Gold Price Today: శుభవార్త.. తగ్గిన పసిడి ధరలు.. పండగ షాపింగ్ చేసేయండి..
Gold Price Today: పండుగ దగ్గర పడుతున్న కొద్ది ప్రజలు షాపింగ్ ప్రారంభిస్తున్నారు. ఇదే సమయంలో బంగారం ధరలు ఆకాశం నుంచి నేలకు దిగి వస్తున్నాయి. దీంతో పసిడి ప్రియుల్లో ఒక్కసారిగా సంతోషం నెలకొంది.
22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 10 గ్రాములకు రూ.100 మేర తగ్గింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో తగ్గిన రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.55,200, ముంబైలో రూ.54,900, దిల్లీలో రూ.50,050, కలకత్తాలో రూ.54,900, బెంగళూరులో రూ.54,900, కేరళలో రూ.54,900, వడోదరలో రూ.54,950, అహ్మదాబాదులో రూ.54,950, జైపూర్‌లో రూ.55,050, కోయంబత్తూరులో రూ.55,200, పాట్నాలో రూ.54,950, నాగపూర్‌లో రూ.54,900, నాశిక్ లో రూ.54,930, మైసూరులో రూ.54,900గా కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం రేటు నిన్నటి కంటే 10 గ్రాములకు రూ.110 మేర తగ్గింది. దేశంలోని వివిధ నగరాల్లో తగ్గిన రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.60,230, ముంబైలో రూ.59,890, దిల్లీలో రూ.60,040, కలకత్తాలో రూ.59,890, బెంగళూరులో రూ.59,890, కేరళలో రూ.59,890, వడోదరలో రూ.59,940, అహ్మదాబాదులో రూ.59,940, జైపూర్‌లో రూ.60,040, కోయంబత్తూరులో రూ.60,230, పాట్నాలో రూ.59,940, నాగపూర్‌లో రూ.59,890, నాశిక్ లో రూ.59,920, మైసూరులో రూ.59,890 వద్ద ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన.. విజయవాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, కాకినాడ, గుంటూరు, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ లలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,900గా కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.59,890గా ఉంది. ఇక ఈ నగరాల్లో వెండి ధరలను పరిశీలిస్తే.. కిలోకు నేడు రూ.700 తగ్గటంతో రూ.77,500గా రిటైల్ మార్కెట్లో విక్రయించబడుతోంది.


Click it and Unblock the Notifications