అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు సరికొత్త ఆల్‌టైమ్ గరిష్టాలకు చేరుకున్నాయి. డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్‌కు తిరిగి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా.. అలాగే 2026లో మరింత కొత్త రికార్డులు నమోదయ్యే సూచనలతో, విలువైన లోహాలపై విశ్లేషకుల అంచనాలు ఈ శతాబ్దంలోనే అత్యంత బుల్లిష్ స్థాయికి చేరుకున్నాయి. గత సంవత్సరం అంచనాలు తీవ్రంగా ఫెయిల్యూర్ అయినప్పటికీ ఈసారి మార్కెట్ నిపుణులు మరింత దూకుడైన లక్ష్యాలను ప్రకటించడం గమనార్హంగా చెప్పుకోవచ్చు.
లండన్ బులియన్ మార్కెట్ అసోసియేషన్ (LBMA) సేకరించి విడుదల చేసిన 2026 అంచనా సర్వే ప్రకారం.. ప్రొఫెషనల్ విశ్లేషకులు, వ్యాపారులు ఈ ఏడాది Gold సగటు రోజువారీ ధర 2025తో పోలిస్తే దాదాపు 40 శాతం పెరుగుతుందని భావిస్తున్నారు. అదే సమయంలో, వెండి వార్షిక సగటు ధర దాదాపు రెట్టింపు అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ రెండు అంచనాలు కూడా 2000ల ప్రారంభం నుంచి LBMA సర్వేల్లో ఇప్పటివరకు నమోదైన అత్యంత బుల్లిష్ సగటు అంచనాలుగా నిలిచాయి.
LBMA అంచనా పోటీలో గతంలో అత్యంత విజయవంతమైన విశ్లేషకులలో ఒకరైన మాజీ బ్యాంకింగ్, రిఫైనింగ్ ఎగ్జిక్యూటివ్ రాస్ నార్మన్.. ఈసారి వెలువడిన అంచనాలను వింతైనవిగా అభివర్ణించారు. తాజా సర్వేలో బంగారంలో ముగ్గురు, వెండిలో ఒకరు, ప్లాటినంలో నలుగురు, పల్లాడియంలో ఇద్దరు విశ్లేషకులు అత్యంత దూకుడైన అంచనాలతో అగ్రస్థానంలో నిలిచారు. ప్రస్తుతం 2026 కోసం ఏకాభిప్రాయ బంగారం అంచనా ఔన్సుకు సుమారు 4,742 డాలర్లకు చేరుకుంటుందని సూచిస్తోంది. ఇది 2025తో పోలిస్తే 1,310 డాలర్ల పెరుగుదలగా ఉంటుంది.

అయితే గత సంవత్సరం పరిస్థితి దీనికి పూర్తి విరుద్ధంగా ఉంది. 2025 కోసం చేసిన LBMA ఏకాభిప్రాయ అంచనాలు బంగారం ధరలో ఔన్సుకు సుమారు 1,045 డాలర్ల పెరుగుదలను ఊహించగా, వాస్తవానికి అది దాదాపు 700 డాలర్ల తక్కువగా నమోదైంది. డాలర్ పరంగా, శాతం పరంగా ఇది LBMA సర్వే చరిత్రలోనే అతిపెద్ద పరాజయంగా మారింది. వెండిలో కూడా ఇదే పరిస్థితి కనిపించింది. గత ఏడాది వెండి వార్షిక సగటు ధర ఔన్సుకు 40 డాలర్లుగా అంచనా వేసినా, వాస్తవ ఫలితం దాదాపు 8 డాలర్లు తక్కువగా నమోదైంది.
ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. 2026 కోసం వెండి సగటు ధర దాదాపు 98.8 శాతం పెరిగి ఔన్సుకు 79.50 డాలర్లకు మించవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం లండన్ మార్కెట్‌లో వెండి ఫిక్సింగ్ ధర ఔన్సుకు సుమారు 95.60 డాలర్లుగా ఉండటంతో.. LBMA పోటీలో ఉన్న 26 వెండి అంచనాలలో తొమ్మిది ఇప్పటికే తమ గరిష్ట అంచనాలను అధిగమించాయి.
ఈ ధరల ఉధృతి వెనుక భౌగోళిక-రాజకీయ పరిణామాలు కీలకంగా మారాయి. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సర్వే ప్రకారం.. రాజకీయ నాయకులు, ఫైనాన్షియర్లు, వ్యాపార వర్గాలు 2026లో ప్రపంచాన్ని ప్రభావితం చేసే అతిపెద్ద ప్రమాదంగా భౌగోళిక-ఆర్థిక ఘర్షణలను చూస్తున్నారు. అదే సమయంలో.. ప్రపంచ స్టాక్ మార్కెట్లు ఒత్తిడిలో ఉండగా, బాండ్‌లు, వస్తువుల ధరల్లో ఊగిసలాట కొనసాగుతోంది.
డొనాల్డ్ ట్రంప్ యూరోపియన్ నాటో మిత్రదేశాల నేతలతో గ్రీన్‌ల్యాండ్ అంశంపై చర్చలు జరపనున్న నేపధ్యంలో, యూరప్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ పరిణామాలన్నింటి మధ్య.. ట్రంప్ 47వ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత గత 12 నెలల్లో బంగారం ధరలు 75 శాతం కంటే ఎక్కువగా పెరిగాయి. ఇది 1973లో రిచర్డ్ నిక్సన్ రెండవ పదవీకాలం తర్వాత కనిపించిన అతిపెద్ద వార్షిక పెరుగుదలగా మార్కెట్ చరిత్రలో నిలిచింది.
LBMA 2026 అంచనాల ప్రకారం, బంగారం ధరల ట్రేడింగ్ పరిధి కనిష్టంగా ఔన్సుకు 3,450 డాలర్ల నుంచి గరిష్టంగా 7,150 డాలర్ల వరకు ఉండవచ్చని అంచనా. వెండిలో ఈ పరిధి ఇంకా విస్తృతంగా ఉండగా, కనిష్ట అంచనా 42 డాలర్లుగా, గరిష్ట అంచనా 165 డాలర్లుగా నమోదైంది. ఈ అంచనాలు నిజమవుతాయా లేదా అన్నది భవిష్యత్తు తేల్చాల్సి ఉన్నా.. ప్రస్తుత మార్కెట్ భావన మాత్రం విలువైన లోహాలపై అపూర్వమైన బుల్లిష్ ధోరణిని స్పష్టంగా చూపిస్తోంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.
More From GoodReturns

బంగారం, వెండి ధరలు: ఇరాన్ వార్ కారణంగా భారత్‌లో భారీగా పెరిగిన ధరలు - కారణాలు, ప్రభావాలు

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

బంగారం ధర పెరిగింది .. కొనుగోలు వెంటనే బంద్ చేయండి.. మార్చి 10, మంగళవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్‌లో నెలకొన్న హైప్..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

యుద్ధాన్ని వదిలి బంగారంపై కన్నేసిన చైనా.. టన్నుల కొద్ది పసిడి రహస్యంగా కొనుగోలు.. ధరల పెరుగదలపై ఆందోళన..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

బంగారం ధరల పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. సంచలన విషయాలను వెల్లడించిన SBI రీసెర్చ్..

బంగారం ధరలు ఢమాల్..ఈ రోజు ఎంత తగ్గిందో తెలిస్తే పండగ చేసుకుంటారు .. మార్చి 4,బుధవారం ధరలు ఇవే..

10 గ్రాములు బంగారం ధర రూ. 3 లక్షలకు చేరబోతోంది.. సంచలన అంచనాను విడుదల చేసిన క్రిస్ వుడ్..



Click it and Unblock the Notifications