ టాక్స్ పడుతుంది. కానీ మ్యూచువల్ ఫండ్ లోపల జరిగే ఈ మార్పులకు ఇన్వెస్టర్ పన్ను కట్టాల్సిన అవసరం ఉండదు.
- భౌతిక భద్రత అవసరం లేదు: వెండిని భౌతికంగా దాచుకోవాలంటే ఎక్కువ స్థలం కావాలి. అలాగే బంగారం కోసం లాకర్ ఛార్జీలు, ఇన్సూరెన్స్ వంటి అదనపు ఖర్చులు ఉంటాయి. ఈ ఫండ్స్ ద్వారా డిజిటల్ రూపంలో ఉండటం వల్ల ఆ భయాలేవీ ఉండవు.
ప్రస్తుతం ఈ స్కీమ్స్ అందిస్తున్న కంపెనీలు (AMCs)
మన దేశంలోని ప్రముఖ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు ఈ తరహా ఫండ్లను అందుబాటులోకి తెచ్చాయి. వాటిలో కొన్ని ముఖ్యమైనవి ఇక్కడ ఉన్నాయి..
- Motilal oswal gold and silver ETF fof: ఇది ప్రారంభంలో 70% బంగారం, 30% వెండి నిష్పత్తితో మొదలైంది. బంగారం ధరలు తక్కువగా ఉన్నప్పుడు వెండి వోలటాలిటీని తట్టుకోవడానికి ఇది మంచి ఎంపిక.
- Edelweiss gold and silver ETF fof: ఈ స్కీమ్ బంగారం , వెండి మధ్య 50:50 నిష్పత్తిని కొనసాగించడానికి ప్రయత్నిస్తుంది. దీనివల్ల రెండు లోహాలకు సమాన ప్రాధాన్యత లభిస్తుంది.
- Axis gold and silver ETF fof: ఇది ప్రతి లోహానికి కనీసం 35% కేటాయింపులు చేస్తుంది. మిగిలిన 30 శాతాన్ని మార్కెట్ పరిస్థితులను బట్టి ఫండ్ మేనేజర్ ఎక్కడ ఎక్కువ లాభం ఉంటే అక్కడ ఇన్వెస్ట్ చేస్తారు.
- మిరే అసెట్ & కోటక్ మహీంద్రా: ఈ రెండు సంస్థలు కూడా క్వాంటిటేటివ్ మోడల్స్ ఆధారంగా బంగారం , వెండి కేటాయింపులను మారుస్తూ ఇన్వెస్టర్లకు గరిష్ట లాభాలు వచ్చేలా చూస్తాయి.
మొత్తంగా చెప్పాలంటే.. బంగారం, వెండి ధరలు కరెక్షన్ మోడ్‌లో ఉన్నప్పుడు ఇలాంటి 'కాంబో' ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం తెలివైన నిర్ణయం. ఒకే స్కీమ్ ద్వారా సులభంగా పెట్టుబడి పెట్టాలనుకునే వారికి, పన్ను ఆదా చేసుకోవాలనుకునే వారికి ఈ గోల్డ్-సిల్వర్ మ్యూచువల్ ఫండ్స్ ఒక అద్భుతమైన మార్గం. మీ అవసరాలకు తగ్గట్టుగా ఏ కంపెనీ కేటాయింపులు సరిపోతాయో చూసుకుని ఇన్వెస్ట్ చేయడం ఉత్తమం.
More From GoodReturns

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications